STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అలుగకమ్మా

అలుగకమ్మా

1 min
371

పరిమళించే పూవులిచ్చే.. మల్లెతీగా అలుగకమ్మా..!!

అన్ని వేళల మధువులిచ్చే.. మల్లెతీగా అలుగకమ్మా..!!


వెండి వానలు వెదజల్లే వేద నాదము నీదు ప్రేమా..!!

తూచ జాలని సొగసులిచ్చే..మల్లెతీగా అలుగకమ్మా..!!


కోటి పూవుల రథము ఎదలో కోర్కెలన్నీ తీర్చు జాణా..!!

పలుక తోచని పదములిచ్చే..మల్లెతీగా అలుగకమ్మా..!!


నీలి మబ్బుల తెరలలోనా..నాట్యమాడే చినుకు వరదా..!!

ఆశయాలకు మెరుపులిచ్చే..మల్లెతీగా అలుగకమ్మా..!!


విరహ వేదన రూపుమాపే పాన్పు చేర్చే కోమలాంగీ..!!

కోటి వన్నెల వలపులిచ్చే..మల్లెతీగా అలుగకమ్మా..!!


మట్టి కణముల శ్వాస వనములు.. విరియజేసే మోహనాంగీ..!!

మనసు 'మనసు'కు కన్నులిచ్చే..మల్లెతీగా అలుగకమ్మా..!!


చెలియ సిగలో చేరి మురిసే..చెలిమి రాణివి..ఓ ప్రియా నీవే..!!

'ప్రియాతమావరములిచ్చే.. మల్లెతీగా అలుగకమ్మా..!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance