అలల అందాలు
అలల అందాలు
ఎంత ఉబలాటమో కదా కెరటానికి
ఉవ్వెత్తున ఎగసి పడాలని...
ఎంతటి ఆరాటమో కదా కడలికి
నింగిని అందుకోవాలని...
ఎంత ఉత్సాహమో చూడు
ఉత్తుంగ తరంగమై ఉరకాలని...
ఎంతటి ఆత్రుతనో
తీరం దరి చేరిపోవాలని..
ఎంత అలజడిని ఇముడ్చుకుందో
అంతే ఎత్తుకు ఎగురాలని..
ఎంత కల్లోలం దాచుకుందో
అల్లకల్లోలం అవుతుంది...
సముద్ర గర్భం శాంతించాలంటూ
సందేశమందిస్తోందో ఏమో..
చేయూతనిచ్చే చేయి అందనప్పుడు
నేలకంటుకోక పైకే లేవాలని చెప్పకనే చెబుతోంది..
నురగతరగలతో తేలియాడుతూ
అలా అలా ఆడుకుంటూ తేలిపోయే
ఆ అలల అందాలను ఆస్వాదించాల్సిందే మరి...
