అలజడేల
అలజడేల
ఏం గాలో ఇలా నను తరుముతుంది
ఏం మోహమో నను వీడకుంది.
అలజడి రేగిన మనసులో
అల్లరి ఊసులే నా కనులలో పిల్లగాలికి
నీలాల కురులు మోముపై నాట్యమాడుతుంటే
కొత్త కొత్త ఊసులేవో చెప్పకనే చెబుతుంటే
మనసులో చిలిపి ఊహలు చెలరేగి
మదిని మరుమల్లెలతో మత్తెక్కిస్తుంటే
అరవిరిసిన పెదాలలో చిరునగువు నర్తిస్తుంటే
ఏమో ఏమైంది ఈవేళ ఆ ఎదలో
ఈ సందడేల మదిలో ఈ అలజడేల...
.. సిరి ✍️❤️

