STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

1 min
182

*అక్షయతృతీయ పర్వదినం*

(కవిత )


అద్భుతమౌ స్వర్లోక గంగావతరణం

అంబుజాసన లక్ష్మీ యావిర్భావం

ఘన పరశురామ జయంతోత్సవం

వ్యాస భారతరచనా సామర్థ్యం

కృష్ణ కుచేల స్నేహ మాధుర్యం

యుగాలు మారినా చెరగని బంధం 

అన్నపూర్ణాదేవి యొక్క యనుగ్రహం

శంకరాచార్య తపోసాధనా ఫలితం 

కనకధారా వర్షపు కాంచన శోభనం

సింహాచలేశ్వరుని దివ్య దర్శనం

చందనోత్సవ సంరంభ సమారోహం

జప,తప ధ్యాన, పూజా సంయోగం

జయమునొసంగుట తధ్యం!తధ్యం!

ధర్మ కార్యాచరణ ప్రారంభమే సంపత్ప్రదం

దానగుణశీలతే ముక్తికి సోపానం

భగవత్కటాక్ష ప్రాప్యర్థం

వైశాఖమాసంములో దీక్షా ధారణం 

నియమ నిష్ఠలతో సర్వ ప్రజానీకం

జరుపుకొందురు విష్ణుమూర్తి యారాధనం 

తలుచు కొన్నవారికి పుణ్యప్రదం 

అక్షయతృతీయా పర్వదినం

సకల జనులకు సంతోష దాయకం.//


****************************


Rate this content
Log in

Similar telugu poem from Classics