STORYMIRROR

Phanikiran AK

Romance Inspirational Others

4  

Phanikiran AK

Romance Inspirational Others

అజ్ఞాత వాసి

అజ్ఞాత వాసి

1 min
326


సప్త స్వరాలు ఒక వైపు


నాలో సంగీతం పలికించే నీ తలపు ఓ వైపు


సప్తవర్ణాలు ఓ వైపు


నా బ్రతుకున రంగులు నింపే నీవొక వైపు


నను ని౦గిన రాజుగా నిలిపే తారాలోకం ఓ వైపు


నన్నే నీ రాజని మనసున నిలిపిన నీవొక వైపు


మా చెంత నిలు ..


ప్రపంచాన్ని చూపిస్తాము అనే జనం ఓ వైపు


నా చేయి పట్టు ...


ప్రపంచాన్ని నీముందే నిలబెడతాను అనే నీవొకవైపు


నీవు నడు ..


నీ వెనకే మేము అనే మాటలు ఓ వైపు


నీతోనే నా అడుగు అనే నీ మాట ఒకవైపు ..


అనునిత్యం నా వెంట ఉండి


నను నడిపిన నా దేవతా...


శిఖరాగ్రం పై నిలిచాను...


కానరావా కంటినిండుగా


విజయాన్ని చేరుకున్నా నీతోడే సాక్షిగా ..


వినలేనా నీ స్వరం ప్రకృతే సాక్షిగా ..


గెలుపుకు తోడుంటానని మాటయిచ్చావు


గెలుపు తీరం చేరానని వీడి వెళ్ళుట భావ్యమా ..


ఎచ్చట ఉన్నావు నేస్తమా?


వినగలేవా నా మనసు ప్రియతమా


కనిపించలేవా ఒక్కసారి ఓ అజ్ఞాతమా .


*********%%%%%%************


ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance