అద్భుతమైన
అద్భుతమైన
అద్భుతమే ప్రతి క్షణం అద్భుతమే..తిరిగి అలా రాదు గనక..!
ప్రతి అనుభవం అద్బుతమే సుఖాంతమే..తిరిగి అలా రాదు గనక..!
నీ కోసం ఆరాటం పిచ్చితనం.. మధుర మధురతరమేలే..!
ప్రేమంటే ఎల్లప్పుడూ ఇవ్వటమే..తిరిగి అలా రాదు గనక..!
నీ మనసే అపురూపం.. స్నేహసుమం.. వెలుగ పూల రథం కదా..!
ఆత్మీయతా మేఘమై కురవటమే తిరిగి అలా రాదు గనక..!
కన్నులలో ఏముందో..మూస్తేనే ..అసలు కాంతి ధనం చూడు..!
ఓ సాక్షిగా నిలిచి ఉండిపోవటమే..తిరిగి అలా రాదు గనక..!
ఉన్నదేది కాదు సత్యం..గ్రహిస్తేనే సుఖశాంతుల వర్షమోయ్..!
తనువు తోడు- నీడ నిజం తెలియటమే తిరిగి అలా రాదు గనక..!
