ఆటలు
ఆటలు
తేటగీతిమాలిక.
ఆటలాడంగ వస్తువు లచట లేవు
బుద్ధి కుశలత కల్గిన బుడత లపుడు
తీర్చి దిద్దుచు క్యారమ్సు తృప్తి మీర
నాడు కొనుచుండి మురిసిరి హాయిగాను
తెలివి యున్నట్టి బాలలు దివ్యమైన
భావి తరమును నడిపించు పౌరులనగ
స్ఫూర్తి వంతులై మనజాతి కీర్తి నిలుపు
పసిడి కొండలు వారకి పలికి జయము
నంద చేయంగ రండి మీ యాశిషములు!//