ఆశతో...
ఆశతో...
కరకు కాలం కరిగిపోతూనే ఉంటుంది.............
లాభనష్టాలు దానికి లేవు...............
సుఖదుఃఖాలు అసలు లేవు............
గాయాలు , మాయలు తెలియవు..............
మనసుంటే మమతలు తెలిసేది.............
ప్రేమ ఉంటే జాలి ఉండేది..............
సాయం చేసే మనసుంటే కనికరించేది...........
అవినీతికి అర్ధం తెలిస్తే............
కాలం కలిసి వచ్చేది కాదేమో !!
అధికారమూ , అహంకారమూ తెలిస్తే............
అదుపు చేసేదేమో !!
కలతలు , కన్నీళ్ళు తెలిస్తే............
కళ్ళు తుడిచేదేమో !!
నీరు నిండిన మబ్బులు తనలోనే ఉన్నా.............
అసలు తడవని గగనంలా.............
తనకేం పట్టనట్టు సాగిపోయే కాలచక్రంలో..............
మరో రోజు గడిచిపోయింది !!
తెలియని వరాల మూట తెస్తుందేమో............

