ఆశల సాధం
ఆశల సాధం
ఆసరా కాలేని అపనమ్మకాల ఆశల సౌధం
కూలినపుడు వచ్చిన శబ్దం
ముక్కలైన మనసుది
మౌనంలో కలిసిపోయి
పగిలిన అద్దంలా మిగులుతుంది
క్షణమైనా నిలవని కలలతో
కాలాన్ని బంధించాలని అత్యాశ పడితే
అందుకోలేక ఆగిన పయనం
అడుగులు తడబడుతుంటే
చేతల్లో మసకబారి
కాటుక కళ్ళను కన్నీరై తడుపుతుంది....
