ఆశ జీవి
ఆశ జీవి
రోజుకో రోజు
మెత్తగా వొత్తిగిలబడి
రేపటిలోకి జొరబడుతున్నాననుకుని
నిన్నటిలోకి జారిపోతుంది
చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నట్టు
కాలం కూడా...
రోజుకో నల్ల వస్త్రాన్ని కప్పుతూ..
ఇన్ని అందాల్ని కప్పెడుతూ!
లోపల మోగుతున్న గంట కే జవాబూ దొరకదు
మౌనంగా ఆమె కొన్ని సముద్రాలను
రెప్పల మాటున దాచేస్తుంది
దాటిన సముద్రాల అనుభవం లో
ఇరువురూ శృతి చేసుకున్న ఒక రాగం
ముందు తన పటమే వేలాడదియ్యమంటుంది
ఒకరి నొకరు అమాయకులనుకుంటూ
తధాస్తూ అనని దేవుడు
ఎప్పటిలాగే మౌనంగా ఉంటాడు
కళ్ళల్లో పొద్దులు తెల్లవారుతుంటాయి
ఒక తెరవని ఉత్తరం లో
తెలిసే జవాబు!
... సిరి ✍️❤️

