Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ఈవని రవిశంకర శర్మ

Romance

4.5  

ఈవని రవిశంకర శర్మ

Romance

ఆ రాత్రి ఆ గదిలో ..!

ఆ రాత్రి ఆ గదిలో ..!

1 min
377


రమేష్ , రమ్య పల్లెటూరులో కొత్తజంట .

ఈ మధ్య జరిగిన వివాహాం వారికి ప్రేమపంట .

ఊళ్ళోలేక ఒంటరైన ఆ పక్షులు మళ్ళీ కలిసే రోజది .

అతనికి ఇల్లు చేరేసరికి బాగా పొద్దు పోయింది .

గదిలో మాటల గలగలలు ఆ రాత్రి హడావుడి .

గుసగుసలతో ఇరుగుపొరుగుకు మహాసందడి .

భార్య చేతివంటను అమితంగా ఇష్టపడే వానికి

మదిలో మెదిలె అమృతమనే భావన .

మరిన్ని విశేషాలు కురిసె కలసి ఆరగించిన పిమ్మట .

నడిరేయి బయట పండువెన్నెలకు కొండ కోనల మెరుపు ,

చల్లని గాలికి చెట్టు చేమల మైమరపు .

కృష్ణ , రాధను తలపిస్తూ వారిద్దరిలో పారవశ్యము .

వెచ్చని మమతల లోగిలిలో ముద్దు , మురిపెము .

ఆకాశంలో మబ్బులు నిశ్శబ్దంగా ఏకమైనట్లు .

స్వర్గలోకపు శిఖరాలను సుఖంగా స్పర్శించినట్లు .

ముఖాల్లో మర్నాడు కనిపించిన చిరునవ్వులు

గాలివాన తర్వాతి ప్రశాంతతను తలపించెనని

అందరూ తమకు తాము చెప్పుకొని సంతోషించె .

కమ్మని నేతి అరిసెల , జంతికల రుచిని ఆస్వాదించె .

********************************



Rate this content
Log in