Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
389


              ఎపిసోడ్ -23

రిథిమా స్టోర్ రూంలో గన్ సౌండ్ విని కబీర్ ని చంపేశారేమో అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది.రిథిమాని తీసుకెళ్లడానికి తన రూంకి వచ్చిన ఇషాని డోర్ కొడుతుంది.డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇషాని లోపలికి వెళ్తుంది అక్కడ రిథిమా లేకపోవడం చూసి Thank god అన్నయ్య తప్పించుకున్నాడు మిడిల్ క్లాస్ ట్రాష్ బాక్స్ లాంటి అమ్మాయి నుంచి ఈ గుడ్ న్యూస్ అందరికి చెప్పాలని కిందకి వస్తుంది.వంశ్ నానమ్మ ఇషాని ఒంటరిగా రావడం చూసి రిథిమాని ఎందుకు తీసుకొనిరాలేదని అడుగుతుంది.అందుకు ఇషాని నాకు ముందే డౌట్ వచ్చింది మీ కాబోయే కోడలి మీద తను రెడీ అవ్వడానికి ఇష్టపడనప్పుడే ఇప్పుడు నా అనుమానమే నిజం అయింది తను పారిపోయింది అంటుంది.ఇషాని మాటలు విన్న వంశ్ కి చాలా కోపం వస్తుంది.అందరూ షాక్ అవుతారు ఇషాని మాటలకి. వంశ్ నానమ్మ రిథిమా అలాంటి అమ్మాయి కాదు అంటుంది.సియా కూడా సరిగా రూమ్ చెక్ చేసావా రిథిమా ఎక్కడైనా ఉందేమో అంటుంది.అందుకు ఇషాని తనేం ప్యాలస్ లో లేదు తను కనపడకుండా ఉండటానికి చిన్న గది అది పారిపోయింది తను అంటుంది.చంచల రిథిమా తనకి కనిపించిందని ఇందాక మేకప్ టచ్ అప్ చేసుకోవడానికి సియా రూమ్ కి వెళ్లిందని తను వెళ్లిన వైపు చూపిస్తుంది.సియా అటువైపు కాదు కదా నా రూమ్ అంటుంది.ఇలా ఎలా జరిగింది అని వంశ్ నానమ్మ అనగానే ఆర్యన్ నేను వెళ్లి చెక్ చేస్తాను అని వెళ్తాడు.వంశ్ పెళ్లి పీటల మీద నుంచి లేవబోతాడు కానీ వంశ్ నానమ్మ నువ్వు లేవకు వంశ్ అపశకునం అవుతుంది ఆర్యన్ వెళ్ళాడు కదా చూస్తాడు అంటుంది.వంశ్ తన నానమ్మ మాటలు విని అలాగే కూర్చుంటాడు తిరిగి పెళ్లి పీటల పైన.

రిథిమా కబీర్ కి ఏదో జరిగిందని షాక్ అయ్యి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వంశ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు.

చంచల- మంచిది అయింది నేను తనకి బంగారం కానుక ఇవ్వలేదు. లేకపోతే నేను ఇచ్చిన కానుక కూడా నగలతో పాటు తీస్కెళ్లిపోయేది.

అనుప్రియ-ఏదో జరుగుతుందని అనిపిస్తూ ఉనింది నాకు.ఈ అమ్మాయి ఎప్పుడు పారిపోవడానికి ట్రై చేసేది ఇప్పుడు ఎవరికీ మనం మొహం చూపించుకోకుండా చేసింది.

వంశ్ -కోపంగా రిథిమా అంటాడు.

రాజ్ -కబీర్ ని కాకుండా వేరే కేటర్ అతన్ని పట్టుకొని షీరా ఎక్కడ ఉంది అని తన పైన గన్ పెట్టి అడుగుతూ ఉంటాడు. 

కేటర్ -నాకేం తెలియదు అంటాడు. 

రాజ్ -అయితే పైకి ఎందుకు వెళ్ళావు

కేటర్ -నా భార్య హాస్పిటల్ ఉంది తను pregnant తన డెలివరీ గురించి తెలుసుకుందామని ఇక్కడ సిగ్నల్స్ లేవని పైకి వెళ్ళాను.

రిథిమా కబీర్ దగ్గరికి వెళ్లాలని బయటికి వెళ్లాలని డోర్ తీస్తూ వుండగా కబీర్ యే లోపలికి వస్తాడు.రాజ్ కబీర్ ని కాకుండా మొబైల్ లో సిగ్నల్ కోసం చూస్తున్నా వేరే కేటర్ ని శత్రువు అనుకోని తీసుకెళ్తాడు.

కబీర్- రిథిమా స్టోర్ రూంలో ఉండటం చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.రిథిమా కబీర్ కి ఏం కాలేదని చూసి తనని ఏడుస్తూ కౌగిలించుకుంటుంది.

కబీర్ -ఏమైంది రిథిమా ఎందుకు ఏడుస్తున్నావు. Are you ok అని అడుగుతాడు తనని.

రిథిమా-కబీర్ నీకేం కాలేదు కదా గన్ సౌండ్ విని నేను అని ఏం చెప్పకుండా ఏడుస్తుంది.

కబీర్-నాకేం కాలేదు రిథిమా iam fine.రాజ్ రావడం చూసి నేను దాక్కున్నాను అతను వేరే అతన్ని పట్టుకున్నాడు.

రిథిమా-నా ప్రాణం పోయినంత పని అయింది కబీర్ పిచ్చి ఎక్కింది .షీరా దొరికిందా అని అడుగుతుంది

కబీర్ -షీరా లేదు చంచల రూంలో అని కబీర్ frustrate అవుతాడు.

రిథిమా-అక్కడే ఉండాలి షీరా ఏమైపోయింది.ముందు మనం ఇక్కడ నుండి బయటికి పడాలి ముందు త్వరగా వంశ్ మనలన్నీ చూస్తే చంపేస్తాడు.ప్లీజ్ పద వెళదాం మనలన్ని వంశ్ చూసేలోపు.

కబీర్ -no రిథిమా ఐ డోంట్ కేర్.వంశ్ ని పట్టుకోవడం నా జీవితం కన్నా చాలా ముఖ్యం.దాగుడుమూతలు చాలా ఎక్కువయ్యాయి ఇక వంశ్ ఎదురు నిలబడే సమయం వచ్చేసింది.

వంశ్ పెళ్లి పీటల మీద నుంచి లేచి తన తల మీద ఉన్న తలపాగా తీసేసి కోపంగా విసిరి కొట్టి వంశ్ నానమ్మ పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వంశ్ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతూ ఉంటుంది.

రిథిమా -కబీర్ బయటికి వెళ్తుంటే వంశ్ ని ఎదురుకోవడానికి రిథిమా ఆపుతుంది.ప్లీజ్ కబీర్ వెళ్లొద్దు.వంశ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి .నిన్ను వంశ్ చూస్తే చంపేస్తాడు.ఇలాంటి అవకాశాలు నీకు చాలా దొరుకుతాయి.ప్లీజ్ వెళ్ళిపోదాం నాకోసం పద అంటుంది.

కబీర్ కోపంగా పక్కన ఉన్న టేబుల్ ని చేతితో కొడతాడు దాని పైన ఉన్న ఫ్లవర్ వాజ్ కదులుతుంది ఆ సౌండ్ అటుగా వెళ్తున్న వంశ్ కి వినిపిస్తుంది.వంశ్ స్టోర్ రూమ్ డోర్ దగ్గరికి వస్తాడు.కబీర్ ఏదైనా కానీ అని కబీర్ కూడా డోర్ దగ్గరికి వెళ్లి నిలబడతాడు.రిథిమా టేబుల్ పైనుండి వాజ్ కింద పడకుండా పట్టుకుంటుంది.వంశ్ డోర్ ఓపెన్ చేయబోతుండగా రాజ్ వస్తాడు.

వంశ్ -అతను ఏమైనా చెప్పాడా అంటాడు .

రాజ్ -sorry boss మనం పొరపాటున వేరే వ్యక్తిని పట్టుకున్నాము.

వంశ్ -మరి రిథిమా ఎక్కడ ఉంది

రాజ్ -అంతా వెతికేసాను రిథిమా ఎక్కడ కనిపించలేదు.

వంశ్ కోపంగా వెళ్ళిపోతాడు.

రిథిమా -వంశ్,రాజ్ వెళ్లిపోయాక ప్లీజ్ కబీర్ వంశ్ తన మనుషులతో ఇక్కడికి రాకముందే వెళ్ళిపోదాం ప్లీజ్ అని కబీర్ కి  దండం పెడుతుంది.

కబీర్ రిథిమాని తీసుకొని స్టోర్ రూమ్ నుండి బయటికి వెళ్ళడానికి ఉన్న డోర్ లోకి వెళ్తారు .వంశ్ మళ్ళీ హాల్ లోకి వస్తాడు.

వంశ్ నానమ్మ- దొరికిందా రిథిమా అని అడుగుతుంది .

వంశ్ -లేదు 

నానమ్మ -రిథిమా అలాంటి అమ్మాయి కాదు ఇలా అంతా వదిలేసి వెళ్ళదు నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో అంటుంది .

 వంశ్- యే ప్రశ్నకు కూడా అంతా ధైర్యం లేదు నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి కొంచెం సమయం వేచి ఉండండి అన్ని బయటికి వచ్చేస్తాయి.పిన్ని కొంచెం సేపటి ముందే తనని చూసింది అంటే తను ఇంట్లోనే ఉంది.

అనుప్రియ -అవకాశం కోసం చూస్తూ ఉందేమో ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి అంటుంది.

వంశ్ -నా అనుమతి లేకుండా ఇక్కడ నుండి మనిషి కాదు కదా వాళ్ళ ఆత్మ కూడా బయటికి వెళ్ళలేదు.

వంశ్ కోపంగా పైకి వెళ్తాడు.కబీర్ రిథిమా బ్యాక్ యార్డ్ వైపు వస్తారు ఎవరివో అడుగుల సౌండ్ విని దాక్కొంటారు.ఆర్యన్ వచ్చి చెక్ చేసి వెళ్ళిపోతాడు.వంశ్ గన్ తీసుకొని నాకైతే తెలియదు నా శత్రువులు నిన్ను ఏమైనా చేసారా లేదా నువ్వే నా శత్రువివా.నా రెండు అనుమానాలు నిజం కాకూడదు అదే నీకు మంచిది అని గన్ రెడీ చేసుకొని రిథిమా రూమ్ కి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు.రిథిమా,కబీర్ బయటికి వెళ్లే దారి వైపుకి వచ్చేస్తారు.వంశ్ కోపంగా గన్ తీసుకొని బ్యాక్ యార్డ్ వైపు రిథిమాని వెతుకుంటూ వస్తాడు.వంశ్ నువ్వు ఎక్కడ ఉన్న రిథిమా నా కళ్ళు నిన్ను వెతికి పట్టుకుంటాయి నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళలేవు అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు.రిథిమా పైట ఒక చెట్టు కొమ్మకి ఇరుకుంటుంది తను కబీర్ ని హెల్ప్ చేయమని పిలుస్తుంది.కబీర్ వంశ్ రావడం చూసి ఇద్దరు దాక్కుంటారు వంశ్ కి కనపడకుండా.వంశ్ వెళ్ళిపోయాక రిథిమా కబీర్ వెళ్దాం పద అనగానే కబీర్ తన గన్ తీసుకొని రిథిమాని వెళ్ళిపోమంటాడు.

చంచల -రోడ్ మీద పడి ఉన్న ఒక అనాధ అమ్మాయిని ఈ ఇంటి కోడలిని చేద్దామనుకున్నారు తను మొత్తం నగలు తీసుకొని పారిపోయింది.తక్కువ స్థాయి వాళ్ళు కానీ వాళ్ళ దురాశ చాలా పెద్దది.

నానమ్మ -చంచల రిథిమా ఇంకా ఈ ఇంటికి కాబోయే కోడలే ఏదైనా మాట అనే ముందు ఆచితూచి మాట్లాడు అది నీ పైనే పడుతుంది.నా చూపు మందగించిందే కానీ నా బుద్ది మందగించలేదు.

ఎవరివో అడుగుల సౌండ్ వినిపిస్తుంది వంశ్ ఫ్యామిలీ అందరూ సౌండ్ వచ్చిన వైపు చూస్తారు రిథిమా వస్తుంది.వంశ్ రిథిమా కనిపించకపోయేసరికి frustrate అయ్యి కోపంతో గన్ కింద పడేసి రిథిమా నా శ్వాస కూడా నా అనుమతి లేకుండా పోదు నువ్వు ఎలా వెళ్తావు అనుకుంటూ వుండగా వంశ్ ని నానమ్మ పిలుస్తుంది.వంశ్ వచ్చి చూసేసరికి రిథిమా పెళ్లి మండపానికి వచ్చేస్తుంది.నానమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు రిథిమా అని అడుగుతుంది.వంశ్ రిథిమా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు.నానమ్మ నీకు ఏం కాలేదు కదా బానే ఉన్నావు కదా ఏదో ఒకటి చెప్పు అంటుంది రిథిమా మౌనంగా ఉండేసరికి.రిథిమా కబీర్ తో జరిగినది గుర్తు చేసుకుంటుంది కబీర్ తనని వెళ్ళమనగానే కబీర్ దగ్గరికి వచ్చి రిథిమా వంశ్ చూస్తే మనలన్నీ చంపేస్తాడు పద అనగానే కబీర్ వంశ్ చంపడం కాదు నేనే చచ్చిపోతాను కానీ నేను వంశ్ చేతిలో చావను నా గన్ తోనే నా ప్రాణాలు తీసుకుంటాను .అంతే కానీ చేతకానివాడిలా ఇక్కడ నుండి పారిపోను.నా మిషన్ వంశ్ ని పట్టుకోవడం నాకు మెడల్ అక్కర్లేదు నా చావే నా మెడల్.నేను గర్వంగా నా గన్ తోనే కాల్చుకొని చచ్చిపోతాను అని కబీర్ తన గన్ తన talaki గురి పెట్టుకుంటాడు.రిథిమా ఆపాలని చూసిన ఆగడు.తన కణతకి గురి పెట్టుకొని iam సోల్జర్ of law ఒకటి యుద్ధంలో గెలవాలి రెండు యుద్ధంలో చావాలి నేను అదే చేస్తాను.కబీర్ ఇదే జీవితం కాదు అని గన్ లాక్కోబోతుంది.కబీర్ తనకి అవకాశం ఇవ్వడు.వంశ్ రాయ్ సింఘానియాని జైల్ కి పంపడమే నా జీవితం కన్నా పెద్ద లక్ష్యం నాకు నేను ఈరోజు నా లక్ష్యం సాధించలేక ఓడిపోయాను అంటాడు.అందుకు రిథిమా కబీర్ నీ లక్ష్యం సాధించడానికి వేరే దారి వెతుకుదాం అంతే కానీ ఇలా పిచ్చితనంతో ప్రాణాలు తీసుకోకు ప్లీజ్ అని ఏడుస్తుంది.కబీర్ రిథిమా మాటలు పట్టించుకోకుండా గన్ aim చేసుకుంటాడు కబీర్ .రిథిమా కబీర్ ఆలోచనల నుండి బయటికి వచ్చి తన చేతికి అంటుకొని ఉన్న రక్తాన్ని చూసుకుంటుంది.వంశ్ రిథిమా వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు.



Rate this content
Log in

Similar telugu story from Thriller