STORYMIRROR

Dinakar Reddy

Abstract Action Inspirational

4  

Dinakar Reddy

Abstract Action Inspirational

ఫ్లోరైడ్ రక్కసి

ఫ్లోరైడ్ రక్కసి

1 min
552

ఏమిట్రా ఈ అర్జీలు. ఈ కాలంలో ఇంకా అర్జీలు పెడుతూ కూర్చుంటావా? రాజాను అడిగాడు మధు.


తప్పదురా. అర్జీ పెట్టాలి. సోషల్ మీడియాలో కూడా ఎవ్వరూ పెద్దగా షేర్ చేయట్లేదు అన్నాడు రాజా.


సరేరా. ప్రతి వీకెండ్ అర్జీలు పెట్టమని, సోషల్ మీడియాలో షేర్ చెయ్యమని మన స్నేహితులందరికీ చెప్తాను అన్నాడు మధు.


ఫ్లోరైడ్ బాధితుల ఇబ్బందుల గురించి రాజా పెట్టిన అర్జీలు, అతని ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు చూసి స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు స్పందించారు.

అన్ని రక్షిత మంచినీటి పథకాల సౌకర్యాలను, నీటి సరఫరాను చెక్ చేసి తగిన చర్యలు తీసుకున్నారు.


ఫ్లోరైడ్ బాధితుల కోసం, ఫ్లోరైడ్ నీటి వల్ల వచ్చే సమస్యల నిర్మూలన కోసం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకాలు కొన్ని గ్రామాల్లో సరిగ్గా పని చేయడం లేదు. శుద్ధ జలాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


ఈ విషయాల్ని రాజా ఇంకా అతని స్నేహితులు సరి చేయాలనుకున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో కలిసి ముందుకు నడిచారు. ఒక మంచి పనికి సాధించారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract