Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Classics

4.9  

jayanth kaweeshwar

Classics

కవితా పూరణం

కవితా పూరణం

1 min
720



దత్తపాదం : 


" ఆయుర్ వృద్ధికి నిడదగు హాలాహలమున్ "


పూరణం :


క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్  

క్షర జీవ రాసుల అక్షర యత్నము జేసెశ్రీకంఠుడున్ ర 

క్ష జే యు పలు వైద్య విధాన పరంపరమాత్రల నందుదీ 

క్ష చే రోగుల ఆయుర్ వృద్ధి కి నిడదగు హాలాహలమున్ 


ప్రతిపదార్థం : 


1. క్షీర సాగర మథనం : పాల కడలిని చిలకగా 

2. తొలుత వెలువడిన : మొట్టమొదటగా పుట్టిన 

3. గరళమున్        : కాలకూట విషమును 

4. క్షర జీవరాసుల     : నశించి పోయే ప్రాణుల 

5. అక్షర ప్రయత్నము : కొంతకాలము నశించి పోకుండగాచేసెడి 

6. శ్రీ కంఠుడు న్      : గరళ కంఠుడు ( శివుడు )

7. రక్ష చేయు         : రక్షించెడు 

8. పలు వైద్య విధాన  : వైద్య విధాన పద్ధతులలో 

9. పరంపర మాత్రల నందు : వైద్యగుళికలు / మాత్రలు , ఔషధాలు అందులో  

10. దీక్ష చే : తయారుచేయు ప్రయత్నము తో 

11. రోగుల ఆయుర్ వృద్ధికి : రోగులయొక్క ఆయుష్షు ను వృద్ధి పరచుటకు 

12. నిడదగు హాలాహలమున్ : కొన్ని రకాల విషయాలను కూడా ఉపయోగిస్తారు .


 భావం 


పాల కడలిని చిలకగా మొట్టమొదటగా పుట్టిన కాలకూట విషమును   నశించి పోయే ప్రాణుల కొంతకాలము నశించి పోకుండగాచేసెడి  గరళ కంఠుడు ( శివుడు ) రక్షించెడు వివిధ వైద్య విధాన పద్ధతులలో  వైద్యగుళికలు / మాత్రలు , ఔషధాలు అందులోతయారుచేయు ప్రయత్నము తో  రోగులయొక్క ఆయుష్షు ను వృద్ధి పరచుటకు  కొన్ని రకాల విషాలను ను కూడా ఉపయోగిస్తారు అంటే కాకుండా కొన్ని క్లిష్ట మైన వ్యాధులను రూపు మాపుతారని భావం.


                         


Rate this content
Log in