STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

రాతను మార్చే విధాత

రాతను మార్చే విధాత

1 min
291

నాకప్పుడు తెలియలేదు

లోకం పోకడ తెలీని నాకు

లోకజ్ఞానం నేర్పేందుకే

నన్ను అతని దగ్గర వదిలారని..


నాకప్పుడు తెలియలేదు

శూన్యస్తిష్కాన జ్ఞానసంపదను

నింపి ఉన్నత పీఠంపై

నన్ను నిల్చోబెట్టడానికే

నన్ను అక్కడ వదిలారని..


నాకప్పుడు తెలియలేదు

భవిష్యత్తులో దిద్దుకోని తప్పులను

సుద్దముక్కతో ఓనమాలు దిద్దించి సాధనాసామర్థ్యం సంపాదనకై

నన్ను ఆ దేవాలయంలో వదిలారని..


ఆ గుడిలో గురువులే దేవుళ్ళు

భవితను తీర్చిదిద్దే విజ్ఞాన గనులు

భావిభారత పౌరులుగా మలిచే శిల్పులు

చరిత్ర లో ఒక పేజీని లిఖించే విధాతలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational