ఎవరి కోసమో
ఎవరి కోసమో
పడుతూ లేస్తూ ఉన్నా ఉనికేలేనీ ఎవరికోసమో
వెళ్తూ వెళ్తూ ఉన్నా పలుకేలేనీ ఎవరికోసమో
మనసులొ ఏదో కలకలం సుడులు తిరుగుతోందీ చెలీ
కలలో ఏడుస్తున్నా రూపంలేనీ ఎవరికోసమో
హృదయం గంతులేస్తుంది చెలియకు మనసుని అర్పించాలని
ముందుకి ఉరుకుతువున్నా హృదయంలేనీ ఎవరికోసమో
బండరాతికీ కదలికవుందీ మనసునిపెట్టీ చూడగలిగితే
ఊపిరిలూదుతువున్నా చలనంలేనీ ఎవరికోసమో
నశించిపోదూ కృశించిపోదూ ప్రేమ ఒక్కటే "చల్లా"
ప్రేమించాలని చూస్తూవున్నా మరణంలేనీ ఎవరికోసమో
