మూఢత్వం
మూఢత్వం
విశ్వం వీధులలో భూమి ఒక రేణువు!
మనిషి ఒక దూళి కణం!
అంతటికీ అధినాయకుడను
నేననుకోవటం మనిషికి అలవాటు!
విపత్తు వస్తే దేవునిపై వేయటం పరిపాటి!
నిజానిజాల కన్నా పుక్కిటి పురాణాలకు
ప్రాముఖ్యత ఎక్కువ!
శోధించి జ్ఞానాన్ని సంపాదించితే
భావితరాలకు మేలు!
లేని దైవానికి కారణాలు ఆపాదించి
తప్పించుకోవటం అరిష్టం!
జ్ఞానాన్ని సంపాదించుదాం!
మూఢత్వం విడనాడుదాం!
