శిలలకంట
శిలలకంట
శిలల కంట జారుతున్న గారాలను ఆపలేము..!
పుడమితల్లి పంచుతున్న పుణ్యాలను ఆపలేము..!
నవ్వుతున్న స్వప్నవీణ..మనసు తెలుసుకున్నావా..?!
ఆధరయుగళి చుంబించే కిరణాలను ఆపలేము..!
షేర్ల పంట పండుతున్న ..వేళలోన ఎంత హాయి..
గజల్ ప్రియుల ఎదలోయల హర్షాలను ఆపలేము..!
భార్యకంట పడకుండా..ఎవ్వరేమి చేసేరో..?!
తెలివిలేని ఆ మూర్ఖుల జూదాలను ఆపలేము..!
మతమంటే పిచ్చియున్న..మనుషులెవరు ఉన్నారో..?!
వెర్రిమొర్రి శిఖామణుల..విషయాలను ఆపలేము..!
