ఉత్తమమైన మార్గం
ఉత్తమమైన మార్గం
సముద్రంలో మంచి నీరు వెతుకుట,
అజ్ఞాన మార్గంలో జ్ఞానం వెతుకుట మూర్ఖత్వమే...
భయం తో విజయ తీరాన్ని చేరుకోవాలనుకోవడం,
కష్టాల నుంచి తప్పించుకోవాలనుకోవడం మూర్ఖత్వమే...
అయితే...
వెన్నుచూపి వెనుకంజవేసి పారిపోవడం కంటే...
జీవితంలో స్థిరంగా నిలచి పోరాడటం ఉత్తమమైన మార్గం...కాదా...
లేదు... పిరికివాడిలా మారి వెనుకంజవేస్తాను అంటే...
ఒక చేతగాని వాడిలా బ్రతకడం ఇష్టమైతే...
నీ ఇష్టానికి ఇక తిరిగేముంది...
