వేడుకే
వేడుకే
విరహమే గంధమా..చల్లగా వేడుకే..!
మోహమే బంధమా..చంపగా వేడుకే..!
మానసం కొలనుగా..సాగనీ సంబరం..
మోసమే వేషమా..మాన్పగా వేడుకే..!
ఆకసం కొత్తగా..నిండుగా ఎప్పుడూ..
హాసమే వానగా..కురియగా వేడుకే..!
మౌనమే తోడుగా..ఉన్నదే హంసరో..
భావమే మాయమా..చూడగా వేడుకే..!
కథలకే చెట్టుగా..కోర్కెలే పుట్టగా..
జన్మలే గుట్టుగా..గుట్టగా వేడుకే..!
