STORYMIRROR

gopal krishna

Classics Fantasy Others

4  

gopal krishna

Classics Fantasy Others

అనుకోనా....

అనుకోనా....

1 min
280

వద్దంటున్నా వినకుండా

నన్ను విడిచి వెళ్లిన నీవు

ఏదో ఒక రోజు తప్పక తిరిగి వస్తావని

నీవు చేసిన బాసలు, చెప్పిన మాటలను మననం చేసుకుంటూ

నీ రాకకై వేచి చూస్తున్నా

నాకోసం ఒకసారి వెనుదిరిగి చూస్తావని

అలసట ఎరుగని నీ ప్రయాణాన్ని ఆపి

వెనుదిరిగి వస్తావని, జీవితాంతం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.

చేతిలో చెయ్యేసి నీవు చేసిన బాసలను

పండువెన్నెల సాక్షిగా నీవు ఇచ్చిన మాట

నా గుండెలను కదిలిస్తూ ఉంటే నీ ఆలోచనలు

నన్ను క్షణం కూడా విశ్రమించనివ్వడంలేదు

మనసులో చిక్కుముడులు వీడుతూ నీవు

రావన్న నిజం నాకన్నీటి రూపంలో బయటికి

వస్తూ ఉంటే నీవు చేతిలో చెయ్యేసి చేసిన

బాసలు అడియాసలయ్యాయని అనుకోనా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics