STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

విఫల ప్రేమ

విఫల ప్రేమ

1 min
353

మౌన స్నేహమే ఎరుకపరచదు ఎదలోని ఎలమి

ఘన లాసమూ గమనించదు మదిలోని చెలిమి

వింత ప్రయాణంలో అంతేసి మోహం తరగలేదు

ఎంత దూరమెళ్ళినా కొంత దాహమైన తీరలేదు

మౌన స్నేహమే ఎరుకపరచదు ఎదలోని ఎలమి

ఘన లాసమూ గమనించదు మదిలోని చెలిమి


అయినా ఆ గుండెలో రూపం ఇంకా చెదరలేదు

పోయినా పోదులే జ్ఞాపకం మనసే మరువలేదు

కథ పాతదే గాని కలకలమే మనసునే వదలదు

వ్యధ ఒకటే మిగిలే జీవితాన ఇంకేమి మిగలదు

మౌన స్నేహమే ఎరుకపరచదు ఎదలోని ఎలమి

ఘన లాసమూ గమనించదు మదిలోని చెలిమి


తీరని దుఃఖమే విడదీయని బంధమాయేనులే

చేరని కోరిక చెమ్మగిల్లే కళ్ళకు ఓదార్పయేనులే

మారనివ్యాపకం మనసులో మరల రగిలేనులే

కోరని ఎడబాటు కనికరం లేక ఇక చెలరేగేనులే

మౌన స్నేహమే ఎరుకపరచదు ఎదలోని ఎలమి

ఘన లాసమూ గమనించదు మదిలోని చెలిమి


అంతేలే ఆ ప్రేమలే ఆ ఎడారిలో ఎండమావులు

కొంతైనా ఆ దప్పికైన తీర్చలేని ఎండిన బావులు

అంతేలే ఆ ప్రేమలే ఆ ఎడారిలో ఎండమావులు

కొంతైనా ఆ దప్పికైన తీర్చలేని ఎండిన బావులు


మౌన స్నేహమే ఎరుకపరచదు ఎదలోని ఎలమి

ఘన లాసమూ గమనించదు మదిలోని చెలిమి

వింత ప్రయాణంలో అంతేసి మోహం తరగలేదు

ఎంత దూరమెళ్ళినా కొంత దాహమైన తీరలేదు




Rate this content
Log in

Similar telugu poem from Romance