STORYMIRROR

Challa Sri Gouri

Abstract Romance Others

4  

Challa Sri Gouri

Abstract Romance Others

అందమైన అనుబంధం

అందమైన అనుబంధం

1 min
339

నా కోసం నువ్వు పడే తపన, 

నా బాధను చూసి నువ్వు పడే యాతన, 

నా చిరునవ్వుకై నువ్వు పడే శ్రమ, 

నీ అభిమానానికి నేను అయ్యాను బానిస, 

నీ సాన్నిహిత్యం నా హృదయంలో మోగించే పదనిస, 

నీ మది విచక్షణలో ఆరితేరిన హంస, 

నువ్వు లేని ఒక్క నిమిషమైనా నాకు హింస, 

రక్త సంబంధానికి మించిన బంధం మనది, 

మాటలకు అందని అనుభూతిని పంచే స్నేహం మనది, 

నాలో మంచిని పెంచిన నీవు, 

నాలో కోపాన్ని అణచిన నీవు, 

నీ స్నేహం కాదా నా పాలిట వరం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract