Nagendra Dora

Drama Inspirational

5.0  

Nagendra Dora

Drama Inspirational

వండర్ఫుల్ విమెన్ ఇన్ మై లైఫ్

వండర్ఫుల్ విమెన్ ఇన్ మై లైఫ్

3 mins
34.8K


ఈ ప్రకృతిలో వున్న అందమైన వాటిలో స్త్రీ ఒకటి.స్త్రీ లేకుంటే విశ్వమే వుండదు.కిరణ్ బేడీ, ఇందిరాగాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో వీర వనితలు తమదైన శైలిలో లో వాళ్ళ ప్రతిభను చాటారు.

ప్రతి ఒక్క మగాడి జీవితానికి అర్థం చూపేది ఆడది.ప్రతి ఒక్క అబ్బాయి జీవితంలో స్త్రీ యొక్క పాత్ర అమూల్యమైంది

స్త్రీ మగాడి యొక్క కాల చక్రంలో తల్లిగా బిడ్డకు జన్మనిస్తుంది.అక్కగా అండగా నిలబడుతుంది. భార్యగా జీవితాంతం తోడుగా వుంటుంది.కూతురిగా సంతోషాన్ని ఇస్తుంది

అలాగే నా కాలచక్రంలో మా అమ్మ నాకు జన్మనిచ్చింది

గోరు ముద్దలు పెట్టింది ,నడక నేర్పింది .మా అమ్మ ఉన్నత చడువువులు చదువుకోలేదు కానీ ఆవిడ నేర్చుకున్నా జీవిత పాఠాలతో నాకు బుద్ధులు నేర్పింది.ఆమె చిన్నప్పుడు చదువుకొనందుకు ఎంతగా భాధపడిందో నాకు తెలుసు. ఆమే బాధపడినట్లు మేము కష్టాల్లో పడకూడదని ,నన్ను చదువు వైపు నడిపింది.

చదువుకున్న వారికి ,చదువుకోని వారికి మధ్య తేడా చెప్పి ,సమాజంలో గుర్తింపు సాధించాలని నన్ను ఎంతగానో ఉత్సాహపరిచారు..

నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని ,అప్పుడు ఆవిడ నన్ను కొట్టి మందలించేది,తర్వాత కొంతసేపటికి కోపం తగ్గాక నన్ను ఎత్తుకొని ముడ్డదేది .నన్ను కొట్టినందుకు మళ్లీ ఆవిడే బాధపడేది ,ఇదే తల్లి యొక్క గొప్పతనం.నేను ఇప్పటికీ ఏమీ సాధించకపోయినా, ఏదోఒక రోజు మంచి స్థాయిలో వుంటానని నాకంటే ఎక్కువ నమ్మకం కల్గిన వ్యక్తి .నన్ను మా అమ్మ నమ్మినట్లు గా నేను కూడా నమ్మలేనేమో అని అనిపిస్తుంటుంది .నాకు ఆరోగ్యం బాగొకపోతే ఆవిడ కృంగిపోయేది.నాకు ఆకలి అంటే ఆవిడ తినకుండా నాకు పెట్టేది.నేను ఎన్నోసార్లు ఆవిడ మీద చిరాకు పడ్డాను,కానీ చిన్నతనం నుండి ఇప్పటివరకు ఆమే . నాపై చూపిస్తున్న ప్రేమలో మాత్రం ఏ మార్పులేదు.తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఈవిడ నుండే నేను ప్రేమ అంటే ఎంటో తెలుసుకున్నాను.

మా అమ్మ తర్వాత అంతగా నన్ను ఇష్టపడేది మా అక్క .నాకు చిన్నప్పటి నుండి ఒక కేర్ టీకర్ లా జాగ్రత్తగా చూసుకుంది నన్ను ఆడించింది,నేను ఆవిడ ఏమీ అడిగిన చేసేవాడిని కాదు,కానీ ఆవిడ మాత్రం అడిగిన ప్రతి పని చేసేది . నేను భయపడినపుడు ధైర్యం చెప్పేది.కానీ చిన్నప్పుడు మేము ఇద్దరం (tom and jerry) గొడవపడే వాళ్లం.కానీ ఆవిడ మాత్రం నాతో మాట్లాడకుండా వుండేది కాదు, ఏదో. ఒకలా నాతో మాట్లాడేది. ఈవిడ నుండి నేను తెలుసుకున్న విషయం ఎవరితోనైనా ఒకసారి గొడవ పడితే ,అది కొంత వరకే వుండాలని ఎవరిని దూరం చేసుకోకూడదని ,గర్వ్వనికి పోకుండా అందరితో కలిసి వుండాలని తెలుసుకున్నాను

వాళ్లిద్దరి తర్వాత నన్ను అంతగా నమ్మేది,మా చిన్న అమ్మమ్మ .ఆవిడకు నామీద నమ్మకం ఎక్కువే.ఇప్పటికీ కూడా ఆ నమ్మకం అలానే వుంది .ఏదో ఒకరోజు మంచి స్థాయిలో వుంటానని ,వాళ్ళ నమ్మకం చూసి నాకు ఒక్కొక్కసారి భయం వేసేది ఎందుకంటే వాళ్ళ నమ్మకం నేను నిలబెట్టుకొలేకపోతానానీ,కానీ వాళ్ళే నా ధైర్యం .. ఒక వ్యక్తిని ఎలా encourage చెయ్యాలో ఈవిడ నుండే తెలుసుకున్నాను.

ఉపాధ్యాయులు , తల్లిదండ్రుల తర్వాత మనకు ఒక మార్గాన్ని చూపేది వీళ్ళే ..ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు /ఉపాధ్యాయురాలు కూడా వాళ్ళ యొక్క విద్యార్థులు మంచి స్థాయిలో వుండాలని కోరుకుంటారు.నా జీవిత ప్రయాణంలో నేను కలుసుకున్న వ్యక్తి ,మా ఆంగ్ల ఉపాధ్యాయురాలు .ఆమెను చూస్తే ఎంత కోపంలో వున్నా సరే శాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు జాలి కరుణతో నిండి ఉండే మనిషి .ఆవిడ కొడుకు బాల్యంలో చనిపోయాడు,దానికి ఆమె కృంగిపోయింది.ఆవిడ ఎప్పుడు మమ్మల్ని విద్యార్థులుగా కాకుండా ఆవిడ కొడుకులు ,కూతురిగా చూసుకునేవారు.ఆవిడ పుస్తకాల్లోని పాఠాల కంటే జీవిత పాఠాలు ఎక్కువ నేర్పారు.ఆవిడంటే పాఠశాలలో వున్న పిల్లలందరికీ ఇష్టమే ,దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమే ఇలాంటివారు అనేది .నేను నా జీవితంలో చూసిన strong woman eevide ఎందుకంటే ఒక తల్లి త కుమారుడిని కోల్పోతే కృషించిపోతుందో మాటల్లో చెప్పలేం.కానీ ఆవిడ ముఖంలో మాత్రం ఎప్పుడు నవ్వుతూ వుండేవారు.

ఒక కొడుకు దూరమితెనే ఇంతమంది నన్ను ఇష్టపడుతున్నారు అని సర్దిచెప్పుకొని ధైర్యంగా నిలబడిన వ్యక్తి...

నేను ఆమెను చూసి మానసికంగా ఎలా ధైర్యంగా వుండాలో నేర్చుకున్నాను.మగవాళ్ళు శారీరకంగా దృఢంగా వుండగలరేమో కానీ ,ఆడవారికి వున్న మానసిక ధృదత్వం మగవారికి ఉండదేమో అని అనిపించింది. మనం ఒకరి మీద ఎంత ప్రేమ చుపిస్తామో అంతకంటే రెట్టింపు తిరిగి వస్తుందని ,అందరితో ప్రేమగా వుంటే మనకు అసలు శత్రువులే ఉండరని ఈమె నుండే తెలుసుకున్నాను.

బంధువుల్ని దేవుడిస్థాడు, స్నేహితుల్ని మనమే వెతుక్కోవాలి అని మా తెలుగు మాస్టరు ఎప్పుడు చెప్పేవారు.అలానే నా జీవితంలో కూడా ఒక స్నేహితురాలు వుంది.ప్రతి ఒక్క విషయాన్ని నేను తనతో పంచుకునేవాడిని

నాకు ఎదురైన ప్రతి సమస్యలో తను నా ప్రక్కన వుండి నాకు దైర్యం చెప్పేది.మేము ఇప్పటికీ మంచి స్నేహితులం.. ఒక సమస్యలో వున్న వ్యక్తికి ఎలా ధైర్యం చెప్పాలి అనేది నేను ఆమే నుండే నేర్చుకున్నాను.

నేనొక introvert ni ఎవరితోనూ కలివిడిగా ఉండలేను , సరిగా మాట్లాడను, పరిచయం వుంటేనే తప్ప ..కానీ నాకు ఎదురైన మరొక వ్యక్తి ,ఈమె దగ్గర నేనొక కొత్త విషయం నేర్చుకున్నా,ఆమే అందరితో కలివిడిగా వుంటుంది బాగామాట్లాడుతుంది.నాకు పూర్తిగా వ్యతిరేకంగా అనిపించింది .అందరితో ఎలా వుండాలో నేర్చుకున్నాను.

ఒక మనిషి విలువను పెంచేది మాటే ,తుంచేది మాటే అని,మన మాటే మనకి మనుషులని దగ్గర చేస్తాయని తెలుసుకున్నాను..

నేను చూసిన ఒక సంఘటన ,నేను నా స్నేహితుడు కలిసి సెల్ఫోన్ షాప్ కి వెళ్ళాము . అప్పుడు రోడ్డు మీద ఒక సంఘటన జరిగింది .అది ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరూ వాళ్ళ పాపతో కలిసి బండి మీద వెళ్తున్నారు అప్పుడు బండి టైరు జారడం వల్ల వాళ్ళు కిందపడిపోయారు .పడిపోయేటప్పుడు ఆవిడ తన చేతులతో , రెక్కలతో తన పిల్లల్ని కప్పినట్టుగా తన చేతిలో వున్న తన బిడ్డకు దెబ్బలు తగలకుండా పూర్తిగా కప్పేసింది.ఆ సమయంలో ఆమె తన గురించి కాకుండా తన బిడ్డ గురించే ఆలోచించింది.

ఒక చెడ్డ మనిషిని మంచి వాడిగా మార్చగలిగే స్త్రీకి మాత్రమే వుంటుందని నా అభిప్రాయం.. ఈనాడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు.వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు.కానీ వాళల్లో వున్న ప్రతిభను గుర్తించకుండా వాళ్ళని ఇంటికే పరిమితం చేస్తున్నారు..ఇది మారాలి ...

నా జీవితంలో నాకు ఎదురైన ఈ వ్యక్తులు నన్ను ఎన్నో విషయాలలో స్ఫూర్తిని ఇచ్చారు..



Rate this content
Log in

Similar telugu story from Drama