Nagendra Dora

Drama

3  

Nagendra Dora

Drama

ఒక అబ్బాయి ఒక అమ్మాయి

ఒక అబ్బాయి ఒక అమ్మాయి

5 mins
12.4K


ప్రతి ఒక్క జీవిలో వివిధ రకాలైన అనుభూతులు వుంటాయి. వాటిలో ప్రేమ కూడా ఒకటి ప్రేమ అనే అనుభూతిలేని మనీషీ క్రూరంగా వుంటాడు.చివరకు అడవిలో బ్రతికే మృగాలైన సరే వాటి పిల్లల పట్ల ప్రేమ చూపుతాయి. ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ తర్వాత ఇద్దరు ప్రేమికుల మధ్య వున్న ప్రేమ .చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే వుంటాయి .

ఉదాహరణకు సాజహాన్ తన ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ ని కట్టించి తన ప్రియిలురాలికి బహూకరించాడు.దేవదాస్ పార్వతి లా ప్రేమ కథ ఇలా ఎన్నో ప్రేమ కథలు అందులో కొన్ని సక్సెస్ తో ముగిశాయి ,ఇంకొన్ని ఫెయిల్యూర్ గా మిగిలిపోయాయి.

ప్రేమ అనేది నిలకడలేని ఒక అనుభూతి . దీని వలనే బంధాలు ఏర్పడతాయి. ఇది ఎప్పుడు ఒకరి ఒకేలా వుండదు , కాలంతో పాటుగా మారుతూ వుంటుంది కానీ పూర్తిగా అయితే పోదు .ఉదాహరణకు పిల్లలు చిన్నప్పుడు తమ తల్లిదండ్రులను ఇష్టపడతారు,తర్వాత యవ్వన దశలో వారి భార్య మీద ,తర్వాత అంత ప్రేమ వాళ్ళ పిల్లల మీద చూపిస్తారు. అలా అని మిగిలిన వాళ్ళ మీద ప్రేమ చూపించడం మానేస్తారు అని కూడా కాదు .. ముందు చూపిన అంత ప్రేమ తర్వాత వుండదని అర్థం ..

అలానే ఈ ప్రేమ అన్నేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా ముగిసిందనేదే ఈ కథనం..


ఒక పల్లెటూరిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక కుర్రాడు వుండేవాడు.అతను తల్లిదండ్రులు అంటే భయం, భక్తి ,గౌరవం.పక్క వూర్లో ఒక అమ్మాయి వుండేది ఆమే పేరు అనురాధ .ఆమే చాలా సౌందర్యవతి ,కోపం కూడా ఎక్కువే కానీ ఆమెకు ఆ కోపం కూడా అలంకారంగా వుంటుంది ..ఆమే ను చూస్తుంటే స్వర్గలోక దేవత భువికి దిగివచ్చనట్టుగా అనిపిస్తుంది ..ఆమే నవ్వినప్పుడు బుగ్గ మీద పడే సొట్ట పౌర్ణమి రోజు వచ్చే వెన్నల కంటే ఎంతో అందంగా వుంటుంది.కురులు కొండ మీద నుండి కిందకి దూకే జలపాతంలా ,ఆమే ముఖం తెల్లవారు జామున సూర్యుడి ప్రకాశంలా వుంటుంది .

ప్రతి ఒక్క మనీషి స్వభావం తాను పెరిగిన పరిస్థితులు,ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి అలానే ఆమెకు కూడా ఆ కోపం అలా వచ్చిందే .. కానీ నిజానికి అది కోపం కాదు ..ఆమెకు కూడా భయం ఎక్కువే .ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోపం అనే ముసుగు వేసుకొని , అదే నిజం అనుకొని బ్రతికేస్తుంటుంది .

ఈ ఇద్దరు వాళ్ళ చదువుల కోసం కలాశాలలో చేరారు

కొన్ని రోజులకు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది .ఆ అబ్బాయి బాగా చదివేవాడు,అందరితో స్నేహపూర్వకంగా వుండేవాడు..తన స్నేహితులకు ఏదైనా కష్టం వస్తె ఆదుకొని ధైర్యం చెప్పేవాడు.ఆమే కూడా బాగా చదివేది.తనకు కోపం ఎక్కువని తన స్నేహితులు తనకి కొంచెం భయపడేవారు...

కానీ ఆ అమ్మాయి ముఖం ముసుగు వెనుక వున్న ఒక కొత్త రూపాన్ని చూసాడు. ..ఆమెకు వున్నది కోపం కాదు కేవలం భయమే అని ,ఆమెకు తెలిసేలా చేయాలని అనుకున్నాడు.. ఆమెకు మరింతగా దగ్గరయ్యాడు.ఇద్దరు మంచి స్నేహితులయ్యారు.ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడు ఒంటరిగా ఉండే ఈమెకు తోడులా ఆ అబ్బాయి వుండే సరికి ఎంతో ఆనడపడింది..ఆమే మీద చూపిన caring ,ఆమెలో ప్రేమ చిగురించేలా చేసింది .

ఆమె ప్రతి చిన్న విషయానికి ఆ అబ్బాయి మీద కోపగించుకొనేది .ఆ అబ్బాయితో కొన్ని రోజులు మాట్లాడేది కాదు .ఇలా జరిగిన ప్రతిసారీ అబ్బాయి వెళ్లి ఆమెను శాంతపరిచేవాడు ,కారణం ఆ అబ్బాయికి ఆమే మన్సతత్వం ఎలాంటిదో తెలుసు కాబట్టి..ఇలా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న రోజులు కంటే , ఆ అమ్మాయి కోపగించి మాట్లాడకుండా వున్న రోజులే ఎక్కువ .ఒకరోజు ఆ అబ్బాయి ఆమెను అడుగుతాడు..ఎందుకు ఇలా చేస్తున్నావని , మనకు ఎవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళ మీద వున్న ఇష్టాన్ని ఇలాగ కూడా చూపిస్తారు అని చెప్పి వెళ్లిపోతుంది కానీ అబ్బాయికి మాత్రం ఎందుకు అలా చెప్పిందో అర్థం కాదు..

ఇలా రోజులు గడుస్తున్నాయి అబ్బాయి కూడా తనకే తెలియకుండా ఆమే ప్రేమలో పడతాడు.ఆమెకు ఆ సంగతి చెప్పల్నుకుంటాడు కానీ ఆమె ఎక్కడ దూరం పెడుతుందో అని భయపడి చెప్పలేకపోతాడు.ఇలా ఇద్దరు ఒకేలా ఆలోచించి వాళ్ళ ప్రేమను ఒకరితో ఒకరు చెప్పలేక పోతారు.

ఇలా జరుగుతుండగా వాళ్ళ చదువులు పూర్తి కావొస్తాయి

పరీక్షలు దగ్గరకి వచ్చాయి .పరీక్షలకు ఆఖరి రోజు రానే వచ్చింది .ఇద్దరు పరీక్ష రాసి బయటకు వచ్చారు.వీరితోపాటు వాళ్ళ స్నేహితులు వచ్చారు,వారంతా ఒకచోట చేరారు.. వాళ్ళు కాలేజీలో గడిపిన రోజులు గుర్తుచేసుకుని అందరూ బాధ పడుతుంటారు.కానీ వీలిద్దరు మాత్రం నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడుకుంటూ ,వారి ప్రేమను కన్నీళ్ళ రూపంలో ఒకరితో ఒకరు చెప్పుకుంటారు..

ఇక అందరూ ఒకరిని ఒకరు ఓదార్చుకొను ఎవరింటికి వాళ్ళు బయలుదేరతారు.ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి నడుచుకుంటూ వెళ్తాడు .. చాలాసేపు వీలిద్దరి మధ్య మౌనమే నడుస్తుంది .కొంచంసేపటికి ఆ అమ్మాయి ఒక దుకాణం దగ్గర ఆగుతుంది .అక్కడ ఒక ఉంగరాన్ని కొని అది ఆ అబ్బాయికి తన గుర్తుగా వుంచు అని చెప్పి ఆమె తన ఇంటికి వెళ్లిపోతుంది ..అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు .

కొన్ని రోజుల తర్వాత పరీక్షల ఫలితాలు వస్తాయి అందరూ పాస్ అవుతారు ..ఆ అబ్బాయి పై చదువుల కోసం పట్టణం వెళ్ళిపోయాడు.అక్కడి కొత్త వాతావరణం ,ఏవీ కూడా అతనికి తృప్తిని ఇవ్వలేదు .తాను ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలే అతడిని అతలాకుతలం చేస్తాయి.ఇంకో పక్క ఆమే కూడా తన మనస్సులోని మాట ఆ అబ్బాయితో చెప్పలేకపోయాను అని బాధాపడుతుందీ..

ఆ అమ్మాయి తన కుటుంబం వారంతా వేరే వూరు వెళ్ళిపోతారు.తర్వాత కూడా తన ప్రేమ విషయం ఆ అబ్బాయికి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది కానీ చెప్పలేకపోయింది....


ఆ ఆమ్మాయి ధైర్యం చేసి ఎలాగైనా తన ప్రేమని చెప్పాలని ఆ అబ్బాయికి ఫోన్ చేసింది . ఆమె చెప్పడానికి ముందే అబ్బాయి తన ప్రేమను ఆ ఆమ్మ కి తెలియజేశాడు. నీతో నా పరిచయం స్నేహంగా మారింది .ఆ స్నేహం నుండి ప్రేమ చిగురించింది . నీతో వున్నపుడు ఎంత సంతోషంగా వున్ననో నాకు తెలుసు ,అలాంటిది జీతింతం నువ్వు నా పక్కన వుంటే నేను ఇంకా సంతోషంగా వుంటాను.ఇద్దరు వ్యక్తలు జీవితాంతం కలిసి బ్రతకాలంటే కావాల్సింది అభిరుచులు కాదు ,అభిప్రాయాలు .నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నాువనే నమ్మకంతోనే నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను ... ఆ నమ్మకానికి కారణం నా మీద వున్న ప్రేమ నీ కళ్ళలో నేను చూసాను.... అది తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది . నువ్వు నా కోపగించి మాట్లాడకుండా వున్న ప్రతిసారీ నీ కళ్ళు నాతో మాట్లాడేవి ఎన్నెన్నో కబుర్లు చెప్పేవి.నీ గుండెల్లో నా మీద వున్న ప్రేమ నీ కళ్ళు నా గుండెకు చేరేలా చేశాయి. ఇంత కాలం ఈ విషయం నీకు చెప్పకుండా తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను.నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఒక నరకంలా గడిచింది .నువ్వు నా పక్కన వునంతవరకు అది నేను తెలుసుకోలేక పోయాను..నీ నుండి దూరంగా వెళ్తున్నపుడు నాకు తెలిసింది నేను నిన్ను ఇష్టపడుతున్నాును .మన ఇద్దరి మధ్యన వున్న ఈ దూరాన్ని దూరం చెయ్యి .నీకు తోడుగా జీవితాంతం వుంటాను అని ఆ అబ్బాయి తన ప్రేమను చెప్తాడు అప్పుడు ఆమె ఆనందానికి అంతులేదు. . దారం తెగిపోయిన గాలిపటం మళ్లీ ఆ చిన్నపిల్ల వాడికి దొరికితే ఎంత సంబరబడతాడో,అంతకంటే ఎక్కువ ఆనందం ఆమే ముఖం లో చేరింది.. కారణం ఆమె ఆ అబ్బాయితో చెప్పాలనుకున్న మాట అబ్బాయి చెప్పడం ఆమెకు ఆ సంతోషాన్ని ఇచ్చింది..

అప్పుడు ఆమె ఇలా అంది. మనం ఇన్ని రోజులు దూరంగా వుండి వుండొచ్చు ,కానీ మన ఇద్దరి మనసులు దగ్గరగానే వున్నాయని నీతో మాట్లాడుతుంటే తెలుస్తోంది .. ఉదయం నిద్రలేవగానే మొదటి ఆలోచన రాత్రి నిద్ర పోయేముందు చివరి ఆలోచన కూడా నువ్వే .. నేను ఈ విషయమే చాలారోజుల నుండి చెప్పాలనుకున్న అని ఆమె తన ప్రేమను కూడా చెప్తుంది ... అప్పుడు అబ్బాయి కూడా చాలా ఆనందపడతాడు ..ఇలా వారిద్దరి ప్రేమ ప్రయాణం మొదలైంది.

దూరంగా ఉండాలి వున్నారనే పేరే కానీ ఎప్పుడు ఒకరితో ఒకరు దగ్గరగా వుండేవారు..వాళ్లకి రోజులు దూరంగా ఎలా గడిచేవో కూడా తెలిసేది కాదు.ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు ఒక అనూహ్యమైన ఘటన వీలిద్దరీ మధ్య చోటు చేసుకుంది . ఆమె ఆ అబ్బాయి మీద కోపగించి ఆ అబ్బాయితో మాట్లాడటం మానేస్తుంది.ఇలా కొన్ని నెలలు గడిచాయి,కానీ వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ మాత్రం అలానే ఉంది..ఆ అబ్బాయి ఆమెతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఆమే మాత్రం ఆ అబ్బాయిని దూరం పెట్టింది.ఒకరోజున అబ్బాయి ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని , అది కార్తీకమాసం కనుక రాత్రి గుడికి వస్తుందని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు.ఆ అబ్బాయి వెళ్లసరికి ఆమే దీపాలను వెలిగిస్తూ ఆకాశంలో చుక్కల మధ్యలో చంద్రుడిలా ఎంతో అందంగా వుంది ..ఆమెను చూస్తూ అలానే వుండిపోయాడు.. అప్పుడు కూడా ఆమెతో మాట్లాడటం వీలుపడలేదు ...

తర్వాత వీలిద్దరు వాళ్ళ తల్లిదండ్రుల సమ్మక్ష్మలో పెళ్లి చేసుకున్నారు...పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో బార్య భర్తల మధ్య గొడవలు సహజం అలానే వేలిద్దరి మధ్య కూడా...కానీ ఆ చిన్న చిన్న గొడవలు వాళ్ళ బంధాన్ని ఇంకా పెరిగేలా చేశాయి....

ఇంతకీ. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆ ఘటన గురించి మీకు చెప్పలేదు కదూ... నిజానికి వాళ్లిద్దరి మద్య ఎటువంటి గొడవ రాలేదు, వాళ్ళిద్దరూ దూరంగా లేరు...ఆ అమ్మాయి అబ్బాయిని దూరం పెట్టడం , గుడిలో ద్వీపాలు వెలిగించడం ఇది అంతా ఆ అబ్బాయికి వచ్చిన కల.

ప్రేమ అనే పదానికి అర్థం ఎప్పటికీ మారదు..కానీ ఈ కాలంలో కొత్త అర్ధల్ని మనమే వేతుకుంటున్నం......


Rate this content
Log in

Similar telugu story from Drama