Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

విషమయింది ప్రేమ

విషమయింది ప్రేమ

1 min
673


సుశీ! నేను ప్రేమించానే. చాలా ప్రేమించాను. అతని తలపుల్లో ఎప్పుడూ నేనే ఉంటానని నమ్మాను. ఉండాలని, దానికి తగ్గట్టే ప్రవర్తించాను.


కానీ.. సావిత్రి చెప్పడం ఆపింది. అంత భరించలేని విషయాన్ని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్. మర్చిపో అంది సుశీల.


నా నరనరాల్లో అతని చిరునవ్వు, పెళ్లి చేసుకునేప్పుడు చేసిన వాగ్దానమే ఉంది. ఆ జ్ఞాపకాల నుండి బయటకి రాలేకపోతున్నాను.


ఒక్కోసారి అలాంటి ప్రేమ కోసం మనల్ని మనం నాశనం చేసుకున్నా తప్పు లేదనిపిస్తోందే అంది సావిత్రి.


ఏయ్. ఏంటే ఆ మాటలు. ఆ ప్రేమ విషంలా మారింది. మర్చిపో. ఇంకే జ్ఞాపకాలూ లేవా నీ బుర్రలో. ఆనందంగా జీవించడానికి? మళ్లీ ముందు సావిత్రిలా చకచకా పరిగెట్టడానికి? అంది సుశీల.


ఉన్నాయ్. ఈ ఊరు. ఈ నది ఒడ్డు. మన స్నేహం అంది సావిత్రి. ఇంకా కొబ్బరి బర్ఫీ కూడా అంది సుశీల చేతిలోని కొబ్బరి బర్ఫీ చూపిస్తూ.


హబ్బా. నీకింకా గుర్తుందా అంటూ కొబ్బరి బర్ఫీని చేతిలోకి తీసుకుంది. అది తినబోతుండగా గాలి వచ్చి బర్ఫీ కింద పడి నేలలోకి దొర్లింది.


నా బర్ఫీ అంటూ సావిత్రి నీళ్లలోకి వంగబోయింది. సావిత్రీ! ఏంటే ఈ పని అంటూ ఆమెను ఆపి మెట్ల మీద కూర్చోబెట్టింది. నా జీవితం కూడా ఇలానే ఉందే. సుశీ! నేను ఎన్నో చేయాలనుకుంటున్నాను. కానీ..మళ్లీ ఆగింది సావిత్రి.


నేను వంద బర్ఫీలు కొనిస్తాను. ఇక్కడికి వచ్చెయ్యి. మనం మళ్లీ ముందులాగా రోజూ ఒక కొబ్బరి బర్ఫీ తిందాం. పరుగు పందాలు పెట్టుకుందాం అంది సుశీల.


ఆ రోజు వస్తే ఎంత బావుణ్ణు అంది సావిత్రి. ఏదో అలజడి వలన నీటిలో ఆమె ప్రతిబింబం చెదిరిపోయింది


Rate this content
Log in

Similar telugu story from Abstract