STORYMIRROR

film nagar

Comedy Romance Fantasy

4  

film nagar

Comedy Romance Fantasy

విన్నీ

విన్నీ

6 mins
303

హలో ఎవరూ..???
విన్నీ  నేను... కార్తీక్...
హ  చెప్పు  కార్తీక్  ఏంటి  ఇంత  అర్ధరాత్రి ... కాల్  చేసావ్  ఏమైంది...??
నిన్ను  చూడాలని  ఉంది... విన్నీ  బయటకు  రా... 
ఏంటి కార్తీక్  ఇది ,, ఎలాగో  2 డేస్ లో  మనకు  పెళ్లి  కదా  అప్పుడు  ఎలానో  కలిసే  ఉంటాం  గా..  ఇప్పుడు  కలవడం  అవసరమా....
ఎందుకో  నిన్ను  చూడాలి  అని , నీతో  మాట్లాడాలి  అని  ఉంది  విన్నీ  బయటకు  రా... ప్లీజ్...

కార్తీక్  ప్లీజ్  ఈ  టైం  లో  రాలేను... ఇంట్లో  ఎవరైనా  చూస్తే  బాగోదు  ... నేను  రాలేను ... కార్తీక్,,, కావాలంటే  రేపు  ఎర్లీ  మార్నింగ్ మీట్  అవుదాం......

లేదు  ఇప్పుడు  నువ్వు  వస్తున్నావు... నేను  మీ  ఇంటి  ముందు  ఉన్నాను ... నువ్వు  వచ్చేంత  వరకు  ఇక్కడే  వెయిట్  చేస్తాను.... ఇక  నీ  ఇష్టం..... నేను  వెయిట్  చేస్తున్న .....

ఏంటి ... కార్తీక్ ..  పిల్లాడిలా... సరే  వస్తున్నా  ఆగు...

ఏంటి  కార్తీక్  ... అసలే  పెళ్లి  పనులు  తో  డే  మొత్తం  బిజీ  గా  ఉంటావు .... నైట్  మంచి  గా  రెస్ట్  తీసుకోకుండా.. ఈ  నైట్  టూర్స్  అవసరమా....

నువ్వు  బాగా  గుర్తొస్తున్నావ్  విన్నీ.... నిద్ర  పట్టట్లేదు... అందుకే  నిన్ను  చూడాలి  అనిపించి  నేను  అర్ధరాత్రి అని  చూడకుండా  వచ్చేసా.... సారీ... విన్నీ ..

అయ్యో  సారీ  ఎందుకు .. సార్... సరే  చూసారు  గా  నేను  వెళ్ళనా  మరి... ఎవరైనా  చూస్తే  బాగోదు....

ఎక్కడకి  వెళ్ళేది.... బైక్  ఎక్కండి ... బయటకు  పోదాం....

నో  కార్తీక్ ,,,, ఈ  టైం  లో  ఎక్కడకి  వెళ్తాము... రెలెటివ్స్  ఎవరైనా  చూస్తే  బాగోదు.....

చూస్తే  చూడని  విన్నీ ఏమౌతుంది.... కాబోయే .... కొత్త జంట  షికారు  కి  వెళ్తున్నారు  అనుకుంటారు....

అనుకుంటారు... బాగా  అనుకుంటారు... ఆ  విషయం  మా డాడీ  తో  చెబితే  వామ్మో ... ఇక  అంతే  సంగతులు... మా  అమ్మ  అయితే  తిట్టిన తిట్టు తిట్టకుండా  తిడుతుంది.....

మా  అత్త , మా  మామ నిన్ను  ఏమీ  తిట్టరు  లే... నేను  చెప్పుకుంటా...

అబ్బో ... మీ  అత్త , మీ  మామ , బాగుంది..... పెళ్లి  కాకముందే  మా  వాళ్ళు  నుండి  నన్ను  దూరం  చేసేసావ్ ... సూపర్....

ప్లీజ్  విన్నీ  నీతో  ఇప్పుడు  బైక్  మీద  వెళ్లాలని  ఉంది ... ప్లీజ్  రా.....రా.......

సరే సరే...  వస్తాను..  మరీ  అంత లా  బ్రతిమిలాడకండి...
సిగ్గు  గా  ఉంది... 

విన్నీ  నువ్వు  సిగ్గు  పడితే  భళే  ఉంటావ్  తెలుసా....

ఆహా... అవునా ... ఇది  తినే  టైం  కాదు... ఇప్పుడు  బిస్కెట్స్  వేయొద్దు  ప్లీజ్...

సరే  వస్తాను  కానీ  చిన్న  కండిషన్.... బైక్  నేను  డ్రైవ్  చేస్తాను...   ఆలా  అయితేనే  వస్తాను....

హాలో  మేడం... ఇది  స్కూటీ  కాదు  రాయల్  ఎన్ ఫిల్డ్... పెళ్లి  టైం  లో హాస్పిటల్  లో  ఉంటే  బాగోదు... కల్యాణ  మండపం  లో  జరగాల్సిన  పెళ్లి హాస్పిటల్ లో  జరుగుతుంది.... 

ఇంక  ఆపుతారా... నాకు  రాయల్  ఎన్ ఫిల్డ్  డ్రైవ్ చేయడం  వచ్చు .... మా  డాడీ  తో  చాలా  సార్లు  రైడ్  చేసాను.... మీరు  అంత లా  భయపడాల్సిన  అవసరం  లేదు ఓకే  నా...

ఓకే  బట్... నాకెందుకో  ఇదే  లాస్ట్  రైడ్  అవుతుంది  అని భయం  గా  ఉంది.....

జోక్స్  ఆపండి .... లాస్ట్  రైడ్  లేదు... పాడు  లేదు  ఇది  మన  1 st రైడ్  లైఫ్  లో  గుర్తుండి  పోవాలి  అని 

విన్నీ  బైక్  ఎక్కి .... బైక్  స్టార్ట్  చేసింది....

ఓహో  విన్నీ    బాగానే స్టార్ట్  చేసావ్... నిజంగానే  నీకు  డ్రైవింగ్  వచ్చా....

అన్నీ  వచ్చు.... ఒక్క  బైక్  ఏంటి  కార్  డ్రైవింగ్  కూడా  వచ్చు...  చెబితే  మీరు  నమ్మరు ...  ఇంకా  నాకు రేస్  బైక్స్  కూడా  డ్రైవ్  చేయడం  వచ్చు...

పెళ్లి  అయిన తరవాత  మనము  ఎప్పుడైనా   రేస్  లో  పార్టిసిపేట్  చేద్దాం ... ఓకే  నా  కార్తీక్....

హ  తెలుస్తుంది.... విన్నీ   నీ  డ్రైవింగ్  స్పీడ్  చూస్తుంటే  అర్ధం  అవుతుంది... మనం  వాకింగ్  కి  వెళ్తే  ఇంత  కన్నా  స్పీడ్ గా  వెళ్తాము....

అంత  వెటకారం  వద్దు  లే ... ఏదో  మాట్లాడుతున్నాం  కదా  అని  స్లో  గా  డ్రైవ్  చేస్తున్నా..  ఆగండి  మీకు  స్పీడ్ కదా  కావాలి.... అని  బైక్  90 kmph  స్పీడ్  కి  పెంచింది ...

అంతేనా...అని  కార్తీక్.... అనే  సరికి....

విన్నీ  ఇంకా  స్పీడ్  పెంచింది.... బైక్..120 kmph స్పీడ్  తో  వెళ్తోంది....

బైక్  వేగానికి... కార్తీక్....కంట్లో  నుండి  నీరు  వస్తాయి...

ఓకే  మేడం .. మీకు  బైక్  బాగానే వచ్చు  అని ఒప్పుకుంటా... ఇంక స్లో  గా  పోనివ్వండి... చుక్కలు  కనపడుతున్నాయి  నాకు...

విన్నీ  బైక్  స్పీడ్ ని  140 kmph  కి  పెంచుతుంది....

విన్నీ  స్పీడ్  తగ్గించు... ఏంటి  ఈ  స్పీడ్... నేను  కూడా  140 స్పీడ్ తో  ఎప్పుడు పోలేదు.... 130 స్పీడ్  నాది  హైయెస్ట్...  ఇంక  చాలు  ఆపు... భయం  వేస్తుంది....

బైక్  స్పీడ్  150 kmph.... విన్నీ  ఇక  చాలు  ఆపు... సారీ  నీకు  డ్రైవింగ్  బాగా  వచ్చు...  ఒప్పుకుంటా.... నన్ను  క్షమించు...ఇక  చాలు  నా  కళ్ళు  తిరుగుతున్నాయి... ఇక  బైక్  ఆపు....

విన్నీ  నవ్వుకుంటూ.... బైక్  స్పీడ్  తగ్గించింది.... ఏంటి  కార్తీక్  ఓకే  నా... మొత్తానికి  ఇప్పుడు  ఒప్పుకున్నావ్ ..  నాకు  డ్రైవింగ్  వచ్చు...  అని...

నేను  రేస్  లో  పార్టిసిపేట్  చేశా.... మెడల్స్  కూడా  వచ్చాయి... పెళ్లి  అయ్యాక  చెబుదాం  అని నేను  నీకు చెప్పలేదు....

ఓహో  నా  దగ్గర  చాలా  దాచావు... అయితే... ఆ  స్పీడ్  ఏంటి  నిజంగానే  చుక్కలు  చూపించావ్.... నీకు  నమస్కారం....  ఇంకా  ఎన్ని  టాలెంట్స్  ఉన్నాయి  నీలో....

చాలా  ఉన్నాయి... కార్తీక్..కానీ .. నిజంగా  ఒకటి  అడుగుతాను.. చెప్పు..  నేను  అంతలా  గుర్తొచ్చానా... నన్ను  చూడటానికి  ఇంత  నైట్  టైం  వచ్చావు...

ఓహో  అదా  తప్పదా ... చెప్పాలా...

తప్పదు  చెప్పాలి... లేకపోతే  మళ్ళీ  స్పీడ్  పెంచుతా....

వద్దు  తల్లి... చెబుతాను.... నిజంగానే  నువ్వు  గుర్తొచ్చావ్.. కానీ  ఇంత  అర్ధరాత్రి  ఎందుకు  వచ్చాను  అంటే... మేకప్   లేకుండా నువ్వు  ఎలా  ఉంటావో  చూద్దాం  అని  వచ్చాను...

వామ్మో   ఎన్ని  క్రిమినల్  ఐడియాస్  ఉన్నాయి  మీకు... మేకప్  లేకుండా  ఎలా  ఉంటానో  చూద్దాం అని  వచ్చారా..

చూసారా... ఎలా  ఉన్నాను.... మేకప్  లేకుండా...

నిజం చెప్పనా.... అబద్దం  చెప్పనా....

నేను  సంతోష పడే  విషయం  చెప్పండి....

నా  బైక్  మిర్రర్  చూసావా  నిన్ను  ఎలా  చూస్తుందో... నీ  డ్రైవింగ్  చూసి  నా  మిర్రర్  నీతో  లవ్  లో  పడిపోయింది...

ఆ  జాబిలి , ఆ  వెన్నెల  అంటే  నాకు  చాలా  ఇష్టం ... నిన్ను  ఇలా  చూసాక... అవి  నాకు... నార్మల్  గా  కనిపిస్తున్నాయి....

నీ  ముందు.... ఓడిపోయి... చూడు  ఎలా  మబ్బుల్లో  దాగుండి పోయాయో... 

చాలు  ఇక  చాలు ... ఆపండి.... నేను   హ్యాపీ  అయ్యాను

ఒకటి  చెప్పనా  కార్తీక్.... నీతో  పెళ్లి అయ్యాక  ఒక  సారి  అయినా  ఇలా  డ్రైవ్  కి  రావాలి  అని  ఎన్ని  సార్లు  కల  కన్నానో... నీకు నా  కల   కనిపించిందా... ఏంటి  పెళ్లి కి  ముందే  ఇలా  ప్లాన్  చేసారు .....

విన్నీ  బైక్  ఆపు ... అలా మాట్లాడుకుంటూ   వాకింగ్  చేద్దాం....

కార్తీక్ .ఇలా  నీతో  నా  ప్రయాణం  నన్ను  నాకే  కొత్తగా  పరిచయం  చేస్తోంది...  చాలా  హ్యాపీ  గా  ఉంది  నాకు .... నీతో  ఇలానే  లైఫ్  అంతా  ఉండాలి  అని  ఉంది..

మరీ  ఇలా  లైఫ్  లాంగ్  రోడ్  మీద  వాకింగ్  అంటే  బాగోదు  ఏమో... గిన్నీస్  బుక్  కోసం  ట్రై  చేస్తున్నావా...

జోక్స్  ఆపు... కార్తీక్ ..  నువ్వు  నాతో  లైఫ్  లాంగ్ ఇలా  నే  ఉంటావా... చెప్పు  ప్లీజ్...

నిజం  చెప్పనా, అబద్దం  చెప్పనా... లేకపోతే.. నిన్ను  సంతోష పెట్టేది  చెప్పనా...

ఈ  సారి నీకు  సంతోష పెట్టేది  చెప్పు... అది  నిజమైన.. అబద్దం అయినా...

ఓహో  ఓకే  చెబుతా....

నాకు  నేను  బోర్  కొట్టిన  ప్రతీ  సారి... నిన్ను  చూసి... నీకోసం ...   నేను   మళ్ళీ  పుడతాను....

నన్ను  నాకే  మళ్ళీ  పరిచయం  చేసిన  నీకోసం... ఎన్ని  సార్లు  అయినా  మళ్ళీ  కొత్తగా  మార్చుకుంటాను... నీకు  నచ్చేలా...

నేను నీతో  భర్త లా  కాకుండా...  అన్నయ్య   లా  ఏడిపిస్తా...తమ్ముడిలా  నవ్విస్తా.... నాన్న  లా  నడిపిస్తా... అమ్మలా  అర్ధం  చేసుకుంటా... 

నువ్వు  మాత్రం నాకు  రేసింగ్  ఎలా  చేయాలో  నేర్పించు ... నేర్చుకుంటా...

విన్నీ  అటు  చూడు  ఆ రోడ్ పక్కన   గుర్రం , ఎంత  బాగుంది  కదా... నాకు  హార్స్ రైడింగ్  వస్తే  ఎంత  బాగుండు.. మగధీర లా  రాంచరణ్  లా  నిన్ను  ఎక్కించుకుని  వెళ్ళేవాడిని..

కార్తీక్  ఒక్క  నిమిషం  ఆగు  ఇప్పుడే  వస్తాను.... అని  చెప్పి  విన్నీ  వెళ్లి  ఆ  గుర్రం అతనితో  మాట్లాడి... విన్నీ  హార్స్ ఎక్కి అలా  వస్తుంటే....

నేను  గాలిలో  తేలిపోతున్నా... ప్రతీ  అమ్మాయి  తన  రాకుమారుడు  గుర్రం  మీద  వచ్చి  తనని  గుర్రం  మీద తీసుకుని పోయినట్టు... కలలు  కంటుంది... కానీ  విన్నీ  అలా  హార్స్  మీద  వస్తుంటే....

ఏంటి  కార్తీక్  అలా  చూస్తున్నావ్...  రా  ఎక్కి  గుర్రం మీద  కూర్చో  అని  చేయి  అందించింది... నేను  తను  చెప్పింది  కూడా  వినకుండా  తననే  చూస్తున్నా...

హాలో సార్  చూసింది చాలు  వచ్చి  ఎక్కండి... అడిగారు  గా  ఇంకా  ఎన్ని  టాలెంట్స్.. ఉన్నాయి  అని అడిగారు గా , నాకు..  హార్స్  రైడింగ్.   కూడా  వచ్చు....

విన్నీ  ముందు  నేను  వెనుక... ఇద్దరం  అలా గుర్రం  మీద  వెళ్తు ఉంటే...

నన్ను  తీసుకుపోవడానికి... దేవలోకం  నుండి వచ్చిన... దేవకన్య  లా అనిపించింది....

ఇంకా  నేను కలలు  కన్న వెన్నెల  నా  ముందు ప్రత్యక్షము  అయ్యి  నన్ను  గుర్రం మీద  తీసుకుని  పోతున్నట్టు  ఉంది...

విన్నీ  నువ్వు  అడిగావు  లైఫ్  లాంగ్  ఇలా  నే  ఉండిపోతే  బాగుంటుంది ... అని ఇప్పుడు నేను  అడుగుతున్నా.. లైఫ్  లాంగ్  ఇలా  నే  ఉండిపోతే  ఎంత  బాగుంటుంది...

మనకు బాగానే ఉంటుంది .... కార్తీక్  కానీ..  గుర్రానికి కాళ్ళు  నొప్పులు  వస్తాయి  ఏమో  అలోచించు...

ఇద్దరం  అలా  నవ్వులు  లోకం  లో  అలా  ఆ  రాత్రి  ఆలా  సాగిపోయాం...

3డేస్  తరువాత ...

ఆ  రోజు  మా  మొదటి  రాత్రి...

ఎక్కువ  ఆలోచించకండి... కార్తీక్  కి  హార్స్  రైడింగ్  బాగా  నచ్చింది... మళ్ళీ  విన్నీ ని తీసుకుని   ఈ  రోజు  కూడా  .. హార్స్  రైడింగ్  నేర్చుకోవడానికి   వెళ్ళాడు....



Rate this content
Log in

Similar telugu story from Comedy