STORYMIRROR

film nagar

Action Crime Thriller

4  

film nagar

Action Crime Thriller

బ్లాక్ కాప్

బ్లాక్ కాప్

15 mins
256

ఈ రోజు వాతావరణ వార్తలు చదువుతున్నది భరద్వాజ,
💭💭💭💭💭💭
బంగళాఖాతం లో అల్పపీడనం కారణంగా రాబోయే 24 గంటలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ,చేపలు వేటకు కు వెళ్ళే మత్స కారులు అప్రమత్తం గా ఉండాలని పోలీసు శాఖ 2 వ నంబర్ హెచ్చరికలు జారీ చేసింది
💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭

అది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ ,సమయం రాత్రి 7 గంటలు ,మాతో పాటుగా వచ్చిన బస్ ఇక ముందు కు వచ్చే అవకాశం లేక మమ్మల్ని అక్కడే దించి మా హెడ్ క్వార్టర్ కి తిరిగి ప్రయాణం అయ్యింది

ఇక మేము ఇక్కడ నుండి నడక ప్రయాణం చేయాలి ,
నాతో పాటుగా, మరో 12 మంది కమాండోస్.

మాతో పాటుగా తెచ్చుకున్న బాగ్ లో, వాటర్ బాటిల్,తినటానికి బ్రెడ్ ,కొద్దిగా ఫుడ్ ఉంది చేతిలో ఆయుధం(ak-47), కొన్ని అడ్వాన్స్డ్ గన్స్ ఉన్నాయి,బుల్లెట్స్, గ్రనెడ్స్ , నావిగేటర్,నైట్ విజన్ గాగుల్స్. కూడా ఉన్నాయి

వీటితో పాటుగా మేము ఉండటానికి , టెంట్ ఐటమ్స్ ఉన్నాయి
ఒక్కోసారి ఆపరేషన్ అంటే 3లేదా 4 డేస్ మొత్తం అడవిలోనే ఉండవలసి వస్తుంది

తాజా ఎన్నికల నేపధ్యం లో మావోయిస్ట్ మూవ్మెంట్ ఉండవచ్చు అని ఇంటెల్జెంట్ రిపోర్ట్స్ తో మా ఆపరేషన్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది

అలా అడవిలో మా ఆపరేషన్ మొదలైంది నడుస్తూనే ఉన్నాం ,మాకు మొదట్లో ఫారెస్ట్ లో నడవడం చాలా కష్టం గా ఉండేది కానీ రాను రాను ఆపరేషన్స్ చేస్తూ చేస్తూ మాకు నెమ్మదిగా అలవాటు అయ్యింది

అడవిలో అలా నడుస్తూ 5 కిలోమీటర్స్ లోపలికి చేరుకున్నాము
అప్పటికే సమయం 9 గంటలు అయ్యింది మాకు కాస్త అలసట గా అనిపించింది ఒక ప్రదేశం లో ఆగాము

మాతో తెచ్చుకున్న బ్రెడ్ కొద్దిగా తిన్నాం, కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక స్టార్ట్ చేశాం ఇంకో 2 km వెళ్ళాక వర్షం మొదలైంది

సమయం రాత్రి 10గంటలు అడవి మద్య లో ఉన్నాము జోరుగా వర్షం మా బుల్లెట్స్ , వెపన్స్ వర్షం లో తడవకుండా మాతో తెచ్చుకున్న కవర్స్ తో కవర్ చేశాం




చిన్న టెంట్ కట్టి అందులో మేము, మాతో పాటు తెచ్చు కున్న ఫుడ్ ,బాగ్ ,వెపన్స్ , గ్రెనేడ్ ఉంచాము, మేము తడిచినా పర్లేదు కానీ అవి తడవకుండా చూడాలి అని మా ట్రైనీ డీఎస్పీ మా శిక్షణ లో తరుచుగా చెప్పేవారు

వర్షం ఆగకుండా పడుతూనే ఉంది ,సార్ వర్షం ఎక్కువ గా వస్తోంది ఇవాళ మన ఆపరేషన్ అయ్యేలా లేదు ఏం చేద్దాం సార్ అని మా dsp సార్ ను అడిగాము

లేదు కమాండోస్ ఈ ఆపరేషన్ ఎలా అయినా పూర్తి చేయాలి
చూద్దాం ఈ వర్షం మనల్ని ఎంత సేపు ఆపుతుందో

సమయం రాత్రి 11:59 ఇంకా వర్షం పడుతూనే ఉంది ఇంకో నిమిషం లో మా ఫ్రండ్ బర్త్ డే ,

హ్యాపీ బర్త్ డే రా విశ్వా అంటూ నేను వాడిని విష్ చేశాను, వాడు థాంక్స్ రా అభి నన్ను హగ్ చేసుకున్నాడు,


వాడు, నేను డిపార్ట్మెంట్ లోకి రాకముందే ఫ్రెండ్స్ ,ఇద్దరికీ ఒకే సారి ఓకే దగ్గర జాబ్ వచ్చింది

నా కోరిక మేరకు వాడు ,నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో వన్ ఆప్ ద వింగ్ అయిన ,యాంటీ నక్షల్స్ ఫోర్స్ @ గ్రేహౌండ్స్ @లో జాయిన్ అయ్యాము

నేను విష్ చేసేసరికి అప్పటి వరకు టెన్సన్ గా వారు కాస్త నవ్వు తో విశ్వా కి విష్ చేశారు , మా దగ్గర ఉన్న బ్రెడ్ ను కేక్ లా కట్ చేశాడు విశ్వా . అందరం అంత టెన్సన్ లో కూడా కొద్ది సేపు హాయి గా గడిపాము

సంతోషం గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ,మాకు కొద్ది దూరం లో శబ్దం వినపడింది ,టీం లో చురుకుగా ఉండే విశ్వా,నేను వర్షం లో తడుస్తూ ఆ శబ్దాన్ని వెతుకుతూ వెళ్ళాము

ఎవరో అమ్మాయి ఏడుపు మాకు వినిపించింది , ఆ శబ్దం పక్కనే ఉన్న లోయలో నుండి వస్తోంది ,

విశ్వా నేను వెళతాను నువ్వు ఇక్కడే ఉండు నేను చూసి నీకు సిగ్నల్ ఇస్తా

లైట్ తో నువ్వు మన టీం నీ అలెర్ట్ చేయ్యు సరే నా అని చెప్పి

నేను నైట్ విజన్ గాగుల్స్ పెట్టుకుని గ్లాక్ పిస్టల్ పాకెట్ లో ఉంది చేతిలో AK (అనతోలి మిఖాయిల్ కలాష్నికొవ్)- 47 చేతిలో ఉంది

విశ్వా దగ్గర ఉన్న తాడు తీసుకున్నా,దానిని అక్కడ ఉన్న ఒక చెట్టు కి కట్టి ఆ తాడు సహాయంతో మెల్లగా ఆ లోయలోకి దిగాను

నాకు 20మీటర్స్ దూరం లో ఆ అమ్మాయి ఉంది తన పక్కన ఎవరైనా ఉన్నారేమో నైట్ విజన్ గాగుల్స్ తో చూసా ,లైట్ వేస్తే నేను శత్రువు కి టార్గెట్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే లైట్ వేయలేదు

మెల్లగా నడుస్తూ 10 మీటర్స్ దూరం లో ఉండగా ఎవరూ అని అరిచాను,సమాధానం రాలేదు ,

నా వెపన్ ని రెఢీ గా కాక్ చేసుకుని ఏమైనా జరిగితే వెంటనే ఫైర్ ఆన్ చేసేలా అలెర్ట్ గా ఉన్నా ,



వర్షం జోరుగా పడుతోంది అందుకే అంత దగ్గరగా ఉన్నా సరే , కళ్ళ ముందు దృశ్యం సరిగ్గా కనపడట్లేదు,

ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగాను తను ఏడుపు ఆపింది ,మీరు ఎవరు నన్ను ఏమి చేయొద్దు వదిలేయండి ప్లీజ్ అని అరిచింది

నేను దగ్గరకు వెళ్ళాను ,తన కాళ్ళు,చేతులు కట్టేసి ఉన్నాయి,నేను అనుమానం గానే తనని పైకి లేపి నా పిస్టల్ గురిపెట్టి ఎవరు నువ్వు , ఇక్కడకి ఎలా వచ్చావ్ అని అడిగాను

తను ఏడుస్తూనే ఉంది కానీ సమాధానం చెప్పట్లేదు నేను కాళ్ళు కు ఉన్న కట్లు విప్పాను, కానీ చేతికి ఉన్న కట్లు అలా నే విప్పకుండా ఉంచాను

తనని నా దగ్గర ఉన్న తాడు సహాయంతో విశ్వా దగ్గరకు తీసుకుని వెళ్ళాను ,అప్పటికే మమ్మల్ని వెతుకుతూ మా కమాండోస్ అక్కడకి చేరుకున్నారు ఆ అమ్మాయి నీ చూసి షాక్ అయ్యి ఎవరు ఈ అమ్మాయి అని అడిగారు
అంతలో మా dsp సార్ ఆ అమ్మాయి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయేమో అని చెక్ చేశారు కానీ ఏమీ దొరకలేదు,ఎవరు నువ్వు అని ఆ అమ్మాయి ని అడిగారు

ఆ అమ్మాయి నన్ను ఏమి చేయొద్దు నా ఒళ్లు అంతా నొప్పిగా ఉంది ,నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంది

మేము పోలీస్ వాళ్ళము ,నీకు ఏమి చేయం బయపడకు ,నువ్వు ఎవరో చెప్పమని అడిగాము

మేము పోలీస్ అని తెలిసేసరికి తను కొద్దిగా ,కుదుట పడి ఏడుపు ఆపింది.

సారు.. నా పేరు స్వాతి ,నాది పక్కనే ఉన్న గూడెం సారు.. నేను పొలంలో పని చేస్తుండగా.

కొంతమంది.... గన్స్ పట్టుకుని వచ్చి నన్ను బెదిరించి ..ఇక్కడకు తెచ్చి అత్యాచారం చేసి ,నాకు కాళ్ళు చేతులు కట్టేసి,ఇక్కడే వదిలేశారు.. సారు

మేము ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం...
అంటే నక్షల్స్. దగ్గర్లోనే ఉన్నారు

వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్లి ఎంత. సేపు అయ్యింది.

సాయంత్రం చీకటి పడుతుండగా తెచ్చారు సారు...

అంటే వాళ్ళు ఈ ప్రదేశం విడిచి వెళ్లి దాదాపుగా ఐదు గంటలు అవుతోంది...

మనం కొద్దిగా ముందు వచ్చి ఉంటే అడ్డంగా దొరికే వారు..

విశ్వా స్వాతి చేతులకు ఉన్న కట్లు విప్పాడు.

బ్యాగ్ లో ఉన్న బ్రెడ్ తీసి ఇచ్చాడు

వాళ్ళు ఎటు వైపు వెళ్లారో గుర్తుందా స్వాతి

వాళ్ళు నన్ను లోయలో అత్యాచారం చేసి.. అక్కడే ఉన్న ఒక దట్టమైన ముళ్ల. దారి గుండా వెళ్ళారు ..

సార్ ఏం చేద్దాం వర్షం గట్టిగా పడుతోంది..
ఇప్పుడు వాళ్ళ ను వెతుకుతూ ఈ అడవులో వెళ్ళడం కష్టమేమో

లేదు మనకు ఏదీ కష్టం అనిపించ కూడదు, కమాండోస్
వాళ్ళ ను ఇప్పుడు వదిలేస్తే మళ్లీ వాళ్ళు మనకు దొరకరు,

వాళ్ళ ను ఇలానే వదిలేస్తే ,స్వాతి కి జరిగినట్టే ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి,,,

ఈ రోజు మనం పడే కష్టం, చూపించే తెగువ. ,
ఈ చుట్టుపక్కల గిరిజన గ్రామాలలోని ప్రజలకు, ఎంతో మేలు చేస్తుంది

నాకు తెలిసి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్లి ఉండరు, ఎక్కడో ఓ చోట రెస్ట్ తీసుకుని ఉంటారు,

లెట్స్ డూ ఇట్.... మనం వృధా చేసే ప్రతి నిమిషం,, వాళ్లను మనకు దొరక్కుండా చేస్తుంది.....

కానీ ఈ అమ్మాయిని తీసుకుని ఎలా వెళ్తాము సార్ అడవిలో ,ఈ వర్షం లో....

విశ్వా అడిగిన చివరి ప్రశ్న కు మా dsp సార్ కూడా ఆలోచనలో పడ్డారు....


సారు నా జీవితం నాశనం చేసిన. ఆ మానవ మృగాళ్లు ను ,వదలొద్దు సార్

నేను మీతో పాటుగా ఎలాగో లా వస్తాను.. మీరు వాళ్ల ను చంపడం నేను నా కళ్ళారా చూడాలి..

నాకు ఈ అడవి,ఈ వర్షం కొత్తకాదు సార్

స్వాతి అన్న మాటలు తో మాలో నూతన ఉత్తేజం వచ్చింది ది ,,

మా టెంట్ ఐటమ్స్ ,బ్యాగ్ ,వెపన్స్ రెడీ చేసుకున్నాము,

వర్షం ఇంకా ఎక్కువ ఐయ్యింది,,,

ఆ అర్దరాత్రి, ఆ భీకర వర్షం లో ,శత్రువు కోసం మా వేట మొదలైంది,

చీకటిని చీల్చుకుంటూ, భీకరమైన అరణ్యం మధ్యలో,
వర్షం సాక్షిగా. .... మా అడ్వెంచరస్ జర్నీ సాగుతూ ఉంది..

విశ్వా. నీ పుట్టినరోజు నాడు భలే వేడుక జరుగుతోంది..
నువ్వు ఎన్నటికీ మరచిపోలేని పుట్టిన రోజు.... ఇది



అది కూడా నీకు ఇష్టమైన వర్షంలో....
మా కాలేజీ రోజుల్లో విశ్వా వర్షం పడితే చాలు...ఈ ప్రపంచాన్ని మర్చిపోయే వాడు...వాడి వర్షం పిచ్చి మాకు కూడా ఎక్కించే వాడు...

వర్షం పడితే చాలు తడుస్తూ..... తిరిగేవాడు...
గమ్మత్తు ఏంటంటే అంత వర్షం లో తడిచినా వాడికి చిన్న జ్వరం కూడా వచ్చేది కాదు

ఎంటో వర్షానికి వాడికి ఉన్న ఫ్రెండ్షిప్...

మా ట్రైనింగ్ టైం లో.... మాకు బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు
ఒక్కోసారి నక్సలైట్ ఆపరేషన్స్... వర్షం లో తడుస్తూ చేయాలి అని చెబితే...

మేము అంతా భయపడితే..వాడు మాత్రం... ఆనందంగా నవ్వాడు,,అది చూసి మా ఆఫీసర్ ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగితే....
సార్ నాకు వర్షం అంటే ఇష్టం....మీరు చెప్పిన వర్షం లో ఆపరేషన్స్
ఎప్పుడు చేస్తానా అని... ఆసక్తిగా ఎదురు చూస్తున్న..

వెరీ గుడ్, కానీ వర్షం లో తడిసిన అంత ఈజీ కాదు,,, వర్షంలో మూమెంట్ చేయడం ...

మీ వెపన్స్ లోకి వర్షపు నీరు వెళ్లకుండా కవర్ చేయాలి., మీ బ్యాగ్ లో ని బుల్లెట్స్ తడవ కూడదు,,,
బ్యాగులు లోని మీ ఫుడ్ ను కూడా సేవ్ చేసుకోవాలి

మీ బ్యాగ్ వెయిట్ 20 కేజీలు,మీ వెపన్ వెయిట్ 5-10 కేజీలు వరకు ఉంటాయి, 5 లీటర్స్ మీ వాటర్ బాటిల్.

దాదాపుగా 30 కేజీలు బరువు తో , వర్షం వస్తుండగా, మీ కాళ్లు బురదలో దిగిపోతుండగా, నడవడానికి కష్టమైన అలాంటి పరిస్థితుల్లో మీరు ఆపరేషన్ చేయాలి

అలాంటి పరిస్థితులకు అలవాటు పడేందుకు, మా ట్రైనింగ్ లో కూడా దగ్గర్లో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లి డైలీ 10 km ,15 km,
20 km డిస్టెన్స్ తో రన్నింగ్ ప్రాక్టీస్ చేయించే వాళ్ళు

విశ్వా మీ ఫ్రండ్ ను కొద్దిసేపు ఆగమని చెప్పు, అలా అయితే మనం త్వరగా వెళ్లి వాళ్ళ ను పట్టుకోవచ్చు,,

ఓయ్ అభి నా పుట్టినరోజుకు నా ఫ్రెండు(వర్షం) రాకుండా ఉంటాడా,,నువ్వు 12 కి విష్ చేశావ్ కానీ వాడు 1 డే ముందే వచ్చి నాకు విష్ చేశాడు,నీ కన్నా వాడే నాకు బెస్ట్ ఫ్రండ్

అభి ఏం కాదు వర్షం ,చూసావా వర్షం ఎంత రొమాంటిక్ గా ఉందో ,



బాబు ,నీకు నీ ఫ్రండ్ కు నమస్కారం,నడవటానికి ఇబ్బంది గా ఉంది ఇప్పుడు నీకు రొమాంటిక్ గా ఉందా వర్షం అని నేను అంటుండగా,,

ముందు వెళ్తున్న నాకు అక్కడ రెండు దారులు కనిపించాయి,,మా టీం ను ఆగమని చెప్పాను,,,

సార్ ఇక్కడ రెండు దారులు ఉన్నాయి , వాళ్లు ఎలా వెళ్లారో మనకు తెలియదు కాబట్టి మన టీం ,రెండు గ్రూప్స్ గా డివైడ్ అవుదాము,

నేను విశ్వా మా 6 మంది ఒక టీం లా వెళతాం ,అలాగే మీరు 6 మంది డివైడ్ అవ్వండి సార్ అని చెప్పాను,

స్వాతి ని కూడా మా టీం తో తీసుకుని వెళ్తాము అని చెప్పాను,,

సార్ ఒకే అని చెప్పి డివైడ్ అవ్వడానికి రెఢీ అవుతుండగా ,

నాకో డౌట్ వచ్చింది,,, సార్ వర్షం పడుతోంది కదా వాళ్ళు కాలి గుర్తులు మనకు ఒక దగ్గర అయినా కనపడాలి గా ,అసలు మనం రైట్ వే లో వెల్తున్నామా...

లేదు అభి వాళ్ళు కూడా బాగా స్మార్ట్ గా అలోచించి ఆనవాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు,,,

వాళ్ళు కచ్చితంగా ఇటు వైపు వెళ్లే ఛాన్స్ ఉంది... ఒకే అలెర్ట్ గా ఉండండి,, వాకి టాకీ ఉందిగా ,ఏం జరిగినా వెంటనే మాకు సెట్ లో చెప్పండి,,,

అమ్మాయి జాగ్రత్త అని చెప్పి సార్ వాళ్ళ టీం వెళ్లిపోయింది...

మా టీం అండ్ స్వాతి అలా ముందు కు వెళ్తున్నాం,,,

అవును అభి నువ్వు చెప్పింది నిజమే ఇంత వర్షం లో ఎంత కవర్ చేసినా ఎక్కడో ఒక చోట వాళ్ల కాళ్ళ గుర్తులు కనిపించేవి

వెనక్కి వెళ్దామా అభి? ,,

లేదు విశ్వా వెనక్కి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు ఉండే ఛాన్స్ లేదు? ఇక్కడే దగ్గర్లో వాళ్లు ఉండొచ్చు,,,,కానీ ఏదో జరుగుతుంది ,, సరిగ్గా గమనిస్తే అర్దం మవుతుంది,,

వర్షం వల్ల మనకు పెద్ద గా శబ్దాలు వినిపించడం లేదు,,
కానీ సరిగ్గా విను మనల్ని ఎవరైనా ఫాల్లో చేస్తున్నారా?

లేదు అభి నాకు అయితే అలా ఏమి శబ్దం ఏమీ వినిపించలేదు,,

మనం ఇక్కడే అనుమానం తో వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు మిస్స్ అయ్యే ఛాన్స్ ఉంది,,ముందుకే వెళ్దాం,,

స్వాతి ఏమైనా అలసట గా ఉందా ,నడవటానికి ఓపిక ఉంది గా ,,

ఆ ఉంది సారు, నేను నడుస్తాను సార్ !

అలా ముందు కి వెళ్తున్నాం మాకు ఏదో పెద్ద శబ్దం వినిపించింది,,

అందరం అలెర్ట్ అయ్యాము,, నేను విశ్వా ముందు నడుస్తున్నాము, టీం వెనుక ఉంది ,మద్య లో స్వాతి ఉంది...

అలా వెళ్తుండగా ,మాకు పులి కాలు గుర్తులు కనిపించాయి,,

విశ్వా ఇక్కడ పులులు కూడా ఉన్నాయా?

ఆ ఉన్నాయి అభి ఎక్కువ గా లేవు 5 వరకు ఉండొచ్చు,,

వర్షం ఎంటి విశ్వా ఇంతలా వస్తుంది ,నా కళ్ళు బురదలో కూరుకు పోతున్నాయి,,

అని అంటుండగా నాకు కొన్ని శబ్దాలు మళ్లీ వినిపించాయి,,

టైమ్ చూసుకున్నాను సమయం రాత్రి 3 అవుతోంది...

సరిగ్గా ఎక్కువగా ఆ టైమ్ లో శత్రువులు ఎట్టాక్ చేస్తారు అని ట్రైనింగ్ లో చెప్పేవారు!

అభి వాళ్ళు దగ్గర్లో ఉన్నారు, సెట్ లో సార్ వాళ్ళ ను అలెర్ట్ చెయ్ , అని అంటుండగా !

అప్పటికే చాలా దూరం నడిచిన స్వాతి కళ్ళు తిరిగి పడిపోతుంది,,

విశ్వా స్వాతి ని పైకి లేపి ,నీరసం గా ఉండడం తో బాటిల్లో నీరు తాగమని ఇస్తాడు,,

స్వాతి బాటిల్ లోని నీరు తాగి ,,,. బాటిల్ విశ్వా కి ఇస్తుండగా

7.62 mm SLR బుల్లెట్ విశ్వా కి స్వాతి కి మధ్య గుండా దూసుకుని వచ్చి బాటిల్ కి తాకి బాటిల్ దూరంగా పడుతుంది,,



ఊహించని రీతిలో , అకస్మాత్తుగా దూసుకొచ్చిన బుల్లెట్ కి ఆశ్చర్యపోయిన విశ్వ వెంటనే తేరుకొని స్వాతి ని తీసుకుని చెట్టు వెనుక కు వెళ్లి

తన చేతిలో ఉన్న ak- 47 తో ఫైర్ చేస్తాడు,అప్పటికే అభి ,వాళ్ళ టీం అక్కడ దగ్గర్లో ఉన్న చెట్లు ను కవర్స్ గా తీసుకుంటారు..

నేను వెంటనే సెట్ లో dsp సార్ వాళ్ల టీంకు మెసేజ్ పాస్ చేసా,,
కానీ వాళ్ళు ఈ వర్షం లో వచ్చే సరికి కనీసం 50 నిమిషాలు పడుతుంది.

ఈ లోగా వాళ్ళ ను మేము ఎదురు కోవాలి,,వస్తున్న బుల్లెట్స్ ను చూస్తుంటే వాళ్ళు దాదాపుగా 10 మందికి పైగా ఉన్నారు,,

కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తించడం దాదాపుగా అసంభవం ,, మాకు అనుమానం రాకుండా అంతా పక్కా గా ఎలా అట్టాక్ చేశారు,,,

ప్రస్తతానికైతే మేము చిన్న పాటి లోయలో ఉన్నాము,, మావోయిస్టు లు లోయ బయట ఉన్నారు,,,యుద్ధం లో గెలవటానికి వాళ్ల కే ఎక్కువ ఛాన్స్ ఉంది,,,

సరిగ్గా పథకం ప్రకారం వాళ్ళు మా మీద కు దాడి చేశారు,,
దీని బట్టి చూస్తే వాళ్ళు చాలా సేపటి నుండి మమ్మల్ని ఫాలో అవుతున్నారు,,


మా టీం 6 మంది ఒక్కో చెట్టు ను కవర్స్ గా తీసుకుని ,ఉన్నారు స్వాతి విశ్వా దగ్గర ఉంది,,

బుల్లెట్స్ మా మీద కు దూసుకుని వస్తున్నాయి,మేము తిరిగి ఫైర్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు,,,

వాళ్ళు అప్పర్ లాండ్ లో ఉండడం వల్ల వాళ్లకు ఫైరింగ్ కి అనుకూలం గా ఉంది,,,

నా దగ్గర ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసా అందులో గ్రెనేడ్ తీసాను,,,దాని పిన్ రిమూవ్ చేసి శత్రువు ల మీద కు విసిరాను,,,

కానీ వర్షం పడుతుండడం , మేము లో గ్రౌండ్లో ఉండడంవల్ల నేను విసిరిన గ్రనేడ్ శత్రువులు వద్దకు వెళ్లకుండా వాళ్లకి కొద్దిగా ముందుగానే పడింది,,

నా బ్యాగ్ నుండి ఇంకో గ్రెనేడ్ తీశాను, దానికి ఇంకో గ్రెనేడ్ కట్టి శత్రువు ల మీద కు విసిరాను,,అది చివరలో ఉండగా నా వెపన్ తో గ్రెనేడ్ ను టార్గెట్ చేసి ఫైర్ చేశాను...

నా ప్లాన్ సక్సెస్ అయ్యింది రెండు గ్రనేడ్స్ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ బాగా పనిచేసి అక్కడ ఉన్న ఒక నక్సలైట్ చనిపోయాడు,, ఇది నేను ట్రైనింగ్ లో నేర్చుకున్న ట్రిక్..

విశ్వా బెస్ట్ ఫైరెర్. వాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా టార్గెట్ ను చూసి ఫైర్ చేయగలడు... వాడు ఆగకుండా ఫైర్ చేస్తూనే ఉన్నాడు..వాడి బుల్లెట్ కు ఇంకో నక్సలైట్ చనిపోయాడు ఇంకా 8 మంది దాక ఉండొచ్చు వాళ్ళు,,



మా టీం లో ప్రతి ఒక్కరూ , స్పెషల్ commando ట్రైనింగ్ తీసుకున్న బెస్ట్ commandos,

అందుకే అంత వర్షంలో కూడా, లో గ్రౌండ్ లో ఉండి కూడా, అంత ధైర్యంగా ఫైర్ చేయగలుగుతున్నారు.. లేకపోతే ఈపాటికి శత్రువుకి టార్గెట్ అయ్యే వాళ్లం..

నేను మా డిఎస్పి సార్ వాళ్ల టీంకు ఇంకోసారి మెసేజ్ పాస్ చేశాను.. వాళ్లు రీచ్ అయ్యే సరికి 30 నిమిషాలు టైం పడుతుంది
ఈలోగా మేము మమ్మల్ని సేవ్ చేసుకుంటూ శత్రువు ను టార్గెట్ చేసి ఫైర్ చేయాలి...

సమయం దాదాపు గా రాత్రి 3:30 అవుతుంటుంది... వర్షం ఇంకా ఉధృతంగా మారుతోంది..మా దగ్గర ఉన్న బుల్లెట్స్ కూడా అయిపోయేలా ఉన్నాయి...

నైట్ విజన్ గాగుల్స్ ఉండడం వల్ల,, మాకు ఆ చీకటిలో కొద్దిగా కనిపిస్తోంది.... మా టీం లో ఒక commando కి ఇంజురీ అయింది..
లెఫ్ట్ హ్యాండ్ నుండి బుల్లెట్ దూసుకుపోయింది... బ్లీడింగ్ ఎక్కువగా అవుతోంది..

మా బ్యాగ్స్ హెల్త్ కిట్స్ కూడా ఉంటాయి..ఓన్ గా ఎలా 1 st aid చేసుకోవాలో ట్రైన్ చేస్తారు..., మాకు ఫీల్డ్ లో ఏమైనా ఇంజురీస్ అయితే మాకు మేమే 1 st aid చేసుకోవాలి




ఆ రాత్రి సమయం లో ,అంత వర్షం లో వాళ్ల కు మాకు ,గెలవడం కోసం కాదు బ్రతకడం కోసం యుద్ధం జరుగుతోంది...,,బుల్లెట్స్ శబ్దాలు తో ఆ ప్రశాంతంగా ఉండే ఆ అడవి దద్ధరిల్లి పోతోంది.

పోటీ లో ఓడిపోతే ఇంకో అవకాశం ఉంటుంది,,కానీ ఇక్కడ అలా కాదు ఓడిపోవడం అంటే చనిపోవడం ,,ఇంకో అవకాశం ఉండదు

స్వాతి,విశ్వా పక్కన,చెట్టు వెనుక ఉంది,, విశ్వా స్వాతి కి తన పిస్టల్ ఇచ్చాడు,,,ఈ యుద్ధం లో ప్రతి ఒక్కరి దగ్గర వెపన్ చాలా అవసరం ...

మా dsp సార్ వాళ్ల టీం నుండి నాకు మెసేజ్ వచ్చింది... దగ్గర్లో ఉన్నాము ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తున్నాము అని..

ఒక్కసారిగా వాళ్ళు ఫైరింగ్ ఆపేశారు.. అప్పటి వరకు
బుల్లెట్ శబ్దాలతో దద్దరిల్లిన అడవి ప్రశాంతంగా మారింది,,
వాళ్ళు ఎందుకు ఫైరింగ్ ఆపేశారో నాకు అర్థం కాలేదు..

ఇంత లో అక్కడ జరిగిన దృశ్యానికి మా మతి పోయింది.. అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాము...

స్వాతి పిస్టల్ తో వెనుక నుండి విశ్వ తలకు గురి పెట్టి ఉంది..
కదిలితే కాల్చిపారేస్తా,, ముందుకు పదరా అని విశ్వా ను తీసుకువెళుతుంది.

ఫైర్ చేద్దామంటే , విశ్వా కి తగులుతుందేమో అని సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోయాం..




విశ్వా తనకు తెలిసిన టాక్టిక్స్ తో తప్పించుకోవాలని చూసాడు.. స్వాతి గూడ ఆరితేరిన నక్సలైట్ అనుకుంటా,, ముందే గ్రహించి విశ్వ కుడి భుజానికి షూట్ చేసింది...

విశ్వా ను కాపాడుదామని నేను ముందుకు వెళ్ళాను. స్వాతి పిస్టల్తో షూట్ చేసింది.. నా లెఫ్ట్ హ్యాండ్ లో బుల్లెట్ దిగింది..

అలా బెదిరిస్తూ విశ్వా ను తీసుకొని , వాళ్ల నక్సలైట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయింది...

ఇంతలో మా డీఎస్పీ సార్ వాళ్ళు టీం వచ్చింది...

జరిగింది తెలుసుకుని వాళ్ళ కూడా ఆశ్చర్యపోయారు..
అంటే మనం వాళ్ల ట్రాప్ లో ఇరుకున్నాము ..

మనం 7 కి వచ్చినప్పుడే వాళ్లు మనల్ని చూసారు..
స్వాతి తో మనల్ని ట్రాప్ చేసి , రెండు టీం లు గా విడగొట్టి,,
సరిగ్గా మనం లో గ్రౌండ్ లో ఉన్న టైంలో మన మీద అటాక్ చేశారు

మనం ఇప్పుడు ఎటువంటి ఫైర్ చేసిన, అక్కడ ఉన్న విశ్వా కు రిస్క్ అవుతుంది..

మనం పూర్తిగా ట్రాప్ లో చిక్కుకున్నాము సార్... విశ్వా మనకు దక్కాలి అంటే.. మనం వాళ్ళతో శాంతి ఒప్పందం చేసుకోవాలి..అభి నీకు తెలియంది కాదు...ఒక్కరి కోసం ఆలోచించి అంతమందిని వదిలేయడం కరెక్ట్ కాదు...




సార్ వాడు నా ఫ్రెండ్ అని చెప్పట్లేదు ,, ఎన్నో ఆపరేషన్స్ లో వాడు ప్రాణాలకు తెగించి ఫైట్ చేశాడు..అలాంటి వాడు ఈ రోజు రిస్క్ లో ఉన్నాడు, వాడి పుట్టిన రోజు సార్ ఈ రోజు ఆలోచించండి ..

అభి విశ్వ అంటే నాకు కూడా ఇష్టమే, విశ్వ ప్లేస్లో లో నేను ఉన్నా కూడా ఇదే చేసేవాడిని... మనం ఫైర్ చేద్దాం..

ఇంతలో నక్సలైట్ ,, మీరు ఇప్పుడు ఎటువంటి ఫైర్ అయినా చేస్తే మీ కమాండో ను చంపేస్తాం.. మీ commando మీకు కావాలి అంటే , మీ వెపన్స్, గ్రనేడ్స్ అన్నీ మాకు ఇచ్చేసి మీరు వెళ్లి పోవాలి... మాకు వెపన్స్ కావాలి మీ ప్రాణాలు కాదు

మా డిఎస్పి సార్ అందుకు ఒప్పుకోలేదు.. వాళ్లను అస్సలు వదలొద్దు,, మన ఫైర్ చేద్దాం... అన్నారు..

సార్ నేను ఒప్పుకోను ,, విశ్వ లాంటి కమాండో మన రాష్ట్రానికి చాలా అవసరం.. వాడిని అలా శత్రువులకు వదిలేయడం కరెక్ట్ కాదు సార్...

ఇక్కడ నేను చెప్పేది వినడం మాత్రమే మీ పని, నా ఆర్డర్స్ మీరు పాటించాలి, ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని ఆర్డర్ ఇచ్చారు...



సార్ ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఒక ప్లాన్ చెపుతాను..

నీ ప్లాన్ బాగుంది కానీ వెపన్స్ , బ్యాగ్ తో గ్రెనేడ్ తీసుకుని ఒంటరిగా ఎవరు వెళ్తారు..

నేను వెళ్తాను సార్ ...,,అభి నీకు ఆల్రెడీ ఇంజురీ అయ్యింది.నీ లెఫ్ట్ హ్యాండ్ నుండి బ్లీడింగ్ అవుతోంది ..నువ్వు ఎలా వెళ్తావు

వెళ్తాను సార్ పర్లేదు....

నేను బ్యాగ్ వెపన్స్ తీసుకొని ఒంటరిగా , బయలుదేరాను..
విశ్వా ను ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు...

నేను వాళ్లకు దగ్గరగా వెళ్లాను.. విశ్వా ను ముందు పంపించండి అప్పుడే మీకు ఈ బ్యాగ్ ,వెపన్స్ ఇస్తాను అని గట్టిగా అరిచాను

స్వాతి విశ్వ ను తీసుకుని ముందుకు వచ్చింది,,

నేను స్వాతి కి బ్యాగ్ వెపన్స్ ఇచ్చి,

నేను విశ్వా ని తీసుకుని మా టీం దగ్గరకు వెళ్తున్నాం ..

స్వాతి బ్యాగ్,వెపన్స్, తీసుకొని నక్సలైట్స్ దగ్గరికి వెళ్తోంది.

ఇంత లో వాళ్ళు వెళ్తున్న మా మీద ఫైర్ ఆన్ చేశారు..





ఒక బుల్లెట్ నా తల పక్క నుండి దూసుకుపోయింది.

ఇంతలో మేము అలెర్ట్ అయ్యి చెట్టు కోసం చూస్తుండగా

ఒక పెద్ద విస్పోటనం , అంత పెద్ద వర్షం లో కూడా ,బారి వెలుగుతో విస్పోటనం జరిగింది

దెబ్బకు స్వాతి తో పాటుగా మాహోయిస్ట్ లు అందరూ ....జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు...

విశ్వా షాక్ లో ఉండిపోయాడు...అసలు అంత పెద్ద విస్పోటనం ఎలా జరిగిందో అర్దం కాలేదు..



మా dsp సార్ పరుగున వచ్చి గట్టిగా అభి ని గట్టిగా హత్తుకుని ,,నీ ప్లాన్ సక్సెస్ ,మన ఆపరేషన్ కూడా సక్సెస్, నీ ఫ్రండ్ ను కూడా కాపాడావు ,im proude of you cammando ..
అని నాకు సెల్యూట్ చేశారు,,

విశ్వా కు ఏమీ అర్దం కావట్లేదు ,,అసలు అంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది,అభి ని ఎందుకు dsp సార్ సెల్యూట్ చేశారు అని

విశ్వా అదే విషయం నన్ను అడిగాడు,, ఓహో అదా ప్లాన్ ఎంటి అంటే



నేను ఇచ్చిన బ్యాగ్ లో చుట్టూ గ్రెనేడ్స్ పెట్టాము,మద్య లో బాంబ్ పెట్టాము,,ఆ రెండూ ఒకే సారి బ్లాస్ట్ జరిగి మొత్తం ఓకే సారి పోయారు ,మీ ఫ్రండ్ స్వాతి కూడా పోయింది....

ఆ పేరు ఇంకో సారి అనకు ,నాకు కోపం వస్తుంది,,నేను ఇచ్చిన పిస్టల్ తో నాకే గురిపెట్టింది.. మనల్నే మోసం చేయాలని చూసింది



ఆ సంగతి పక్కన పెట్టు , నీ పుట్టిన రోజు నాడు,ఈ అడవి తల్లి కి అంకితం అయిపోయే వాడివి..విశ్వా..

నా ఫ్రండ్ అభి ఉండగా ,,నాకేమీ అవుతుంది రా......

అబ్బో మరీ మీ ఫ్రండ్ వర్షం అన్నావు గా ,,

అవును ఇప్పటికీ వాడు నా ఫ్రండ్ నే,,, వాడే లేకపోతే నా ఫ్రండ్ అభి చేసిన ఇంత గొప్ప ఆపరేషన్ లో నేను ఒక బాగం అయ్యే వాడిని కాదు గా

అందుకే వర్షం కూడా నా బెస్ట్ ఫ్రెండ్....

ఇంతలో మా dsp సార్ అందరినీ పిలిచారు...



అందరం ఒక దగ్గరకు చేరుకున్నాము,,నాకు లెఫ్ట్ హ్యాండ్ లో బుల్లెట్ దిగడం వల్ల బ్లీడింగ్ అవుతోంది,,

విశ్వా కు కుడి భుజం ,నుండి బ్లీడింగ్ అవుతోంది..ఇంకో cammandoo కు కూడా బాగా ఇంజురీ అయ్యింది

dsp సార్ ఒక పెద్ద జాతీయ జండా తీసి అక్కడ ఉన్న ఒక కర్రకు కట్టి అందరం చుట్టూ చేరాము....

త్రివర్ణ పతాకం సాక్షి గా ఆ క్షణం నాకు చాలా గర్వంగా అనిపించింది,,,,

మేము చేసే యుద్ధం విలువ ఈ అడవికి , ఆ త్రివర్ణ పతాకానికి తప్ప బయట ప్రపంచానికి తెలియదు

ఒక్కో సారి అనిపిస్తుంది,, మా ఫ్యామిలీ ను విడిచి పెట్టీ ఇలా ప్రణాలుకు తెగించి అడవిలో, నిద్ర లేకుండా ,వర్షానికి లెక్క చేయకుండా ,ఇలా యుద్ధం చేస్తాం.... బయట ప్రపంచానికి తెలియని యుద్దం చేస్తాం

100 రూపాయలు తీసుకునే పోలీస్ గురించి మాట్లాడతారు ,కానీ 100 మందిని కాపాడే పోలీస్ గురించి మాట్లాడరు..

మాకు psychology స్పెల్లింగ్ తెలియక పోవచ్చు ,,కానీ 10 మంది ఆపదలో ఉంటే మా ప్రాణాలు గురించి లెక్క చేయక respond అవ్వడం మాత్రం తెలుసు

మీరు ఎప్పుడైనా,ఎక్కడైనా @ పోలీసులు ధర్నా@ అని చదివారా,చూశారా,....చూసి ఉండరు....

అంటే మాకు కష్టాలు లేవు అని కాదు, మేము గనక ధర్నాలు చేస్తే రోజు కు ఒకటి జరుగుతుంది, మేము అలా ధర్నాలు,సమ్మెలు చేస్తే ఆపే వాళ్ళు కూడా ఉండరు, కానీ మేము అలా చేయం కారణం

మా ఖాకీ యూనిఫాం ,ఈ దేశ పతాకానికి, ప్రజలకు అంకితం...

త్రివర్ణ పతాకం సాక్షిగా , ఆ వర్షం లో, అడవి మద్య. లో , మా దేహం నుండి,,, రక్తం కారుతుండగా. ,, మా అందరి నోటి నుండి వచ్చిన ఒకే ఒక మాట

🇮🇳🇮🇳🇮🇳 జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

చీకటి చూడని.......................... యోధుల కథ
కష్టాన్ని ఎదిరించే.........................ఖాకీ. కథ

రేపటి చరిత కు వెలుగు ను నింపే ......రావణ వధ
నిప్పులు చిమ్ముతూ ...................ముందుకు..... పదా

కొన్ని యదార్థ సంఘటనల కథే ఈ🇮🇳 ఖాకీ కథ 🇮🇳

నక్సలైట్స్ చేతుల్లో వీర మరణం పొందిన మా పోలీస్ సోదరులకు ఈ కథ అంకితం. ....జైహింద్
రవికుమార్ .M



Rate this content
Log in

Similar telugu story from Action