వీడియో కాల్
వీడియో కాల్


29-03-2020
ప్రియమైన డైరీ,
దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది.ఇవాళ ఐదో రోజు.తెలంగాణ ఆంధ్రపదేశ్ బోర్డర్లు ఓపెన్ చేయడంతో చాలా మంది జనం వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు.
నా కజిన్స్ ఇంకా హైదరాబాదులోనే
ఉండిపోయారు.ఇంట్లో ఉండి ఉంటే అందరం బాగుండేది.కానీ ఎక్కడున్నా సామాజిక దూరం పాటించడం తప్పనిసరి కదా.
అందుకే అందరం గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకున్నాం.కాసేపు ఒకరి పరిసరాలు మరొకరికి చూపించుకున్నాం.ఆదివారం అలా వీడియో కాల్ తో గడిచింది.