STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

విధికి ఒక సవాల్

విధికి ఒక సవాల్

1 min
252

ఇక నేనూ నువ్వు మాట్లాడుకోవడం గురించా. అది జరగని పనిలే.

నేనూ విధికి సవాల్ విసిరా. నన్ను పెట్టినంత బాధ ఇంకొకర్ని పెట్టకుండా ఉండు అని. కష్టమే అంది విధి. 


ఏం? ఎందుకు అన్నాను. ఏదో మనల్ని అర్థం చేసుకున్నట్లు అనిపించే వ్యక్తిని మనకు ఎర వేయడం, ఆ తర్వాత గొడవలు పెట్టి దూరం చేయడం. ఇదేగా దాని ఆట.


మరి ఇన్ని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటారు. అంతే కదా. 


జీవితమంటే అదే. ఎంత తెలిసినా మళ్లీ మాయలో పడ్డం. ఆ తర్వాత గగ్గోలు పెట్టడం.


కానీ ఏమాటకామాట. నేను నమ్మినా నిన్ను. బాగా నమ్మినా. ఈ డైలాగ్ మామూలే. ఇలా చెప్తే నీతో సహా అందరూ ఒకటే కూత కూస్తారులే.


నమ్మితేనే కదా మోసం చేసేది అని. ఏం పాపం! నమ్మితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవచ్చు కదా. మనకు బుద్ధి లేక సామెతలు మళ్లీ..


Rate this content
Log in

Similar telugu story from Abstract