Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

వెలిగే తామర పువ్వులు

వెలిగే తామర పువ్వులు

1 min
301


కళా! అటు వైపు ఏముందో ఎవరికీ తెలీదు. వెళ్ళడం ప్రమాదం.

సరస్సు దాటి అడవిలోకి వెళ్ళింది కళ.


నడుస్తూ వెళుతుంటే ఒక గుహ కనిపించింది. ఎముకల గూళ్ళు దాటుకుని వెళ్ళింది. గుహ లోపల చీకటి. టార్చ్ ఆన్ చేసి చూసింది. వెలుపలకు వేరే మార్గం ఉంది. తచ్చాడుతూ అడ్డుగా ఉన్న రాయిని తీసింది.


అక్కడ నుంచి మరింత చిమ్మచీకటిలోకి వెళ్ళింది. ఏదో తట్టుకుని జారిపడడం వరకే తనకు గుర్తుంది. కళ్ళు తెరిచి చూస్తే సరస్సు మధ్యలో తేలుతూ ఉంది.


తామర తూడుల చేత బంధించబడ్డాయి ఆమె కాళ్ళు. జాగ్రత్తగా గమనించింది కళ. సాహసం వృథా కాకూడదు. తన వెంట తెచ్చుకున్న వస్తువులేవీ ఇప్పుడు దగ్గర లేవు.


ఇవి సాధారణ తామర పుష్పాలు కావు. ఆ రాత్రి కదలకుండా నీటిలోనే ఉంది. సూర్యుడు రాగానే తామర పూవులు విచ్చుకున్నాయి. బంధనాలు వాటంతటవే తెగిపోయాయి.


కళ తామర పూవును తీసుకుని ఒడ్డుకు చేరింది. రాత్రంతా వెలుతురు, శక్తిని వెదజల్లే తామర పువ్వులు అవి. 


ఊరు మధ్యలో ఉన్న కట్టడం మీద ఆ తామర పువ్వును ఉంచి నీళ్లు పోసింది.


రాత్రుళ్లు ఆ తామర పువ్వు కాంతిని వెదజల్లుతూ కనిపించింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract