STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఉత్కంఠభరితంగా..

ఉత్కంఠభరితంగా..

1 min
6

పక్కింట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతోంది అన్నాడు వాసు. 

ప్రపంచంలో మనకు సంబంధించిన విషయాలు తప్ప అన్నీ

ఉత్కంఠభరితంగా అనిపిస్తాయి అన్నాడు సురేష్.


అలా కాదు గానీ, లాస్ట్ టైం నువ్వు సస్పెన్స్ ఫీల్ అయ్యింది ఎప్పుడు చెప్పు? Anj అడిగాడు వాసు.


మొన్న మనం witch సినిమా చూశాం కదా.. అప్పుడు అన్నాడు సురేష్.


అంటే నిజ జీవితంలో ఉత్కంఠ లేదంటావ్? అంటూ వాసు నవ్వాడు. 


ఎందుకు లేదూ? సాయంత్రం ఊతప్పంలోకి అల్లం చట్నీ ఇస్తాడా ఇవ్వడా.. రేపు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఆఫీసుకి టైమ్ కు వెళ్లగలమా లేదా.. ఇలా అన్నిటిలో సస్పెన్స్ కదా అన్నాడు సురేష్.


నిన్నడిగాను చూడు.. నాదీ బుద్ధి తక్కువ అని వాసు పక్కింట్లో వాళ్ళని క్రికెట్ స్కో

ర్ అడిగాడు.



Rate this content
Log in

Similar telugu story from Abstract