Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

ఉసుర్లు

ఉసుర్లు

2 mins
502


ఆకాశం మబ్బు పట్టింది. ఋతపవనాల రాక గురించి నిన్నే వార్తల్లో చెప్పారు. 


శ్రావణి పిల్లలకు ట్యూషన్ చెబుతోంది. అందరూ చిన్న పిల్లలే. కాసేపు హోమ్ వర్క్ చేయించి తరువాత కాపీ రైటింగ్ వ్రాయించి పంపుతూ ఉంటుంది.


నాలుగు చినుకులు పడి ఆగింది వర్షం.

ఇవాళ వర్షం పడడం ఖాయమని శ్రావణి పిల్లల్ని ఇంటికి పంపించేసింది. తన ఇంటి పక్కనే ఉన్న లావణ్యని పిలిచింది. 


ఇదిగో టీ. ఏం చేస్తున్నావ్ అని అడిగింది ఓ పెద్ద కప్పులో టీ ఇస్తూ. 


లావణ్య తన డాబా మీద నుంచే టీ తీసుకుంది. వాళ్ళ ఇద్దరి ఇళ్లకీ మధ్య కేవలం కాస్తే ఖాళీ ఉంది. అందుకే ఒకరింట్లోంచి ఒకరికి ఏదైనా ఇచ్చుకోవాలంటే గోడ మీద నుంచే ఇచ్చుకోవడం మాట్లాడుకోవడం అలవాటు అయ్యింది.


ఇవాళ కొత్త వంట చేసే సరికి ఆలస్యమైంది. లావణ్య టీ తాగుతూ అంది. 

లావణ్యకు యూట్యూబ్ లో ఒక వంటల ఛానెల్ ఉంది. లక్ష మంది రోజూ ఆమె వీడియోలు చూస్తారు.


శ్రావణి నవ్వుకుంది. మొత్తానికి డబ్బులు బాగా వస్తున్నాయ్ అంటావు అని అంది.


ఏం డబ్బులు శ్రావణి. పోటీ పెరిగిపోయింది. Influencers ఎక్కువ అయ్యారు. ఇప్పుడు అందం గురించే ఎక్కువ చూస్తున్నారు.


ఇక నేను కూడా అందం గురించే చెప్పాలి అని లావణ్య విసుగ్గా చెప్పింది.

అవునూ. Influencers పెరిగారు. ఎందుకంటావు. అసలేం జరుగుతోంది జనాల్లో అని అడిగింది శ్రావణి.


అదేం లేదు. జనాలు ఏది కొనాలన్నా ఏం తినాలన్నా ఏం చేయాలన్నా సోషల్ మీడియా influencers ని ఫాలో అవుతున్నారు. వారిలా ఉండాలని వారిలాంటి బట్టలు వేసుకోవాలని వారిలాగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.


కానీ అందరికీ అన్నీ వర్కవుట్ అవ్వవు. అది అర్థం చేసుకోవడానికి మళ్లీ ఇంకో influencer ని ఫాలో అవ్వక తప్పదు అని చెప్పింది లావణ్య.


పడ్డ కాస్త వర్షానికి అప్పుడే ఉసుర్లు లైట్ల దగ్గరికి చేరాయి. అప్పటికే నూనె రాసిన కాగితం అక్కడ కట్టి ఉండడంతో ఒక్కొక్కటీ ఆ కాగితానికి అంటుకుని ఇక ఎగరలేకపోతున్నాయి. 


అంటే ఇప్పుడు జనాలు ఉసుర్లు అంటావ్ అంది శ్రావణి. అదెలా అంది లావణ్య. 

Influencers కి ఉన్న పాపులారిటీ అనే లైటు చూసి తమ స్థితి మరచి జనాలు ఉసుర్లలాగా వెలుగు వైపు 

ఆకర్షించబడి నూనె రాసిన కాగితాన్ని తాకి నష్టపోయినట్లు ఉంది అని చెప్పింది శ్రావణి.


 ఏమో బాబు. నీ పోలిక నాకు నచ్చలేదు కానీ నాకు నేను కూడా ఉసుర్లలాగా ఎక్కడికో ఆకర్షించబడుతున్నట్లు అనిపిస్తోంది అని పెదవి విరిచింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract