Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

టాలెంట్ ఉండాలి

టాలెంట్ ఉండాలి

2 mins
276


ప్రవల్లికా! ఏంటిది? ఎందుకు కొడుతున్నావ్ వాణ్ణి. శ్రీకర్ ఇంటికి రాగానే నాలుగేళ్ల కుశాల్ ని పట్టుకుని కొడుతున్న భార్యను మందలించాడు.


తండ్రి రాగానే బిక్కుబిక్కుమంటూ శ్రీకర్ వెనుక నక్కి దాక్కున్నాడు కుశాల్. బాగా భయపడ్డాడు అంటూ బాబుని తీసుకుని బెడ్ రూం లోకి వెళ్లి తన కోసం తెచ్చిన కొత్త కథల పుస్తకం ఇచ్చాడు. అది పిల్లలు ఇష్టపడే బొమ్మల కథల పుస్తకం.


నాన్నా దా చూద్దాం అని పిలిచాడు కుశాల్. ఇప్పుడే వస్తాను అని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్లాడు.


ఏంటి ప్రవీ ఇదీ అని వంటింట్లోకి వెళ్ళాడు. బాణలిలో ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి అచ్చం ఆమెలా.


ఒక్క పాట రాదు. రైమ్స్ రావు. సుడోకు చెయ్యలేడు. చూడు వీళ్ళని అంటూ తన ఫోన్లో వీడియోలు చూపించింది. ఈ మధ్య చాలా యాప్స్ లో పిల్లల రైమ్స్ , వీడియోలు, జోకులు, డ్యాన్సులు ఉంటున్నాయి. టాలెంట్ చూపించమంటూ ఊదరగొడుతున్నాయి.


మూడేళ్ల పాప అన్నమయ్య కీర్తనలు పాడుతోంది. నాలుగేళ్ల అబ్బాయి క్లిష్టమైన సుడోకులు చేసేస్తున్నాడు.


ప్రవీ! ఇందుకా వాణ్ణి కొడుతున్నావ్. వాడి హోమ్ వర్క్ వాడు చేస్తున్నాడు. క్లాసులో బాగానే ఉంటున్నాడు అని టీచర్లు చెప్పారుగా.


చెప్పారు. కానీ స్పెషల్ టాలెంట్? అని అంది ప్రవల్లిక.


అయ్యో ప్రవీ. అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. మనం పిల్లలకు మంచి అభిరుచులు, అలవాట్లు పెంపొందేందుకు మంచి వాతావరణం కల్పించాలి. అంతే. వారి అభిరుచికి తగ్గట్టు శ్రమ పడితే వారి జీవిత లక్ష్యాల్ని సాధిస్తారు. వారి టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ ఇతర పిల్లలు చేసేవి చూసి వారిని ఒత్తిడి చేసి మరీ ఇలా చేయించడం కరెక్ట్ కాదు. పువ్వను వికసించనీయాలి. తరువాత దాని అందం చూడాలి. అలా కాకుండా దాని రేకులు బలవంతంగా తీసేస్తే అది వికసిస్తుందా. చెప్పు.


నువ్వు ఏం మిస్ అవుతున్నావో నాకు తెలుసు అంటూ హాల్లో ఉంచిన వీణను తీసుకుని ఆరు బయట కూర్చున్నాడు. ప్రవల్లిక బాబు పుట్టాక కచేరీలకు వెళ్ళడం లేదు.


కూర అయిపోయింది కదా. ఇదిగో ఈవేళ ఓ మంచి రాగం వినిపించు అన్నాడు. 


ప్రవల్లిక వీణను పట్టుకుని అలా అలవోకగా సాధన చేస్తుంటే కుశాల్ పరుగెత్తుకుంటూ వచ్చి చూశాడు. ఆమె ముఖంలో ఏదో ప్రశాంతత.


మరుసటి రోజు శ్రీకర్ ఇంటికి వచ్చేసరికి హాల్లో ప్రవల్లిక కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని The Very Hungry Caterpillar పుస్తకంలో బొమ్మలు చూపిస్తోంది. 


శ్రీకర్ నవ్వుతూ లోపలికి నడిచాడు.



Rate this content
Log in

Similar telugu story from Abstract