స్త్రీసృష్టికి మూలం నీవు
స్త్రీసృష్టికి మూలం నీవు
ప్రతి ఒక్కరికి అమ్మ కావాలి...
అదే ఒక అమ్మ కడుపులో అమ్మాయి పుడుతుంది అంటే ఆ అమ్మ గర్బాన్నే ఆ అమ్మాయి కి శ్మశానవాటిక గా మారుస్తారు....
ప్రతి ఒక్కరికి భార్య కావాలి...
మరి ఆ భార్య తనలాంటి ఇంకో అమ్మాయి కి జనమ్నిస్తుంది అని తెలిస్తే మాత్రం ఆ అమ్మను కసాయి దాని లా మార్చి తన గర్భమే తన ప్రపంచం గా ఉండే పసికందును గర్భం లోనే చంపించే లా ఒప్పిస్తారు... కానీ బిడ్డను చంపుకున్న తల్లి వేదనను ఎవరు పటించుకొరు.
ఆడది అది చేయద్దు ఆడది ఇది చేయద్దు
అనే వాళ్ళు ఉన్నారు తప్ప తను చేసే మంచిని ప్రోత్సహించే వాళ్ళు కనుమరుగైపోయారు.
ఈ సృష్టిని సృష్టించే సత్తా ఉన్న స్త్రీకి ఏమైనా చేయగల సామర్థ్యం ఉండటం సహజమే కదా.....!
అయినా తెలియదు స్త్రీని పురుషునితో పోల్చడం ఎంటి... స్త్రీ ప్రకృతి.
