Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

స్నేహం - దోషం

స్నేహం - దోషం

1 min
274


ఇంత సాధించారు మీరు. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కార్పొరేట్ కంపెనీల్లో ముఖ్య సలహాదారుగా పని చేసారు.


మీకు నిరాశగా అనిపించిన విషయం ఏదైనా ఉందా? కుమారి ప్రశ్న అడిగింది.


మాధవ్ చూపులు నిశ్చలంగా ఉన్నాయి. సమాధానం చెప్పే ముందు అతని కనుబొమలు కొద్దిగా ముడుచుకున్నాయి.


చాలా రోజులైంది. అతడికి చెప్పాలని ఉంది. స్నేహపూరిత వాతావరణం లేని చోట్ల తను పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న అవమానాలు.


అలాంటివి చెబితేనే కదా అసలు సమస్యలు తెలిసేది. ఇంత స్థాయికి ఎదిగాక అవన్నీ చెబితే తన కథ మరింతగా జనాల్లోకి వెళుతుంది. అతను పడిన మానసిక వేదన, మానిపోని గాయపు తాలూకు గుర్తుగా ఇబ్బంది పెట్టసాగింది.


అప్పుడే ఓ పావురం ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. అతడి ముఖంలో చిరునవ్వు విరిసింది.


స్నేహపూరిత వాతావరణం మరింత పెరిగితే కంపెనీల అభివృద్ధి బాగుంటుంది అంటూ పావురాన్ని దగ్గరకు తీసుకున్నాడు.


కాలదోషం పట్టిన తన కథలో స్నేహానికి ఒక ముగింపు అలా ఇచ్చేసాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract