స్నేహమంటే ఎవరిది..
స్నేహమంటే ఎవరిది..
నిద్ర పడుతున్నప్పుడు మూసుకునే కంటి రెప్ప చటుక్కున ఆగి మళ్ళీ నీకోసం వెతికింది. నమ్మకం చాలా ఎక్కువగా నీకు..అందుకే ఇలా మోసపోయావ్ అని నానా రకాల మాటలు విన్నా ఓపిగ్గా ఉన్నాను l.
స్థాయి బేధం చూసి,తెలివి తేటలు చూసి, స్నేహాన్ని నిర్ణయించే నువ్వు ఇక్కడ ఉండాల్సిన సమయం వాడివి కాదు.
బహుశా అందుకే దూరంగా వెళ్ళావేమో.. కనురెప్పలకి నచ్చజెప్పి నన్ను నేను జోకొడుతూ పడుకున్నాను.
మరో కొత్త స్నేహం రేపటి నుండి. అంతా తయారుగానే ఉంది. అదే ఇల్లు. అదే వీధి. నేనైతే శాశ్వత నిద్రను దాటుకుని ముందుకు వెళ్లిపోవాలి. స్నేహితులు లేనంత దూరం కాదు. వాళ్ళను దూరం చేసుకోవాల్సిన అవసరం రానంత దూరం మాత్రమే.
దేవుడు అదే నేర్పిస్తున్నాడేమో..
