Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సమస్యలున్నా నవ్వడం

సమస్యలున్నా నవ్వడం

1 min
539


మధ్య తరగతి మగాళ్ళ గురించి లెక్చర్ దంచుతున్నాడు వివేక్. ఈ మధ్యే పెళ్లి చేసుకొని, కుటుంబ పోషణ బాధ్యతలు నెత్తిన వేసుకున్న వివేక్ లో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు.


నిన్న మొన్నటి దాకా రోజుకు మూడు సార్లు చాయ్ సమోసా బ్రేక్ కి వెళ్దాం అనేవాడు. ఇప్పుడు మరీ ఇబ్బంది పెడితే ఒకసారి వస్తున్నాడు.


మొన్నటికి మొన్న అరకు ట్రిప్ అంటే పదివేలు తీసాడు ఒక్కసారిగా. ఇప్పుడు పక్కనున్న షాప్ కి వెళ్ళడానికి కూడా బడ్జెట్ వేస్తున్నాడు.


ఏంట్రా వివేక్ ఇలా తయారయ్యావ్ ఈ మధ్య అన్నాను నేను.


బావా! పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది నా బాధ. అసలు మధ్య తరగతి మగాడంటే ఏమనుకున్నావ్. డైలీ సీరియల్ హీరోయిన్ కంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి అన్నాడు.


ఏంట్రా అని తల గోక్కున్నాను నేను. 


నిజమేరా బాబూ. వాళ్ళకి ఏడ్చే స్వతంత్రం, హక్కు ఇచ్చారు ప్రేక్షకులు. మనకు ఆ ఆప్షన్ కూడా ఉండదురా అని మరో లెక్చర్ మొదలుపెట్టాడు వాడు.


సమస్యలున్నా నవ్వడం నేర్చుకోవాలి అంటూ చెబుతున్న వాణ్ణి చూస్తుంటే నాకు గొప్ప తత్వవేత్తలు గుర్తుకువచ్చారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract