STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

సమస్యలు - సమోసాలు

సమస్యలు - సమోసాలు

1 min
377

రేపట్నుంచీ ఉప్మా పెసరట్టు మానేస్తున్నాను అన్నాడు సంతోష్.


తింటున్న సమోసా ముక్కను ప్లేటులో పక్కన పెట్టుకొని అంటే ఎల్లుండి నుంచి పెసరట్టు ఉప్మా తింటావన్నమాట! వరుణ్ అన్నాడు.


జీవన్, కళ్యాణ్ ఇద్దరూ నవ్వారు.


మీకెవ్వరికీ నేను సీరియస్ గా మాట్లాడే విషయం నమ్మబుద్ధి కావట్లేదు. ఈరోజు నన్ను కొలీగ్ అంకుల్ అని పిలిచింది తెలుసా. లావు తగ్గి నేను లుక్ చేంజ్ చేస్తా అన్నాడు సంతోష్.


సర్ సర్లే. నన్ను ఒక అమ్మాయి బాబాయ్ అని పిలిచింది అంటూ తన క్రాఫ్ సరి చేసుకున్నాడు జీవన్. అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని వరుణ్ సమోసాను కొరికాడు.


అసలు పొద్దున్నే నిద్ర లేవబుద్ధి కావట్లేదు అన్నాడు కళ్యాణ్. నీకు నిద్ర లేవబుద్ధి కావట్లేదు. నాకసలు నిద్ర సరిగా పట్టట్లేదు అన్నాడు వరుణ్.


ఏంటోరా జీవితం! పెళ్లి. పిల్లలు. EMI లు. స్కూలు ఫీజులు. సెలవు కోసం ఎదురు చూపులు..


సంతోష్ ఇంకో ప్లేట్ సమోసా తీసుకుని మాట్లాడుతూ ఎటో చూసాడు.


ఏది ఏమైనా ఇలా కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడుకునే స్నేహం ఉంటే రీచార్జ్ అయిపోతాం కదరా అన్నాడు కళ్యాణ్.


అందరూ అవునన్నట్టు తలూపారు.


వారి వారి ఇళ్లకు బయలుదేరుతుండగా, ఏరా సంతోష్ రేపు వాకింగ్ కి వస్తున్నావా? జీవన్ అడిగాడు.


వస్తారా.. తరువాత నేను ఉప్మా పెసరట్టు తినాలిగా అని నవ్వాడు. అందరూ నవ్వుతూ ఇళ్లకు బయలుదేరారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract