STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

సకారాత్మక ఆలోచన

సకారాత్మక ఆలోచన

1 min
327

ఏంట్రా నువ్వనేది? మన పేరెంట్స్ కూడా మనల్ని అర్థం చేసుకోరా?

అని మళ్లీ అడిగాను.

అవున్రా. ఇది నిజం. చాలా వరకు ఎవ్వరూ డిస్కస్ చెయ్యని నిజంరా. అవతల ఫోన్లో మా కజిన్ చెప్తున్నాడు.


ఓ వైపు మనమేదీ సాధించలేదనే కసితో ఉంటాం. ఎవర్నీ లెక్కచెయ్యం. అందర్నీ దూరం పెట్టేస్తాం.

కానీ మన పేరెంట్స్ అలా కాదు కదరా. వాళ్లకుండే ప్రెజర్స్ వాళ్లకుంటాయి. 


అబ్బాయి శాలరీ ఎంత? పెళ్లెప్పుడు? ఇలా సవాలక్ష ప్రశ్నలకు కాస్త చిరునవ్వుతో ఏదో సమాధానం చెప్పి నెట్టుకొచ్చేస్తారు. తను చెబుతూ ఉన్నాడు.


కానీ నా గురించి నెగెటివ్ గా మాట్లాడితే ఎలారా. అది కూడా ఇంట్లో వాళ్ళే.. నా గొంతు ఇక పెగల్లేదు.


అవున్రా. ఈ సమస్య ఏదో ఒక టైమ్ లో అందరం ఎదుర్కొన్నదేరా. పిల్లల భవిష్యత్తును గూర్చి బాధపడి పేరెంట్స్ కూడా వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడతారు. మనకి నెగెటివ్ గా అనిపిస్తుంది. వాళ్ళకది రియాలిటీరా.


నువ్వు చెయ్యాల్సింది పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం. అది కేవలం కెరీర్ విషయంలోనే కాదు. జీవితం విషయంలో కూడా.


ప్రతి ఒక్కడూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకోడు. అది నీకూ తెలుసు. నాకూ తెలుసు. కానీ 

సంతోషంగా ఉండడానికి లక్షలు సంపాదించాలి అనే మనుషుల మధ్య నువ్వు నీతో హ్యాపీగా ఉండాలంటే మరెంత కష్టమో చూడు. 


వాడూ చెప్తూనే ఉన్నాడు. నా ఆలోచనలు ఎటో వెళ్లాయి.



Rate this content
Log in

Similar telugu story from Abstract