Radha Krishna

Romance Classics Others

4  

Radha Krishna

Romance Classics Others

శ్వేత❤️కుమార్

శ్వేత❤️కుమార్

5 mins
362


కుమార్...శ్వేత ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఇద్దరు ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్లు కావడంతో వారి స్నేహం చాలా బలంగా తయారయింది. ఎంతలా అంటే..కనీసం ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా. కానీ వాళ్లకే ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు.

వాళ్ళ పెద్ద వాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్లకు హద్దులు పెట్టలేదు. వాళ్ళ అల్లరిని బాగా ఆస్వాధించేవారు.

ఆడపిల్లకు సహజ సిద్ధమైన అందాలు శ్వేతలో ప్రారంభం అయిన దగ్గరనుండి....శ్వేతా వాళ్ళ న్నాయనమ్మ మాత్రం కుమార్ తో ఎక్కువ చనువుగా ఉండడాన్ని మాత్రం వ్యతిరేకించేది.

అయినా కూడా..ఆవిడ ధోరణిని ఎవ్వరు పట్టించుకునే వారు కాదు.

కుమార్ శ్వేతలు BSc లో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు.

కాలేజీలో కొత్త పరిచయాలు...కొత్త స్నేహాలు....ఇద్దరికి మధ్య కొంత దూరం పెంచాయి..

కుమార్ చాలా తేలికగా..తీసుకున్నాడు ఈ విషయాన్ని..కానీ శ్వేత మాత్రం తమ మధ్య వచ్చిన ఈ కొద్దిపాటి దూరాన్ని తేలికగా తీసుకోలేకపోయింది.

కుమార్ వేరే అమ్మాయిలతో మాట్లాడిన...క్లోజ్ గా ఉన్న చాలా ఈర్ష్య పడేది. ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా జరుగుతోందో తనకు తెలియలేదు.

శ్వేతకు తెలియని గుబులు తన మనసును కుదిపేస్తోంది.

కుమార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలానే శ్వేతతో మాట్లాడడం ...వాళ్ళ ఇంట్లో అందరితోనూ మాములుగా ఉండడం చేసేవాడు.

రోజులు గడుస్తున్న కొద్దీ శ్వేతకు కుమార్ కు మధ్య దూరం బాగా పెరిగింది.

ఓ రోజు శ్వేత స్నేహితురాలు శ్వేతతో తాను కుమార్ ను ప్రేమిస్తున్నట్లు చెప్పి..కుమార్ కు తన ప్రేమ గురించి చెప్పి..తన ప్రేమను గెలిపించమని బ్రతిమలాడుతుంది.

తన స్నేహితురాలు చెప్పేంతవరకు...శ్వేతకు తెలియలేదు..తన మనసులో ఉన్న గుబులుకు కారణం కుమార్ అంటే ప్రేమ అని. అంతే...తెలిసిన వెంటనే పట్టలేని ఆనందంతో తన స్నేహితురాలిని.. పట్టుకుని...గిరా గిరా త్రిప్పి...వదిలేస్తుంది. అంతే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయినా శ్వేతా అదేమీ పట్టించుకోకుండా

ఆనందంతో మనసు ఉప్పొంగుతుంటే ఇంటికి చేరుకుని...

కుమార్ ఫొటోతో మాట్లాడుతుంది.

కుమార్..ఇవాళ నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఎంటో చెప్పనా...

నేను నిన్ను ప్రేమిస్తున్నాననిని ఇప్పుడే తెలిసింది. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎందుకో నాలో నాకే తెలియని ఈర్ష్య పెరిగిపోయేది. ఎంత అంటే.. వాళ్ళను పీక పిసికి చంపేయాలన్నంత. కానీ ఎందుకు అలా ఆలోచించే దానినో తెలియక...నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేక చాలా మధన పడిపోయాను.

కానీ ఇవాళ నా మనసులో ఉన్న ఈ లక్షణాలు ఉగ్రవాద లక్షణాలు కావని..అవి నీమీద ప్రేమ వలన కలిగిన భావాలని ఇప్పుడే తెలిసింది.

చాలా అంటే చాలా ఆనందంగా...మనసు మేఘాలలో తెలిపోతోంది...అంటూ..కుమార్ ఫోటోని గాఢంగా ముద్దుపెట్టుకుంటుంది.

ఇంతలో గుమ్మందగ్గర నుండి....ఆ ఫోటోకి పెట్టె ముద్దుని ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుందేమో కదా..🤔🤔

అనే మాట వినబడేసరికి..శ్వేత వెంటనే తల తిప్పిచూసేసరికి గుమ్మందగ్గర కుమార్ ఒక పాదం మీద ఇంకో పాదం వేసుకుని..చేతులు కట్టుకుని..గుమ్మానికి ఓరగా చారబడి..చాలా చాలా అందంగా కనిపించాడు శ్వేతకు.

అంతే..అప్పటివరకు కుమార్ కనబడితే పొట్లాడేది...ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా కుమార్ ను అలా చూసేసరికి సిగ్గుల మొగ్గగా మారి తలదించుకుంది శ్వేత.

అలా అందంగా సిగ్గుపడుతున్న శ్వేతను చూసి కుమార్ చిన్నగా నవ్వుకుంటూ... ఆ సిగ్గు ఇక్కడ పడితే బాగుండేదేమో అని తన హృదయం ఉన్న స్థానాన్ని చూపించి..రెండు చేతులు చెపుతాడు. అంతే...

శ్వేత ఒక్కసారిగా పరుగున వచ్చి కుమార్ ను అల్లుకుపోతుంది. కుమార్ శ్వేతను గట్టిగా హత్తుకుని..కాసేపు అలానే ఉండి పోతాడు. మళ్ళీ తనే.. శ్వేత మోహమును చేతుల్లోకి తీసుకుని...అందంగా శ్వేత కన్నులమీద...నుదిటి మీద ముద్దులు పెడతాడు.

శ్వేత ఆ అపురూప క్షణాలను ఆనందంగా ఆస్వాధిస్తుంది.

కుమార్ అంటాడు..శ్వేతా....నీకో విషయం చెప్పనా...నిన్ను నేను చిన్నపాటి నుండి ప్రేమిస్తున్నాను. అలానే నువ్వుకుడా నన్ను ప్రేమిస్తున్నవనే ఎప్పుడు అనిపిస్తూ ఉండేది...

కానీ నీకు ఆ విషయం చెపితే ఎలా అర్థం చేసుకుంటావో తెలియక... ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. .

ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి...అదే ఏంటంటే...నీ మనసులోని విషయాన్ని బయట పెట్టించడానికే నేను నీ స్నేహితురాలు కలిసి ఇలా నాటకం ఆడాము.😉😉

అప్పటికి గాని ఈ అమ్మాయి గారి మనసు బయట పడలేదు...అని అనేసరికి ..శ్వేత కుమార్ ని కొడుతూ...తన వెంటపడుతూ ఉంటుంది.🏃

హే...ఆగు ఆగు...అంటున్న వినిపించుకోకుండా కొడుతూ ఉంటుంది. కుమార్ వెంటనే శ్వేత నడుము పట్టుకుని గట్టిగా తన ఎదకు అదుముకుంటాడు.

అంతే శ్వేతకు ఒంట్లో ఏదో తెలియని మైకం తనని కమ్మేస్తుంటుంది. సిగ్గుతో తల వంచి కుమార్ ఛాతీ మీద చేతులు పెట్టి ...దయచేసి వదిలిపెట్టు అని బయటకి అంటుంది. కానీ మనసులో మాత్రం నన్ను వదలకూడదు అని అనుకుంటుంది.

కుమార్ మాత్రం ఆమె మనసును అర్ధం చేసుకున్నట్లు..సారీ శ్వేత అంటూనే...ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు.

సినిమాలో లాగా ఇంకేదేదో ఉహించుకుంటున్న శ్వేత ఆలోచనలను తుంచేస్తూ...హలో మేడం అంటూ తన మోహముందు చిటికలు వేసి...

ఏంటి పగలే కలగంటున్నావా...??🤔🤔

అలాంటివన్ని మన పెళ్లి తరువాతే...😜

అయ్యో🙆.. నేనేమి అలా అనుకోవడంలేదు😔

హే...అలక వద్దు...ఏదో సరదాకు అన్నాను అని కుమార్ అంటాడు.

సరే గాని..మరి నన్ను చిన్నప్పటి నుండీ ప్రేమించిన వాడివి నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు...?

ఒకవేళ నేను నిన్ను ప్రేమించకపోయింటే ఏం చేసేవాడివి.. అని శ్వేత కుమార్ ని అడుగుతుంది.

అప్పుడు కుమార్ అంటాడు...చూడు శ్వేత.. ప్రేమ అంటే మన అనుకున్న మనిషిని మనం ఎల్లప్పుడూ బాధించకుండా చూసుకోవడం.

ప్రేమ అంటే మనం ఇష్ట పడే వాళ్ళ భావాలకు గౌరవం ఇచ్చి...వారి భావాలకు అనుగుణంగా ఉండడం.

ఆ..ఆ...ఆగు...ఆగు...

ఒకవేళ నేను ఒప్పుకోక పోయి ఉంటే ఏం చేసేవాడివి అని అంటున్నా..అని అడుగుతుంది శ్వేత.

ఏముంది నిన్ను తలుచుకుంటూ నీ జ్ఞాపకాలతో నీ చుట్టూనే నీకు ఎవరి నుండి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను.

ఆంతే గాని..నువ్వు దక్కలేదని నీ మీద అటాక్ చెయ్యడం..లేదా ఏదో చేసేయ్యడం లాంటి పిచ్చి ఆలోచనలు నాకు లేవు. ఎందుకంటే..మా అమ్మ నాన్నల పెంపకం అలాంటిది.

వాళ్ళు ఎప్పుడు చెపుతూ ఉంటారు... ప్రేమ అంటే పంచేది...అంతే గాని తుంచేది కాదు అని.

నీకో విషయం చెప్పనా...మా అమ్మ వాళ్ళది కూడా ప్రేమ వివాహమే.

కాబట్టి.. నాకు ఆడవాళ్ళతో ఎలా ఉండాలో ... ప్రేమ అంటే ఏమిటో...పైశాచికం అంటే ఏమిటో విడమరిచి చిన్నప్పటి నుండి చెప్పేవారు

అర్ధం అయిందా...నా రాక్షసి..👻

అప్పుడు శ్వేత అంటుంది...అందేంటి...నేను కుడా ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేదాన్ని కదా...మరి ఎప్పుడు నేను వినలేదు..నీకు చెప్పడం..🤔

ఆ..అవును మరి...అందరికీ వినబడేలా...మైకు పట్టుకు చెపుతారా..?? అని కుమార్ ఆడిగేసరికి...

అది కాదు..అని శ్వేత ఏదో అనబోతే...

శ్వేత.. ఇంక ఆ విషయం వదిలి పెట్టు...మనకి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. కాబట్టి..

నన్ను ఎవరో ఎత్తుకుపోతారనే.. అక్కర్లేని భయాలు పక్కన పెట్టి ...

ముందు మన చదువులు పూర్తి చేసి...మన లక్ష్యాలను చేరుకుని..

ఆ తరువాత మన పెళ్లి గురించి ఆలోచిద్దాం. అని చెపుతాడు కుమార్.

అప్పుడు శ్వేత... అదేంటి కుమార్..ఏదో ముసలివాడిలా మాట్లాడుతున్నావు...

ప్రేమికులంటే...ఎన్నో సరదాలు..సరసాలు...పార్కులు..బీచ్ లు..ఇలా చాలా ఉంటాయి కదా...🤔🤔.

అప్పుడు కుమార్ అంటాడు...చూడు శ్వేత... ప్రేమ అంటే రోడ్డున పోయేవాళ్లందరికి చూపించేది కాదు. అది మన మనసులో ఉన్న వాళ్లకు మాత్రమే చూపించేది.

ప్రేమ అంటే..మనం ప్రేమించినవారిని మోసం చేయకండా ఉండడం..అంతే గాని.. పార్కులు..బీచ్ లు...తిరగడాలు లాంటివి నా ప్రేమకు విరుద్ధం...అర్ధమైందా..?? నా తింగరి బుచ్చి..అని శ్వేత చెవి మెలితిప్పి అడుగుతాడు!!😉.

వీళ్ళ సంభాషణ జరుగుతున్న సమయంలో శ్వేత తల్లి దండ్రులు వచ్చి కుమార్ చెప్పేవన్నీ విని....

చప్పట్లు కొడుతూ....లోపలికి వచ్చి...

శభాష్ కుమార్...శభాష్..👏👏👏

ప్రేమ గురించి మంచి నిర్వచనం చెప్పావు👌.

నీ ఆదర్శాలు..నీ మంచి మనసు..అన్ని మాకు కూడా నచ్చాయి. నువ్వంటే మాకు ఎప్పుడూ ఇష్టమే.

ఇప్పుడు ఆ ఇష్టం ఇంకా రెట్టింపు అయింది.

నీ లాంటి వాడు మా శ్వేత జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

god bless u both ani 🙌 అని చెప్పి..అక్కడినుండి వెళ్లి పోతారు.

శ్వేత వెంటనే కుమార్ ను గట్టిగా వాటేసుకుని.. I ❤️ U కుమార్ అని చెపుతుంది. కుమార్ కూడా I❤️U నా అందాల రాక్షసి అంటూ బుగ్గన ముద్దు పెడతాడు.

శ్వేత కుమార్ తో అంటుంది నువ్వు నా జోవితంలోకి వచ్చి నన్ను చాలా అదృష్టవంతురాలిని చేశావు.

దానికి కుమార్ అంటాడు...నువ్వు ఒక్కదానివే కాదు..నేను కూడా అదృష్టవంతుడినే...ఎందుకంటే ఈ అపరంజి బొమ్మ నా ప్రేమను అంగీకరించింది. పైగా నా అత్తమామలు కూడా మనకు ఎటువంటి శ్రమ కలిగించకుండ మన పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకే..మనం ఇద్దరం అదృష్టవంతులమే అని అంటాడు.

రోజులు గడుస్తుంటాయి.

కుమార్ శ్వేత ఇద్దరు తమ తమ చదువులు మీద పూర్తి శ్రద్ధ పెట్టి చదువులు పూర్తి చేసుకుని..ఇద్దరు Re search scholars గా జాయిన అవుతారు.

వాళ్ళ ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య మానసిక బంధం ఎంతగానో బలపడుతుంది.

వాళ్ళ ట్రైనింగ్ పూర్తి అవ్వగానే ఇద్దరు సైంటిస్టులుగా ఉద్యోగాలు సంపాదిస్తారు.

అప్పుడు శ్వేత అంటుంది...అయ్యా.. అభినవ శ్రీ రాముడా... ఇకనైనా మన పెళ్లికి పచ్చ జెండా ఉపుతావా..లేక ఇంకా మనకి ఓ 40 సం... వచ్చేక చేసుకుందామా... అని ...

అప్పుడు కుమార్ శ్వేతను గట్టిగా కౌగలించుకుని..శ్వేత పెదాలను గాఢంగా ముద్దు పెట్టు కుంటాడు.

ఈ హఠాత్ పరిణామానికి..శ్వేత కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోతుంది.

శ్వేతను వదిలిన కుమార్...హమ్...ఇప్పుడు చెప్పండి...శ్వేతాదేవిగారు...నేను రాముడినా...కృష్ణుడినా..?

ఇంకా కొన్ని రాసలీలను ప్రదర్శించమంటారా...అంటూ కొంటెగా అడుగుతాడు..

అప్పటికి గాని తేరుకోని శ్వేత.. సిగ్గు పడుతూ.. చాల్లే..అంటూ అందంగా సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంది.

ఒక మంచి రోజున శ్వేత తల్లిదండ్రులు... కుమార్ తల్లిదండ్రులు... వీళ్ళ ఇద్దరి పెళ్లికి ముహుర్తాలు నిర్ణయించి..ఘనంగా పెళ్లి చేస్తారు.

అందమైన... ప్రేమ జంట...

మనసు మనసు ముడిపడగా..

తనువు తనువు ఏకంకాగా..

కొత్త సరాగాలు పలికించగా..

కొత్త జీవితానికి నాంది పలికారు.

ప్రేమ అంటే...వ్యామోహమైంది కాదు...

ప్రేమ అంటే...ఒకరికోసం ఒకరు బ్రతకడం అని నిరూపించింది కుమార్ శ్వేతల జంట.

మరి ఆ అందమైన ...బాధ్యతాయుతమైన జంటను దీవించండి.

✍️✍️...మీ రాధాకృష్ణ


Rate this content
Log in

Similar telugu story from Romance