radha Krishna

Drama Classics Inspirational

4  

radha Krishna

Drama Classics Inspirational

సంధ్యారుణచందనం

సంధ్యారుణచందనం

3 mins
366


ఆహా..ఎంత అందంగా ఉన్నాడో...ఎంత రఫ్ గా ఉన్నాడో..మ్మ్ ..ఏ హీరో ..నా మదన కామరాజా...ఒక్కసారి ఇటు చూడవయ్యా బాబు.. నీ ఒక్క చూపుకోసం ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి.. అంటూ magzine కవర్ పేజీ మీద ఉన్న నవ మన్మధుదుని చూస్తూ..ఇంకా ఏవేవో మాట్లాడేస్తోంది చందన.

ఇదంతా దూరం నుండి గమనిస్తున్న సంధ్య ఏంటే.....ఆ పుస్తకాన్ని నలిపి నలిపి చంపేస్తున్నావు. దాన్ని పట్టుకుని ఓ తెగ రొమాన్స్ చేస్తేస్తున్నావు...? ఎవరున్నారే అందులో...అంతలా కబుర్లు చెప్పేస్తున్నావు?

నువ్వు చూస్తే నా హీరోకి నువ్వు sight కొడతావు. కాబట్టి నేను చూపించను అంది చందన.

నాకు అంత సినిమా లేదు గాని....సర్లే...మరీ ఎక్కువ నలిపేయకు ఆ magzine ని. అందులో ఈ వారం జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి. అవి నాకు చాలా ముఖ్యం.

చూడు సంధ్యా నీకు జాబ్ అవసరం అని నాకు తెలుసు అందుకే..ఒక పని చేస్తా... కవర్ పేజీ నేను తీసుకుని... మిగిలిన పేజెస్ నీకు ఇచ్చేస్తా అని కవర పేజీని జాగ్రత్తగా కట్ చేసి తన దిండు కింద పెట్టుకుంది చందన.

సంధ్య పని పూర్తి చేసుకుని magzine తీసుకుని జాబ్ columns చూసి తన qualification కి తగ్గ జాబ్ కు apply చేస్తుంది. ఒక వారంలో ఇంటర్వూకు పిలుపు రావడం...అందులో సంధ్య ఎంపిక కావడం.. సంధ్య జాబ్లో జాయిన్ అవ్వడం అన్నీ చక చకా జరిగిపోయాయి.

ఈ వారం రోజుల్లో చందన తన నవ మన్మథుడుతో పీకల్లోతుల్లో కూరుకుపోతుంది...ఊహల్లో....

సంధ్య అందం...నడవడిక...పనితీరు...నిజాయితీ అన్నీ నచ్చిన వ్యక్తి సంధ్యను ముగగా ఆరాధిస్తుంటాడు. కానీ సంధ్యకు ఎదురుపడి చెప్పడు.

ఇలా మూగగా triangle ప్రేమ కథ నడుస్తోంది.

ఏంటి...రొటీన్ కథ అనుకుంటున్నారా...?

అయితే ముందు ఉంది ట్విస్ట్ ...కాబట్టి కథను ఆపకుండా చదివేయండి ..

ఒకరోజు సంధ్యను ట్రీట్ కు రమ్మని ఆహ్వానిస్తాడు ఫోన్లో... సంధ్యను ఆరాధిస్తున్న వ్యక్తి. spot ఫిక్స్ చేసి ఫోన్ పెట్టేస్తాడు అతను.

సంధ్య చందనను కూడా రమ్మంటే...

ఇది మరీ బావుంది నీ ఫ్రెండ్ నిన్ను రమ్మంటే నువ్వు నన్ను రమ్మంటున్నావేంటే ..?

అవన్నీ నాకు తెలియవు చందన..నువ్వు నాతో వస్తున్నావు అని సంధ్య చందనను తీసుకుని ట్రీట్ తీసుకునే స్పాట్ కి వెళుతుంది.

అక్కడ సంధ్య కోసం ఎదురు చూస్తున్న అతను..సంధ్యతో పాటు మరో అమ్మాయి వచ్చేసరికి...కొంచెం బాధపడిన..చిరునవ్వుతో వాళ్ళను ఆహ్వానిస్తాడు.

ఆ వ్యక్తిని చూసిన చందన ఆశ్చర్యం...ఆనందం.. కలగలిపిన మొహంతో తాను చూస్తున్నది నిజమో...వైష్ణవ మాయో తెలియక...అలానే రోబోలాగా ప్రవర్తిస్తుంది.

చందన ప్రవర్తన చూసిన ఆ వ్యక్తి...ఈ అమ్మాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది అనుకుని...అయినా నాకెందుకులే అని..బేరర్ ను పిలిచి కావలసిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసి.. ఈ లోపు సంధ్యతో మాట్లాడుతుంటాడు.

చందన మాత్రం అతన్ని రెప్ప వేయకుండా చూస్తూనే ఉంది. అతనికి కాస్త ఇబ్బంది అయినా...సంధ్యతో మాటలలో మునిగిపోతాడు.

ట్రీట్ కంప్లీట్ అయ్యాక ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. అతను సంధ్యకు text చేస్తాడు..i want to talk to personally..అని. దానికి సంధ్య any emergency అని reply ఇస్తే...లేదు ..అంత emergency కాదు అని జవాబు ఇస్తాడు అతను.

ఇంటికి వచ్చిన చందన అప్పుడు కూడా అలా బిగుసుకుపోయి...మరమనిషిలా ఉండడం చూసి సంధ్య అడుగుతుంది...ఇందాకటి నుండి చూస్తున్నాను..ఏమైంది నీకు అని ?...అప్పటికి తేరుకున్న చందన ...సంధ్యతో అతను...అతను...నా magazine హీరో అని చెప్పి తన దిండు కింద ఉన్న ఫోటో తీసి చూపిస్తుంది.

ఆ ఫోటో చూసిన సంధ్య... ఇతని ఫోటో magazine కవర్ పేజ్ మీద ఏంటి అని...అప్పుడు ఆ magazine తీసి అందులో ఆ వ్యక్తి గురించిన పూర్తి వివరాలు చదివి బిగుసుకు పోవడం ఇప్పుడు సంధ్య వంతు అయింది.

ఇతను...చిన్న వయసులో గ్రేట్ businessman అవార్డ్ అందుకున్న Mr. Jay. అంటే...నేను పని చేసేది అతని ఆఫీసులోన..

మరి ...మరి..అతను నాతో మాత్రం ఒక ఫ్రెండ్ల్ గా ఉన్నాడు..!

ఓహ్ ..అందుకేనా...అందరూ వెళ్ళాక వచ్చి నాతో మాట్లాడుతుంటాడు. ఎందుకు అలా..? అంతటి వ్యక్తికి నాతో స్నేహం ఏంటి..? ఏదో తట్టిన దానిలా..సర్లే..రేపు ఏదో మాట్లాడాలి అన్నాడుగా చూద్దాం అనుకుని పడుకుంటుంది.

మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లిన సంధ్య జయ్ గురించిన విషయాలు పూర్తిగా తెలుసుకుని ...పోనీలే చందన చాలా మంచి వ్యక్తిని ప్రేమించింది. ముందు ఈ విషయం jay గారికి చెప్పాలి...చందన ప్రేమను success చెయ్యాలని అతని క్యాబిన్ కు వెళ్లిన సంధ్యను చూస్తూనే shock అయిన జయ్...సంధ్యకు నేను boss అనే విషయం తెలిసింది. హ్మ్..సరే చూద్దాం... ఏం మాట్లాడుతుందో...లేక పొట్లాడుతుందో అని.

సంధ్య మాత్రం అవేమి పట్టించుకోకుండా..చందన జయ్ ను ఎంత ప్రేమిస్తోందో చెప్పి...చందన ప్రేమను accept చెయ్యమని ఒక friend గా జయ్ ని బ్రతిమలాడుతుంది. ఈ మాట విన్న జయ్ నేను తినను ప్రేమిస్తుంటే...తను ఏంటి ఆమె ఫ్రెండ్ ప్రేమ గురించి చెపుతోంది... అంటే నేను అంటే సంధ్యకు ఇష్టం లేదేమో...అందుకే తన స్నేహితురాలి గురించి చెపుతోంది.

ఇప్పుడు సంధ్య ప్రేమకోసం నేను ఆరాటపడినా ఉపయోగం ఉండదేమో అని తన ప్రేమ విషయాన్ని మనసులోనే సమాధి చేసుకుని...సంధ్యతో boss లా కాకుండా...ఎప్పుడూ ఉండే స్నేహితుడిగానే ఉంటాడు.

చందన జయ్ ని ఇంకా పిచ్చిగా ప్రేమిస్తుంటుంది. జయ్ సంధ్యను ముగగా మనసులోనే ఆరాధిస్తుంటాడు.

ఇంతలో జయ్ తండ్రికి అనుకోకుండా అనారోగ్యం చెయ్యడంతో తన చెల్లెలి కూతురు అరుణను పెళ్లి చేసుకోమని...అది తన చివరి కోరిక అని...తన ఆఖరి కోరిక తీర్చమని...జయ్ ను అడుగుతాడు.

అరుణకు జయ్ అంటే చిన్నప్పటి నుండీ పంచ ప్రాణాలు. ఒకసారి మనసు విప్పి జయ్ కు చెపితే తను తిరస్కరిస్తాడు.

కానీ ఇప్పుడు అతని తండ్రి కోరికను తీర్చడానిక్ జయ్ ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు...ఎందుకంటే...తను ప్రేమించిన సంధ్య తన ప్రేమను అంగీకరించదు. అలా అని చందన ప్రేమను తను ఒప్పుకోలేడు. కాబట్టి కనీసం అరుణను చేసుకుంటే అటు అరుణ ప్రేమ గెలిచ్చినట్లు... అలాగే తన తండ్రి కోరిక నెరవేర్చినట్లు అవుతుంది. పైగా...అరుణ అయితే నాన్న బ్రతికున్నంతకాలం జాగ్రత్తగా చూసుకుంటుంది అని.

జయ్ కు అరుణకు పెళ్లి జరిగిపోయింది. అరుణ ప్రేమ మాత్రమే గెలిచింది.

Triangle లవ్ స్టొరీ ఇక్కడితో ముగిసింది.

జయ్ ప్రేమ వన్ సైడెడ్.... చందనది కూడా వన్ సైడ్. అరుణది కూడా వన్ వే ట్రాఫిక్ లవ్.

కాబట్టి ఎవరు ఎవరిని ప్రేమించినా...చివరకు విధాత గీసిన రాత ప్రకారమే ప్రతీది జరుగుతుంది. ఎవరికి ఎవరిని జత చేయాలో ఆ విధాతకు బాగా తెలుసు.

సమాప్తం.....

by రాధ.



Rate this content
Log in

Similar telugu story from Drama