R R ట్రస్ట్
R R ట్రస్ట్
రాకేష్ , రజనీష్ ఇద్దరూ పూణే లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. జాయిన్ అయిన దగ్గర నుండి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ కాబట్టి ఎప్పుడూ కలిసే పని చేసేవారు. అన్నింటిలోనూ ఇద్దరి అభిప్రాయాలు ఇంచుమించు ఒకేలా ఉండేవి.
కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతలా ఏర్పడిందంటే...ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం కంటే అధికంగా మారారు. ఇద్దరికీ అర్ధం కాలేదు...ఎందుకు ఇలాంటి సహజ విరుద్ధమైన ఫీలింగ్స్ వస్తున్నాయో..?
ఒకరికి తెలియ కుండా ఒకరు...డాక్టర్ ని కలిసి వాళ్ళ ప్రాబ్లెమ్ ని వివరించారు. అప్పడు డాక్టర్ ఇద్దరి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి...ఇద్దరూ బైసెక్యువల్ ప్రోబ్లెంతో ఉన్నారని గ్రహించి...ఇద్దరినీ ఒకే సారి పిలిపించి...మీ ఇద్దరికి హోమో సెక్సువల్ ప్రాబ్లెమ్ ఉంది. అది హార్మోన్ల అసమతుల్యం వలన వస్తుంది. ఒక వేళ మీరు opposite geneder తో పెళ్లి చేసుకున్న కూడా మీకు...వాళ్లకు కూడా జీవితంలో సుఖం ఉండదు...అని వివరించాడు.
రాకేష్, రజనీష్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి...ఎలాగూ మనం ఒకరిని విడిచి ఒకరం ఉండలేము కాబట్టి...మన ఇద్దరం కలిసి జీవితాంతం ఉండిపోదాము అని నిశ్చయించుకున్నారు.
ఇద్దరూ.. తమ తమ ఇళ్లలో తమకున్న ప్రాబ్లెమ్ గురించి వివరించి తాము తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా వివరించారు.
ఇద్దరి తల్లి దండ్రులు ముందు ఎంతో కుమిలిపోయారు. అయినా.. దేవుడు ఇచ్చిన జివితాన్ని మనం మార్చలేము అని తెలిసి...సరే..మీరు ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు. ఎందుకంటే సమాజం ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన మనుషులను అక్కున చేర్చుకోదు సరికదా...వాళ్ళ మాటలతో మీ మనసులను తూట్లు పొడుస్తారు. కాబట్టి ఈ విషయం బయటికి తెలియనివ్వకుండా ఎప్పటిలాగే మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళ అభిప్రాయనికి విలువనిచ్చి పంపించారు.
రాకేష్, రాజనీష్ ఇద్దరు చాలా ఆనందంతో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సంవత్సర కాలం గడిచింది. ఎలాంటి చీకు చింత లేదు.
కానీ రాకేషకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకు వాళ్లిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. తమ సంపాదనతో తమలాగ LGBT తో బాధ పడుతున్న కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళకి వారికి ఉన్న సమస్య గురించి వివరించి ఇది కృంగిపోవలసినంత సమస్య కాదని, బాగా చదువుకుని. ..ఉద్యోగం సంపాదించి ...సమాజంలో మేముకుడా భాగమే అని నిరూపించేలా తీర్చిదిద్దాలని దృఢంగా సంకల్పించి..RR అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి..
ఎంతో మంది తమలాగ బాధ పడే వారికి జీవితం మీద ఆశ కలిపించి...వాళ్ళ కలలు నిజం చేసేలా కృషి చేసి...సమాజానికి తమవంతు సాయం చేసేవారు.
ఇది రాకేష్ రజనీష్ ల కథ. ఎంత మంది ఇంత ఉన్నతంగా ఆలోచిస్తారో మరి??
......సమాప్తం.....
