radha Krishna

Drama Inspirational Others

4  

radha Krishna

Drama Inspirational Others

అమ్మాయి - పెళ్లి

అమ్మాయి - పెళ్లి

12 mins
685



అయ్యా....!

ఆ..ఏంటి రంగయ్య......?

అయ్యా...పెళ్ళివారు బయలుదేరారంటయ్య.... రఘుపతిబాబు కబురెట్టారు.

రంగయ్య మాట విన్న క్షణం నుండి...శంకరం ఉక్కిరిబిక్కిరి అవుతూ.. కబురు వచ్చేసింది....వాళ్లు వచ్చేస్తున్నారు .....అయ్యోయ్యో....ఇంకా ఎంతసేపు....త్వరగా..తెవలండర్రా..

ఇంకా ఎంతసేపు...ఏమేవ్ కాంతం...అమ్మాయిని త్వరగా రెడీ చేయి ...ఆ..అన్నట్లు పిండి వంటలు చెయ్యడం ఎంతవరకు వచ్చింది..?

ఒరేయ్ రంగ... తోరణాలు అవి కట్టవా లేదా...

ఎక్కడ చచ్చారే అందరూ...పిలిస్తే పలకరేంటి..?....అంటూ తెగ హడావుడి పడుతూ...అందరినీ హడావిడి పెడుతున్నాడు శంకరం.

కొడుకు హడావిడి చూసి...శంకరం తల్లి...ఎందుకురా అంత హడావిడి పడుతున్నావు..?

అదేంటమ్మా అలా అడుగుతావు....అవతల పెళ్లి వారు బయలుదేరారు. ఇక్కడ చూస్తే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కంగారు పడకుండా నింపాదిగా ఉండమంటావ? అన్నాడు విసుక్కుంటూ...

ముందు ను వచ్చి ఇలా కూర్చో...అని..తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది శంకరం తల్లి.

ఒరేయ్ శంకరం...నువ్వు కంగారపడకుండా ఉంటే...అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. నీ కొడుకు ఒక్కడు చాలు...అన్ని ఏ లోటు లేకుండా చూసుకోవడానికి. అవును నిజమే...మరి ఏడి నీ ముద్దుల మనవడు...కనపడడేం?? అంటూ ఇల్లంతా కళ్ళతోనే వెతుకుతున్నాడు.

ఏం వెతుకుతున్నావురా...? నీ కొడుకునేనా??

హమ్... కనిపిస్తే చాలు వాడిమీద కారాలు...మిరియాలు నూరుతావు. కనబడకపోతే విలవిల్లాడిపోతావు....ఎందుకురా..అంత ప్రేమ ఉంచుకుని కూడా, వాడిని అలా ఆడిపోసుకుంటావు??? అంది శంకరం తల్లి.

సరేలే... వస్తే...నన్ను కలమని చెప్పు... నీ మనవడికి.!! అంటూ వీధివాకట్లోకి వెళ్లి...అటు - ఇటు పచార్లు చేస్తూ పెళ్లి వారికోసం ఎదురు చూస్తున్నాడు.

ఎదురుచూస్తున్న పెళ్ళివారు రానే వచ్చారు. శంకరం నవ్వుతో ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి....ఒరేయ్ రంగయ్య...

ఆ అయ్యా...అన్ని సిద్ధం చేశానయ్య.

సరే అయితే...అని పెళ్ళివారికి ముఖ్యంగా కాబోయే వియ్యంకుడికి...అల్లుడికి తానే స్వయంగా కాళ్ళు కాడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. మిగిలిన వారికి రంగయ్య నీళ్లు ఇవ్వగా...అందరూ ఇంటి మొత్తాన్ని పరికించి చూస్తున్నారు. అది...పూర్వపు జమిందారి గిరీకి ఆనవాలుగా....విశాలమైన లోగిలి....మధ్యలో వాటర్ ఫౌంటైన్... దాని మధ్యలో వేణువుతో ఉన్న అందమైన కృష్ణుడు....ఎత్తయిన అరుగులు...పెద్ద పెద్ద స్తంభాలతో....మంచి పాతకాలపు ఫర్నిచర్ తో ...ఇంకా అందమైన పెయింటింగ్స్ తో... చాలా అందంగా ఉంది.

పెళ్ళికొడుకు తండ్రి...తన వాళ్ళతో...చూసారా మా వియ్యంకుడి ఇల్లు?? ఏం... ఇప్పుడు మాటలు రావడం లేదేమి, ఇంతకు ముందు ఎవరో అన్నారు...ఆఆ పల్లె టూరి సంబంధం...మట్టి వాసనలు... జిడ్డు మనుషులు..అని, అన్నవాళ్ళకి ఇప్పుడు తెలిసిందా...ఎందుకు ఈ సంబంధానికి ఊ కొట్టానో...అని అన్నాడు.

ఎవరు నోరు మెదపకుండా....😏ఉఉ..అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంటూ సోఫాల్లో కూలబడ్డారు.

శంకరం...శంకరం తల్లి...భార్య అందరూ వచ్చిన వాళ్ళకి కావలసిన మర్యాదలు చూస్తున్నారు. కాని పెళ్ళికొడుకు మాత్రం ఒకటే ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు పెళ్లికూతురు ఎప్పుడూ వస్తుందా అని.

పెళ్ళికొడుకు ఆత్రం చూసిన పెళ్ళికొడుకు తండ్రి "బావగారు...అమ్మాయిని పిలిపిస్తారా...అని అడిగాడు.

శంకరం వెంటనే...కాంతం ...అమ్మాయిని తీసుకురా అని చెప్పాడు. అలగేనండి... అని కాంతం వెళ్లి పెళ్లికూతిరిని తిసుకువస్తోంది. పెళ్లి కూతురు నడిచి వస్తుంటే....పెళ్లి కొడుకు రెప్ప వెయ్యడం మరిచి ...నోరు తెరచి చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న పెళ్ళికొడుకు తండ్రి...ఒరేయ్ నాన్న...కాస్త ఆ నోరు ముస్తావా...లేదంటే ఈగలు దూరతాయి అన్నాడు. అప్పడు మన పెళ్లి కొడుకు తెరుకోని...తన పనికి తానే సిగ్గు పడుతూ..తల దించుకున్నాడు. ఇంతలో పెళ్లి కూతురు వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది.

పెళ్లి కొడుకు మేనత్త... అమ్మాయి.. నీ పేరేంటి...ఏం చదువు కున్నావు...వంట-వార్పు వచ్చా...అని ప్రశ్నల వర్షం కురిపించింది. అవిడి అలా ఆడిగిందో లేదో...వెంటనే...తన పేరు సుజాత. ఎమెస్సీ చదివింది. వంట బాగా చేస్తుంది అత్త అని గుక్క తిప్పుకోకుండా...చెపుతూ పోతున్నాడు...చుట్టూ నిశ్శబ్దంగా ఉండడం చూసి...అప్పుడు చూసాడు అందరి మొహాలు... హి హి హి..😁😁😁...అత్త అది అది...తను చెప్పడం ఎందుకు అని నేనె చెప్పాను..అని తన తొందరపాటుకి నాలుక కరుచుకున్నాడు.

అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు.

శంకరం వియ్యంకుడు...బావ గారు...మా వాడి వాలకం చూస్తుంటే ఇప్పుడే పిళ్లిచేసుకునేలా ఉన్నాడు. కాబట్టి...సాంప్రదయంకోసం మనం ఒక మాట అనేసుకుంటే... ఇంకా మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు అని అన్నాడు.

అందుకు శంకరం... బావగారు....పంతులుగారు నిశ్చయతాంబూలాలు మార్చుకునే ఏర్పాటు ఆల్రెడీ చేసేసారు. ఇంక మీదే ఆలస్యం.

రెండు కుటుంబలవారు చెరోవైపు కూర్చున్నారు. పంతులుగారు నిశ్చయ తాంబూలాలు మార్పించి...అయ్యా...శ్రావణ శుక్ల విదియ స్థిరవారం. అంటే 08.08.2000..కన్యాలగ్నంలో...రాత్రి 9.50ని. దివ్య మైన ముహూర్తం ఉంది. మీ ఇరువురికి ఆమోదయగ్యమైతే...అదే నిర్ణయిస్తాను.

బావగారు మీకు సమ్మతమేన అని అడిగాడు శంకరం వియ్యంకుడిని.

వియ్యంకుడు...బావగారు...ఆడ పెళ్ళివారు మీరు. పెళ్లి జరగవలసింది మీ ఇంటి దగ్గర. కాబట్టి మీరే చూసుకోండి..అని అన్నాడు.

శంకరం సమాధానం చెప్పేలోపు.... మాకు సమ్మతమే మమయ్యగారు అని వచ్చాడు సుజాత అన్న...రమేష్.

అదిగో వచ్చాడు హీరో...ఇంకే ...శుభస్య శీఘ్రం అని అన్నారు శాస్త్రిగారు.

అందరూ రమేష్ వైపు చూసారు. అప్పుడు శంకరం తల్లి...వాడు నా మనవడు...రమేష్. ఈ ఇంటి వారసుడు ...చెల్లిని కళ్ళలో పెట్టుకుని చూసుకునే అన్న. తండ్రికి తగ్గ తనయుడు...అని రమేష్ గురించి చెప్పారు. అందరికి రమేష్ ని పరిచయం చేసారు. స్వతహాగానే అందరితో సఖ్యంగా వుండే రమేష్...అందరితోనూ తొందరగానే కలిసిపోయాడు.

ఇంతలో శంకరం గారు కొడుకును పిలిచి...ఒరేయ్ రమేష్ ఇక్కడ మాటలు ఆపి...కొంచెం ఆ వంటలు ఎంత వరకు వచ్చాయో చూడు అని చెప్పడంతో.. రమేష్...నాన్నగారు...మీరు కంగారు పడకండి. ఒక్క పడినిముషాల్లో అన్ని సిద్ధంచేయిస్తాను. రంగయ్య అదే పనిలో ఉన్నాడు. మీరు మమయ్యగారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి అని వెళ్లే వాడిని..

సురేష్ (అదే పెళ్ళికొడుకు) బావగారు... అని రమేష్ ని పిలిచాడు. ఏంటి బావగారు ఏంకావాలి అని రమేష్ అడిగే సరికి ...సురేష్ తడ బడుతూ... ఒక్కసారి సుజాతతో మాట్లాడే అవకాశాన్ని కల్పించరూ..అని దీనంగా మొహం పెట్టి ఆడిగేసరికి...అయ్యో బావగారు అది సాధ్యమవదేమోనండి. ...అని సుజాత వైపు చూస్తూ eye విన్క్ చేస్తాడు. సుజాత ముసిముసి నవ్వులు నవ్వుతూ సురేష్ వైపు చూస్తోంది. అప్పటికే బిక్క మొహం వేసిన సురేష్ ని చూసి....రమేష్ నవ్వుకుంటూ....చెల్లిని... కాబోయే బావగారిని...తమ పూలతోటలోకి పంపిస్తాడు.

తోటలో పూల అందాలను చూస్తూ ఉన్న సుజాత వెనుకగా వచ్చి సుజాతను కౌగలించుకునే సరికి సుజాత ఒళ్ళు ఒక్కసారిగా ఝల్లుమని సురేష్ నుండి కొద్దిగా దూరం జరిగింది. క్షణం పాటు బిత్తరపోయిన సురేష్ వెంటనే తేరుకొని... ఏమైంది సుజి.. అలా దూరం జరిగావెందుకు... నేను పరయివాడిని కాదు కదా.. నిన్ను 3 సంవత్సరాలుగా ప్రాణాంగ ప్రేమిస్తున్నవాడిని...పైగా..నీకు కాబోయే భర్తను...ఇంకెందుకు నీకు ఈ బెరుకు అని అడిగాడు.

సుజాత...క్షమించండి. పెళ్ళికిముందు నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఇక మీ ప్రేమ గురించి అంటారా...నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పలేదు. మీరు మా నాన్న గారిని అడిగితే..అతనికి అభ్యంతరం లేకపోతే.. నేను  కాదు అనను అని మాత్రమే అన్నాను. సురేష్ వెంటనే ...అమ్మా ..తల్లి... నీకో దణ్ణం..నీ గురించి తెలిసి కూడా ఇలా చేయడం తప్పే. ఏదో నా దానివి అవుతున్నావు కదా అనే సంబరంలో ...తమరి భావాలు మర్చిపోయాను. దయచేసి ఈ దీనుడ్ని మన్నించమని ప్రార్ధన..

సుజాత సురేష్ చేష్టలకు... మాటలకు కిల కిలా నవ్వుతోంది. నవ్వుతున్న తనను చూస్తున్న సురేష్ ఒక్కసారిగా దోసిట పట్టి సుజాత ముందు నిలబడితే...ఏం ఏంచేస్తున్నారు అని అడిగింది సుజి. ముత్యాలు రాలుతుంటే ఎరుతున్నా సుజి అంటాడు. అబ్బో అబ్బాయిగారికి ఇలా మనుషులను కాకా పట్టడం కూడా వచ్చే...!!

ఏదో నీ అభిమానం..అని సురేష్ కన్ను గీటుతాడు.

ఇంతలో రమేష్...హమ్...బావగారు...బావగారు..అంటూ అరుచుకుంటు వస్తాడు.

సురేష్ అనుకుంటాడు...నా ఖర్మ ...అప్పుడే వచ్చేసావా ... కాసేపు అయిన తనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా ఉందే.

రమేష్ వెంటనే...బావగారు....నన్ను తరవాత తిట్టుకుందురుగాని..ముందు ఇంట్లోకి దయచేయండి... అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు.

సరే నడు.. అని సురేష్ సుజాత రమేష్ వెనుక నడిచారు.

అందరూ భోజనాలు ముగించి...కాసేపు విశ్రాంతి తీసుకుని .. శంకరంతో....బావగారు...ఇంక మాకు సెలవిప్పించండి...పెళ్లికొడుకు తండ్రి అనడంతో.. శంకరం...సరే బావగారు....పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల వివరాలు...మీకు ఎప్పటికప్పుడు తెలియ పరుస్తాము.. అని చెప్పి పెళ్ళివారందరిని సగౌరవంగా సాగనంపాడు.

రమేష్ , శంకరం మాత్రం...మిగిలిన పనులు చక్కబెట్టే పనిలో బిజీ అయ్యాడు. మిగిలిన వారందరూ అలసి పోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి ఆదమరిచి నిద్రపోతున్నారు.

రోజులు గడుస్తున్నాయి. రమేష్ తండ్రికి పెళ్లి పనులలో సాయం చేస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి పందిరి వేయడం దగ్గరనుండి...తోరణాలు...వంటకు కావలసిన ఏర్పాట్లు... సన్నాయివాళ్ళను మాట్లాడడం...ఒకటేమిటి అన్నీ సిద్ధంచేశారు.

పెళ్లికి శతమానాలు...నగలు...అన్ని బెత్తాయింపునుండి...పెళ్లి పీటలు అలికి రంగవల్లులు వేసే పనులవరకు అన్నీ రమేష్ మరియు అతని స్నేహితులు చూసుకుంటున్నారు.

ఇంక... పెళ్లి సమయం రానే వచ్చింది. మగ పెళ్లి వాళ్ళను భాజ భజంత్రీలతో ఎదురు సన్నాహాలు పలికి విడిదింట్లో దింపి... వారికి అడుగడునా మడుగులు ఒత్తే విధంగా ఘనమైన ఏర్పాట్లు చేసి ...

శంకరం..వియ్యంకుడితో..బావగారు...మా శక్తి వంచన లేకుండా అన్ని ఏర్పాటు చేసాము. ఇంకా మీకు ఏమైనా కావలసి వస్తే...కాకితో కబురు పెట్టండి...వచ్చి మీ ముందు వాలతా...అన్నాడు. అందుకు వియ్యంకుడు నవ్వుతూ... చూడండి బావగారు...మాకు ఏ లోటు లేదు. మేము మగ పెళ్లి వాళ్ళం ...ఏదో చీటికీ మాటికి గొడవలు పడతాం లాంటివి మనసులోనుండి తీసేయండి. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. రేపటినుండి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. అవసరమైనతే రమేష్ కు కబరు పెడతాను అని చెప్పాడు.

శంకరం సంతోషంతో బావగారిని హతుకుని కంటి చెమ్మని తుడుచుకుని...మీ లాంటి వాళ్ల ఇంటి కోడలు అవుతున్నందుకు నా కూతురు చాలా అదృష్టవంతురాలు బావగారు అని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆరోజు రాత్రి సురేష్ సుజాతకు ఫోన్ చేసి తోటలో కలవాలి రమ్మని చెపుతాడు. సుజాత వెంటనే...చూడండి...అలా బయటకు రావడం నాకు ఇష్టం లేదు. పెళ్లి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఇంతలొకే నేను ఎక్కడికీ పారిపోను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

సురేష్...ఖర్మ ఖర్మ...అస్సలు రొమాన్స్ సెన్స్ లేని నిన్ను ఇష్టపడ్డాను చూడు నన్ను నేను అనుకోవాలి అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా అప్పుడే సురేష్ గదిలోకి వష్తున్న రమేష్ గమనించి...క్షమించండి బావగారు...మా చెల్లి చాలా సంప్రదాయంగా పెరిగింది. దానికి ఎంత సేపు చదువు...పేదలకు సేవ చెయ్యడం...ఇలాంటి పనులమీద ధ్యాస ఎక్కువ. అసలు నా చెల్లి అని చెప్పుకోవడం కాదు గాని..అది చాలా ఉన్నత భావాలు కలది. చాల వినయం, విధేయత గలది. మీరేమి తప్పుగా అనుకోవద్దు. పెళ్లి తరువాత మీకు నచ్చినట్లు ఉంటుంది..అని అంటాడు.

సురేష్ వెంటనే...అరెరే..అదేం కాదండి...నాకు తన గురించి పూర్తిగా తెలుసు. తన వ్యక్తిత్వం నచ్చే నేను తనని ఇష్టపడ్డాను. ఏదో కాసేపు ఒంటరిగా మాట్లాడదామని తప్ప...ఇంకే లేదు. మీరు దిగులు పడకండి అని చెపుతాడు. రమేష్ సంతోషంతో..థాంక్యూ బావగారు...మా చెల్లిని బాగా అర్ధంచేసుకునే మీరు భర్తగా రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే నేను పెళ్లి పనుల్లో ఉంటాను. ఏమైనా కావాలంటే ఫోన్ చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయాన్నే సురేష్ ను సుజాతను పెళ్లి కొడుకు...పెళ్లి కూతుళ్ళను చేశారు. సాయంత్రం తోట సంబరం...అన్ని వేడుకలు చాలా సరదాగా , సాంప్రదాయంగా ముగిసాయి.

పెళ్లి సుముహూర్తము రానే వచ్చింది. పెళ్ళికొడుకు చేత గణపాతి పూజ చేయించి...అటు పెళ్లి కుమార్తె చేత గౌరి పూజ చేయించి పెళ్లి పీటలమీదకు తీసుకువచ్చారు.

శంకరం..భార్య...అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు.

ఇంతలో సుముహూర్త సమయం దగ్గర పడడంతో...పంతులు గారు...అబ్బాయి..నేను చెప్పినపుడు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తలమీద పెట్టాలి...అమ్మాయి నువు కూడా అంతే అని ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి...ఒరేయ్ ...భజంత్రీలు వాయించండి అని వధువరులవైపు తిరిగి...ఇప్పుడు పెట్టుకోండి నాయన...అనగానే...సురేష్ తెరసెల్లా మీదుగా చేయి పోనిచ్చి సుజాత తలపై జీలకర్ర బెల్లము ఉంచుతాడు. సుజాతకుడా సురేష్ తలపై చేయి ఉంచుతుంది. ఇంతలో

శ్రీరస్తు...శుభమస్తు...శ్రీరస్తు.. శుభమస్తు..

శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం..ఇక ఆకారం దాల్చనుంది...కొత్త జీవితం

అంటూ..పాటు వాయిస్తూ ఉంటారు.

పెద్దలందరూ..వచ్చి వధూవరులను ఆశీర్వదించి అక్షతలు వేస్తూ ఉంటారు. సురేష్ మాత్రం సుజాతను కను రెప్ప వేయకుండా అలా సుజాత అందాన్ని కళ్ళలో నింపుకుంటున్నాడు. సుజాత సిగ్గుతో తల దించుకుని ఉంది. తరువాత...శతమాన ధారణ....బ్రహ్మ ముడి వెయ్యడం...సప్తపదులు తొక్కడం...హోమగుండం చుట్టి ఏడడుగులు వేయడం...ఉంగరాలు తియ్యడం...అరుంధతి చూడడం...అన్నీ శాస్త్రోక్తంగా జరిగాయి. మొత్తానికి పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది.

నూతన వధూవరులిద్దరు...ఇరువురి తల్లిదండ్రుల, ..మిగతా కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తిసుకున్నారు

ఇంక అప్పగింతల సమయంలో...శంకరం...సురేష్ తో అల్లుడుగారు...మా అమ్మాయి మాకు పంచ ప్రాణాలు. ఇప్పుడు ఆ ప్రాణాల్ని మీ చేతిలో పెడుతున్నాను. ఎలా చూసుకుంటారో...ఇంక అంతా మీదే భారం అని కంట తడిపెట్టుకుంటాడు. సురేష్ వెంటనే...మమయ్యగారు..మీరు అంతలా చెప్పాలా...సుజాత ఇప్పటి నుండి నా పంచ ప్రాణాలు. కాబట్టి మీరు దిగులు పడకండి అని చెపుతాడు.

ఇంతలో రమేష్ అంటాడు ..బావగారు  నిజంగా మా సుజాత చాలా గారాబంగా పెరిగింది. కొద్దిగా సూటిగా వ్యవహరించే మనస్తత్వం కలది. కాబట్టి...ఎప్పుడైనా మిమ్మల్ని కష్ట పెట్టె వింధంగా ప్రవర్తిస్తే...కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించి ..తనను జాగ్రత్తగా చూసుకోండి.

సుజాత తల్లిదండ్రులను..అన్నయ్యను..నాయనమ్మను.. . ఇన్నాళ్లు పెరిగిన ఇంటిని..ఊరిని..స్నేహితులను వదిలి వెళ్లలేక్ వెళ్లలేక ఏడుస్తూ ఉంటే...సురేష్ ధైర్యం చెప్పి తనతో పాటు కారులో కూర్చో పెడతాడు. పెళ్ళివారు అందరూ...ఎవరి కార్లో వాళ్ళు బయలు దేరారు. సురేష్ మరియు సుజాత మాత్రం...ప్రత్యేకంగా ముస్తాబు చేయించిన కారులో బయలుదేరారు. కారు వీధి చివరకు వెళ్ళేవరకు సుజాత...శంకరం...అతని భార్య... రమేష్ అందరూ బాధపడుతూనే ఉన్నారు. శంకరం తల్లి..నాయనా శంకరం...అలా బాధ పడితే ఎలా చెప్పు?. ఆడ పిల్ల అన్నాక పెళ్లి చెయ్యక తప్పదు..అత్తారింటికి పంపక తప్పదు...అని సముదాయించింది. అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్లిపోయారు.

సుజాత సురేష్ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారు... ఇద్దరిని ఇంట్లో కి హారతి పట్టి... ఒకరి పేర్లు ఇంకొకరు చెప్పేవరకు ఆట పట్టించి...అప్పుడు లోపలికి ఆహ్వానించారు. సుజాతచేత అత్తగారు దేముడు గదిలో దీపరాధన చేయించారు. సుజాత దేముడుకి దండం🙏 పెడుతూ స్వామిని వేడుకుంటోంది...స్వామి...కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను. కొత్త మనుషులు, కొత్త వాతావరణం..అన్నీ కొత్త...ఈ కొత్త జీవితంలో నాతోడుగా నిలచి నన్ను ముందుకు నడిపించు...అని వేడుకుంది. సురేష్ కూడా..సుజాతతో తన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి అని వేడుకున్నాడు.

మరుసటి రోజు..వారి కార్యానికి పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు. సురేష్ ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తను ఎంతగానో అభిమానించే సుజాత తన భార్య కావడం...ఈ రేయి తనతో రసమయ జీవితాన్ని ఆరంభించడం.. సంతోషంతో సురేష్ కు కాళ్ళు అస్సలు భూమి మీద నిలబడడంలేదు. ఆనంద పారవశ్యంలో తేలిపోతున్నాడు.

సాయంత్రం సురేష్ సుజాతలచేత పూజ చేయించి...దంపతులకు తాంబూలాలు ఇప్పించి...సురేషను గదిలోకి వెళ్ళమని...సుజాతను పాల గ్లాసుతో వాళ్ళ గదిముందు విడిచి పెట్టారు ముత్తైదువులు.

సుజాత మెల్లగా తలుపు తీసుకుని వెళ్లి గదిలో నుంచుంది. కిటికీలోనుండి పున్నమి చంద్రుడిని చూస్తూ ఊహల్లో ఉన్న సురేష్...తలుపు చప్పుడు విని వెనుకకు చూసాడు. తెల్లని పట్టు చీరకు ఎరుపు అంచుతో...నుదుటిన కల్యాణ తిలకంతో...బుగ్గన చుక్కతో...తలనిండా మల్లెలతో..చేతినిండా గాజులతో..కాళ్ళకు పారాణి... దానిపైన అందెలతో ...చేతిలో వెండి పాల గ్లాసుతో...రతిదేవిని మరిపించే అందంతో తన మది తలుపులను తీయ వచ్చిన సుజాతను అపూర్వమైన గాంధర్వ కన్యగా ఊహించుకుంటూ...దగ్గరకు వచ్చి సుజాతను ఆప్యాయంగా ...సుతారంగా తన చేతులు పట్టుకుని.. తొలిరేయి పాన్పు దగ్గరకు తీసుకువచ్చాడు. సుజాత సిగ్గుతో దించిన తల ఎత్తలేదు. సురేష్ చొరవతో పాలగ్లాసు వంక చూస్తూ...ఇది నాకేనా.. అని క్రీగంటితో చూసాడు. అవును అంటూ చెప్పే లోపల...సురేష్ ఆ పాలగ్లాసును తీసుకుని పక్కన పెట్టి సుజాత చుబుకాన్ని పట్టి లేపాడు. సుజాత సిగ్గుతో తల ఎత్తి సూటిగా సురేష్ కళ్ళలోకి చూడలేక పోతొంది. సురేష్ సుజాత ఇబ్బంది అర్ధం చేసుకుని ...తనని పాన్పుపై కూర్చోబెట్టి...తను మోకాళ్ళమీద కూర్చుని...ఒక ఎర్ర గులాబీని సుజాతకు ఇస్తూ...సుజి..I Love U అని అన్నాడు. సుజాత ఆ గులాబీని అందుకుని..నేను కూడా అని వెంటనే చేతులతో కళ్ళు మూసుకుంది. సురేష్ నిలుచుని...సుజాత చేతులను పట్టుకుని ...సుజాత పక్కన పాన్పుపై కూర్చున్నాడు. సుజాతను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఏమండీ పాలు అనగానే..అవునుకదా..అని చెప్పి పాలగ్లాసును తీసుకుని ముందు సుజాతను తాగమని అడిగాడు. సుజాత ఒప్పుకోకపోవడంతో...సురేష్ కొంచెం తాగి మిగిలింది సుజాతకు ఇచ్చాడు. పాలు పంచుకోవడంతో ప్రారంభమైన వారి తొలిరేయి...పెదవులతో జతపడి...తనువులతో ముడి పది దాంపత్య జీవితానికి పునాదులు వేసింది. ఇంత అందమైన జంట పరవసాన్ని చూసి జాబిలికుడా మబ్బుల చాటుకు ఒరిగింది.

గాఢమైన అనుభూతులను చవిచూసిన జంట ఆదమరిచి నిదురిస్తున్న వేళ... కిందనుండి పెద్ద పెద్ద కేకలు వినబడడంతో..తృల్లిపడి నిద్రలేచారూ కొత్త దంపతులు.

సురేష్ వెంటనే కిందకు వచ్చాడు. సుజాత కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి...కింద సురేష్ అత్త ..ఒరేయ్ సురేష్ చూసావా..మన పాడి ఆవు ఉన్నపళంగా జబ్బు పడింది. ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా..గొడ్డుచ్చిన వేళా...బిడ్డోచ్చిన వేళా అని సుజాతవైపు చూస్తు దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది.

సురేషేకు ఆవిడ మాటలు అర్థమై వెంటనే ...చూడు అత్త...మనుషులకు..పశువులకు.. పక్షులకు..ఆఖరికి చెట్లకు కూడా జబ్బు చేస్తుంది. ఇప్పుడు ఏం కొంప మునిగిందని ఇంత అరుపులు, కేకలు వేస్తున్నావు..అని మందలించేసరికి ..సురేష్ తల్లి దండ్రులు కూడా అదేంటిరా అలా అంటావు... అత్త ఏమందని... కామదేనువులాంటి పాడి ఆవు సడెన్ గా జాబ్బు పడింది. ఆ ఆవు అంటే ఆవిడకు చాలా ఇష్ఠం. అందుకే అంతలా బాధపడింది. ఆవిడే కాదు..నాకు కూడా చాలా బాధగా ఉంది అని సురేష్ వాళ్ళ అమ్మ వంత పడేసరికి...

సురేష్.. చూడండి మీరెవరు దిగులు పడొద్దు. నేను డాక్టర్ కి ఫోన్ చేస్తాను వచ్చి చూస్తాడు అని చెప్పి పాలేరును ఆవుని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. సుజాత కూడా సురేష్ వెనుక వెల్లింది. సురేష్ ..సుజాతతో సుజి సోరి రా.. అత్త అలా అని ఉండకూడదు... దయచేసి బాధపడకు అని వేడుకున్నాడు. దానికి సుజాత ఛ..ఛ..ఛ ..అదేంటండి అలా అంటారు..నేను అర్ధం చేసుకోగలను. మీరు బాధపడకండి అని వెళ్లి స్నానం చేసి వచ్చి దేముడికి నమస్కరించి..భర్తకు కాఫీ ఇవ్వడంకోసం వంటింటిలోకి వెల్లింది.

సుజాత అత్తగారు.. నువ్వెందుకు వచ్చవమ్మా...నేను పంపేదానిని కదా..అంటే..పరవాలేదు అత్తయ్య నేను తీసుకువెళతాను అని తానే స్వయంగా కాఫీ చేసి సురేష్ కు తీసుకువెల్లింది. సుజాత కాఫిని సురేష్ ఆస్వాదిస్తూ...వాహ్ తాజ్ అన్నాడు...అయ్యా మరీ అంత వద్దు అది టీ కాదు కాఫీ అని అనగానే ..సురేష్ నాకు తెలుసు సుజి..నేను అన్నది కూడా కాఫీ తాజ్మహల్ అంత అందంగా.. కమ్మగా..రుచిగా ఉంది..అని కన్నుగీటాడు. అతని చర్యకు సుజాత ఒక్కింత సిగ్గుతో తల దించుకుంది.

రోజులు గడుస్తున్నాయి. పదహారు రోజుల పండుగ వచ్చింది. నల్లపూసలు మార్చే కార్యక్రమం కోసం సుజాత అత్తగారు ఏర్పాట్లు చేశారు. ముత్తైదువులు అందరూ వచ్చి కార్యక్రమము మొదలు పెడదాము అనుకునే లోపు సురేష్ వాళ్ళ అమ్మమ్మ కాలం చేసిందని కబురు వచ్చేసరికి...అందరూ దిగ్భ్రాంతికి గురిఅయ్యి....పదహారు రోజుల పండగ కార్యక్రమానికి వాయిదా వేసి...కొత్త దంపతులను మాత్రం..మీరు అక్కడి రాకూడదు అని చెప్పి...మిగిలిన వారు..అందరూ సురేష్ వాళ్ల అమ్మమ్మ గారి ఊరు బయలు దేరారు. ఆవిడకు సుమారు 75 ఏళ్ల వయసు..పైగా ఊపిరితిత్తుల వ్యాధితో చాలా రోజుల నుండి మంచం మీదనే ఉన్నారు. అందరూ ఆవిడ అంత్యక్రియలను పూర్తి చేసుకుని మూడు రోజుల తరువాత తిరుగు ప్రయణమయ్యారు. ఈ మూడు రోజులు సుజాత దిగులుతోనే ఉంది. సురేష్ ఎంత చెప్పినా నవ్వుతున్నట్లు నటించేది ...కానీ మనసులో దిగులు మాత్రం తగ్గలేదు. ఏంటి ఇలా జరుగుతోంది అని మధనపడుతోంది.

సురేష్ తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. కానీ అప్పటినుండి సుజాత అత్తగారు మాత్రం సుజాతతో చాలా తక్కువ మాట్లాడడం...ముభావంగా ఉండడం లాంటివి చేస్తున్నారు.

ఇలా గడుస్తున్న సమయంలోనే ఒకరోజు అనుకోకుండా..జబ్బు పడ్డ ఆవు చనిపోవడం...అత్త గారికి వంటింట్లో మంట అంటుకొని కొద్దిగా ఒళ్ళు కాలడం జరిగిపోయాయి. ఇంక అది మొదలు...సురేష్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులెవ్వరు..సుజాతతో మాట్లాడం మానేశారు. అందరి దృష్టిలో సుజాత ఒక నష్ట జాతకురాలు అని ముద్ర పడిపోయింది. కానీ సురేష్ అంటే వాళ్లకు చాలా ఇష్టం..అందుకే ఎక్కువగా ఏమి అనలేక ఉరుకునేవారు.

సురేష్ మాత్రం ఇవన్నీ ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ...నువు ఎక్కువ బాధ పడకు అని సముదాయించే వాడు..లోపల మాత్రం ఎందుకు ఒకే సారి ఇలా జరుగుతున్నాయి అని మధన పడేవాడు.

ఉన్నట్లుండి.. సురేష్ ఉద్యోగం పోయి..సురేష్ తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో ....సురేష చాలా డీలా పడిపోయాడు. తనను తాను సముదాయించుకుని ఎన్ని సార్లు ఉద్యోగ ప్రయత్నం చేసినా ఉద్యోగం దక్కలేదు. ఇంక పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. ఎవరితోనూ ఏమి మాట్లాడే వాడు కాడు. గదికి అంకితమయ్యాడు. సుజాత ఎంత చెప్పినా ...తను మాత్రం...సుజాత జాతకం వల్లనే ఇలా అన్ని జరుగుతున్నాయి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అంతే.. ఇంకా సుజాతతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. కనీసం కన్నెత్తి కూడా చూడడంలేదు. తన చేతితో మంచినీళ్లు ఇచ్చినా తీసుకొనేవాడు కాదు.

ఇంక అత్తగారు...మామగారు..సురేష్ వాళ్ళ అత్త..సుజాతను పూర్తి నష్ట జాతకురాలుగా చిత్రీకరించడం.. పదే పదే సూటిపోటి మాటలతో తనను చిత్రవధ చేయడం..సురేష్ సపోర్ట్ కూడా దూరమవడం. ...సుజాతను బాగా కృంగ దీసాయి. అసలు ఎప్పుడు ధైర్యం కొల్పోని సుజాత సురేష్ తనపట్ల చూపిస్తున్న నిరాదరణతో మానసికంగా నలిగిపోయి..నీరసించిపోయి..ఒక జీవశ్చవంలా తయారయింది. చచ్చిన బ్రతికిన..అత్త గారింటిలోనే తప్ప..పుట్టింటికి తన వల్ల చెడ్డ పేరు రాకూడదని ...నా దురదృష్టం ఇంకెవరికి అంట కూడదని... ఊరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

అమ్మా సుజాత.........వద్దు.....వద్దు.....నువు ఆత్మ హత్య చేసుకోవద్దు. నువు నష్ట జాతకురాలివి కాదు. నువు మా ఇంటి మహాలక్ష్మీ వమ్మా... సుజాత చచ్చిపోవద్దు...ఈ తండ్రిని విడిచిపోవద్దు...అమ్మ సుజాత... సుజాత అంటూ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు శంకరం.

శంకరం భార్య కాంతం ఈ మాటలు విని...ఏవండి..ఏవండి...ఏమైంది...ఇలా చూడండి...అంటూ కుదిపి...ముందు ఈ మంచి నీళ్ళు తాగండి అని నీళ్ల చెంబు శంకరానికి ఇచ్చింది.

నీళ్లు కాదు కాంతం...సుజాత మన సుజాత ఎక్కడ?? నేను వెంటనే నా చిట్టి తల్లిని చూడాలి అని ఆయాస పడుతున్నవాడిని ఓదారుస్తూ...ఏవండి..ముందు ఈ నీళ్లు తాగండి...తరవాత మాట్లాడుదాము అని బలవంతంగా నీళ్లు తాగించి...హు...ఇప్పుడు చెప్పండి...ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు...? మన సుజుకి ఏమైందని మీరు కంగారు పడుతున్నారు. అది సుబ్బరంగా వాళ్ళ నాయనమ్మ గదిలో ఆవిడకు తోడు గా పడుకుంది

మీరు ఎందుకు అంతలా వగరుస్తున్నారు?? ఏదైనా పీడకల వచ్చిందా...అని అడిగింది.

శంకరం అవును కాంతం నాకు చాలా చెడ్డ పీడ కల వచ్చింది. నా బంగారు తల్లి నన్ను వదిలి వెళ్లిపోయినట్లు కల వచ్చింది. ముందు నన్ను సుజాతను చూసి రాని.. అని ఉన్నపళంగా..తన తల్లి గదికి వచ్చాడు. ఆ గదిలో సుజాత ఒక మంచం మీద...తన తల్లి ఒక మంచం మీద హాయిగా నిద్రపోతున్నారు. శంకరం సుజాతను చూసి...హమ్మయ్య.. రక్షించావు భగవంతుడా అని మనసులో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు.

కొంచెం స్థిమిత పడిన శంకరం...కాంతం పద మన గదికి వెలదాము అని..తన తల్లి గది తలుపులు చప్పుడు కాకుండా నెమ్మదిగా వేసి తమ గదికి వెళ్లిపోయారు.

కాంతం అంది..ఇప్పుడు చెప్పండి ...ఏమైందని అంతలా కలవరించారు...అంతలా భయపడ్డారు??? అని అడిగింది.

అప్పుడు శంకరం తనకు వచ్చిన కల మొత్తం వివరించడంతో... కాంతం అంది...మీరు దిగులు పడకండి. ఈ పిడకలతో సుజాతకు ఉన్న కీడు తొలగిపోయింది.

ఈ మధ్య మీకు దాని పెళ్లిమీద ధ్యాస పెరిగి ...చదువును మధ్యలో ఆపేద్దాము అనుకున్నారు. దాని కల నిజంకాదు అని అది నిజంగానే బెంగతో ఉంది...కాకపోతే మీకు ఎదురు పడి చెప్పే ధైర్యం లేక దానిలో అదే సతమత మవుతోంది.

అయినా తెలియక అడుగుతాను... దాని వయసెంతని మీరు ఊరికే అప్పుడే పెళ్లి పెళ్ళి అని కలవరిస్తున్నారు?? నిండా 17ఏళ్ళ కూడా లేని దానికి పెళ్ళి ఏంటని నేను ..అత్తయ్యగారు కూడా అనుకున్నాము.. కానీ మీరు ఎక్కడ పడనిచ్చేరు మా మాట.! అని నిష్ఠురపడింది.

శంకరం...అవును కాంతం -- నీవు చెప్పింది నిజమే . ముందు పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి. అప్పుడే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడగలరు.

నా చిట్టి తల్లి కోరిక మేరకు..అది బాగా చదువుకుని అది కలలుగనే వ్యవసాయ రంగంలో గోల్డ్మెడల్ వచ్చేవరకు..దానికి పెళ్లి అని అనను.

మంచిది...మంచి నిర్ణయం తీసుకున్నారు..అని కాంతం అంది. ఇంక పడుకుందామ..?? అని అడగడంతో ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు.

శంకరం...శంకరం భార్య కాంతం అనుకున్నట్టుగానే..సుజాత పెళ్ళివిషయం ఇంక నిరవధికంగా వాయిదా వేసి...తనను చదువులో బాగా ప్రోత్సహించారు. సుజాత కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతోనే కాకుండా...మంచి జ్ఞానంతో..పట్టుదలతో..కృషితో వ్యవసాయ రంగంలో Ph.D చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకుంది.

ఎక్కడో ఖండాంతరాల్లో కాకుండా...తన సొంతఊరిలో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పి..కొత్త వంగడాలు కనుగొని...వాటిని విస్తరించే క్రమంలో ... సేంద్రియ పద్ధతులతో ఎక్కువ దిగుబడి...మంచి బలవర్ధకమైన..పౌష్ఠికమైన...స్వచ్ఛమైన ఆహార పంటలను పండించే విధానాలను తమ ఊరిలో మొదలు పెట్టించింది. మంచి ఫలితాలు రావడంతో..ఇతర గ్రామాల రైతులు కూడా సుజాతను సంప్రదించడం..సలహాలు పాటించడం... తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతో ..సుజాత పేరు.. ఉరూరూరా మారుమోగి...చిన్న వయసులోనే మంచి పేరు గడించింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా Indian Council of Agricultural Research వారిచ్చే ""Swamy Sahajanand Saraswati Extension Scientist/ Worker Award తీసుకుంది. ఇవన్నీ చూసిన శంకరం ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లి...మా అమ్మాయి ..మా అమ్మాయి సుజాత అని ఫంక్షన్ కు వచ్చినవాళ్లకు గర్వంగా చెప్పుకున్నాడు. శంకరం ఆనందానికి అవధుల్లేవు.

అందరూ సంతోషంతో కాలం గడుపుతున్నారు.

ఒకరోజు సుజాతకు మంచి సంబంధం వచ్చింది. అప్పుడు భార్యతో ఇలా అన్నాడు..కాంతం..అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటేనే నేను వాళ్ళతో మాట్లాడతాను. లేదు అంటే లేదు. నా బంగారు తల్లి మనసును మాత్రం కష్ట పెట్టను. ఆడ పిల్లకు పెళ్లి మాత్రమే జీవిత పరమావధి కాదు అని గుర్తించాను. కాబట్టి దానిని నొప్పించే పని ఇంకెప్పుడు చెయ్యను అని చెపుతాడు.

భర్త మాటలు కాంతానికి చాలా ఆనందాన్ని ఇచ్చాయి. సుజాత.. శంకరం తల్లి...కొడుకు రమేష్ కూడా...శంకరం నిర్ణయానికి సంతోషించారు.

ఆనాటి నుండి శంకరం..అందరి తల్లి దండ్రులను వేడుకుంటున్నాడు...చూడండి...అడపిల్లలను సరైన రీతిలో పెంచి..వాళ్ళ కలలకు ప్రోత్సాహాన్ని ఇస్తే ...వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారు. ఒక ఝాన్సీలా....ఒక రుద్రమ లా.. ఒక అనిబీసెంట్ లా...ఒక ఇందిరమ్మ లా తయారవుతారు.... కాబట్టి...ఆడపిల్లను చిన్న చూపు చూడవద్దు..పెళ్లి పెళ్లి అని వారి కలలను కూల్చవద్దు..



Rate this content
Log in

Similar telugu story from Drama