Radha Krishna

Classics Inspirational

4  

Radha Krishna

Classics Inspirational

మంచి మనసు

మంచి మనసు

2 mins
246


శారద అమ్మమ్మ ...తాతయ్యల సంరక్షణలో పెరిగింది. వాస్తవానికి శారద తల్లి ఒక నయవంచకుడి చేతిలో   మోసపోయింది. ఆ మోస ఫలితమే ఈ శారద.

శారద తల్లి ..తను మోసపోయిన తరువాత...తన బిడ్డను తన తల్లిదండ్రుల సహకారంతో పెంచుకుంది. విద్యా బుద్ధులు నేర్పించింది. ఇంట్లో ఉన్న ఒకే ఒక మగదిక్కు శారద వాళ్ళ తాతగారు. శారద పుట్టేనాటికే... అతను చిన్న ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. వచ్చే కొద్ది పాటి ఫించనుతో శారదతో కలిపి ఇంట్లోని ఆరుగురు బ్రతికే వారు.

చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటిల్లిపాది తమవంతు ఆదాయాన్ని సమకూర్చుకుని...అన్న పానీయాలకు లోటు లేకుండా...ఎవరి ముందూ దేహి అని అర్ధించకుండా జీవనం గడిపేవారు.

శారద... ఇంటర్ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ..ఇంటికి భారం కాకుండా ...తనవంతు సంపాదన అందించేది. శారద వాళ్ల పెద్దమ్మ చొరవతో...చిన్న ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. అదే సమయంలో దేముడికి కన్ను కుట్టి... శారద వాళ్ళ తాతగారిని తన దగ్గరకు తీసుకుపోయాడు. ఉన్న ఒక్క మొగ దిక్కు దూరం కావడంతో శారద కుటుంబం అంధకారంలో కూరుకుపోయింది.

కాలానికి అన్నిటిని మాపగలిగే గుణం ఉన్న కారణం చేత...ఎన్నో ఇబ్బందులు... మరెన్నో కోరికల చూపుల నడుమ ధైర్యంగా నిలబడి ...శారద కుటుంబాన్ని పోషిస్తోంది.

శారద పెదనాన్న గారి రికమండేషన్తో వైజాగ్ లో ఒక చిన్న కంపనీ లో కొద్దిపాటి మెరుగైన జీతంతో ఉద్యోగంలో జాయిన్ అయింది.

కొంత కాలం గడిచాక...శారద వాళ్ల ఇంటి ప్రక్కనే...m sc. చదవడం కోసం కొంతమంది బాచిలర్స్ అద్దెకు దిగారు. అందులో ఒకరు శశికాంత్.

శశికాంత్ ఉన్న అందరిలోకి కాస్త నెమ్మది...మర్యాద కలిగిన వ్యకి. ఆ బ్యాచిలర్స్ అందరూ త్వరగా శారద వాళ్ళ కుటుంబంతో కలిసిపోయారు. శశికాంత్ మాత్రం శారద కుటుంబ పరిస్థితులు తెలుసుకుని....జాలి పడి.. తన చదువు అయ్యే వరకు వాళ్ళకి ఇంట్లోని వ్యక్తిలా అన్నింటిలో చేదోడువాదోడుగా ఉండేవాడు.

ఈ క్రమంలో శశికాంత్ శారదను తనకు తెలియకుండానే ఇష్ట పడ్డాడు. తన MSc పూర్తి అయ్యేలోపు చెపుదామని ఆగాడు.

లాస్ట్ సెమిస్టర్ ముందు శారద తో తన మనసులోని మాటను చెప్పాడు. అప్పుడు శారద... చూడండి ...మీకు మాకు కుదరదు...కులాలు వేరు...పైగా మీరు ఇంటికి పెద్ద కొడుకు ... మీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు మీ వాళ్ళు. పైగా నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబానికి నేనే ఆధారం. కాబట్టి నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు ..అని నిఖ్ఖచ్చిగా చెప్పింది.

అది విన్న శశికాంత్...పెళ్లి తరువాత నీ కుటుంబం..నా కుటుంబం...అంతా మన కుటుంబం అవుతుంది. అప్పుడుకూడా...నీ బాధ్యతను నువ్వు నిరవధికంగా నిర్వహించవచ్చు. నీకు ఎలాంటి ఆంక్షలు పెట్టను అని మాటిచ్చారు. అతని భరోసాకు శారద సంతోషించి...సరే..ముందు మీ ఇంట్లో ...మాఇంట్లో మాట్లాడుకోండి .. వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి. లేదంటే లేదు అని చెప్పింది.

శశికాంత్ తన వాళ్లను ఒప్పించి...శారద వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ను ఒప్పించి...తన పి.జి. పూర్తి అయ్యాక..వైజాగ్ లోనే ఉద్యోగం సంపాదించుకుని... ఇరు పెద్దల సమక్షంలో అన్నవరం స్వామి సన్నిధిలో వివాహం చేసుకుని శారద వాళ్ళ కుటుంభంతోనే కలిసి జీవితాన్ని కొనసాగించారు.

అసలు ఊహించిన ఈ అదృష్టానికి ...శశికాంత్ మంచి హృదయానికి .. శారద, వాళ్ల కుటుంబ సభ్యులు చాలా ఆనందించారు. ఉన్న ఒక మొగ దిక్కున తీసుకుపోయి అన్యాయం చేసిన దేముడు... శశికాంత్ రూపంలో న్యాయం చేసాడని...అతనికి శతకోటి ప్రామణములు తెలిపారు.

ఇది..ఒక యదార్ధ గాధ. కుదించి రాసాను. పూర్తిగా రాస్తే ఒక ధారావాహిక అవుతుంది.

✍️✍️ రాధ


Rate this content
Log in

Similar telugu story from Classics