Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

శుభసంకల్పం

శుభసంకల్పం

2 mins
323


అంటే ఏంట్రా నువ్వనేది? ఇక జీవితం ఇలా యాంత్రికంగా గడిపేస్తావా? విశ్వని అడిగాడు రేవంత్.


ఏం చెయ్యనురా. ఉన్న టైమ్ మొత్తం జాబ్ చేయడంలో సరిపోతుంది. ఇక రూముకు రావడం. పడిపోవడం. అంతే.

విశ్వ నిర్లిప్తంగా అన్నాడు.


ఏంట్రా నువ్వనేది. రోజుకు పదిహేను గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టిన నువ్వా ఇలా మాట్లాడేది? రేవంత్ ఏదో పుస్తకాన్ని కదుపుతూ అన్నాడు.


విశ్వ రూం లో బుక్ షెల్ఫ్ రకరకాల పుస్తకాలతో నిండిపోయి ఉంది.


అవున్రా. అంతలా చదివాను కాబట్టే ఇలా ఉన్నాను. ఏం ప్రయోజనం. UPSC ఇంటర్యూ క్లియర్ చెయ్యలేకపోయాను. ఇప్పుడు నువ్వు చేసే కామెంట్స్ వినాల్సి వస్తోంది అని ముఖం అటు వైపు తిప్పుకున్నాడు.


రేవంత్ నిశ్శబ్దంగా లేచి నిలబడ్డాడు. విశ్వ ఏడ్చే శబ్దం వినబడింది అతడికి.


రేయ్. ఎందుకురా ఇప్పుడు ఏడుస్తున్నావ్ అని రేవంత్ అతడిని సముదాయించబోయాడు. విశ్వ రేవంత్ చెయ్యి పట్టుకుని సారీ రా. లాస్ట్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అవడంతో ఇక ఏం చెయ్యాలో తెలీలేదు. ఉన్న రిఫరెన్స్ తో చిన్న జాబ్ చూసుకున్నాను. కానీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. I am not enough అనే ఫీలింగ్ చాలా భయంకరమైందిరా. మనల్ని మనం రిజెక్ట్ చేసుకుంటూ బ్రతకాలంటే ఏదోలా ఉంది. ఆ కోపంలో నిన్ను కూడా బాధపెట్టాను అని తన మనసులో ఉన్న బాధను స్నేహితుడితో చెప్పుకున్నాడు.


మావా ఏంట్రా ఇది. మనలో మనకు సారీ ఎందుకురా. నాకు తెలీదా IAS కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో. కానీ అది రాలేదని నువ్వు ఇలా ఉండిపోతే ఇంట్లో వాళ్లకు ఎవరు ధైర్యం చెబుతారు చెప్పు. ఆలోచించు.


జాబ్ లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించరా. ఖాళీ దొరికినప్పుడల్లా ఆన్లైన్లో IAS aspirants కి నీకు వచ్చిన టాపిక్స్ చెప్పరా. ఇప్పుడు చాలా apps ఉన్నాయి టీచింగ్ కి రేవంత్ ఎంతో ఇంట్రస్ట్ గా చెప్పాడు.


నేనే ఫెయిల్యూర్ నిరా. నేను చెప్పేది విని ఎవరు ప్రిపేర్ అవుతారు? విశ్వ నిరాశగా అన్నాడు.


ఏం పర్లేదు. ఇప్పుడు చాలా మంది IAS failed aspirants, ఇంకా అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా చెబుతున్నారు. అందరికీ అన్నీ టాపిక్స్ రావు కదరా. నీకు జనరల్ స్టడీస్ కొట్టిన పిండి కదా. అదే చెప్పు. అది చెప్పేటప్పుడు, చెప్పడానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ సమయం సద్వినియోగం అవుతుంది.


నువ్వు ఎలా ఫెయిల్ అయ్యింది చెప్పు. అలాంటి తప్పులు చేయకుండా సూచనలు ఇవ్వు. 


నీవల్ల ఒక్కరికి బెనిఫిట్ కలిగినా ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే 

మజాయే వేరు కదా. ఒక మంచి సంకల్పంతో ముందడుగు వెయ్ రా. నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ప్రయాణం మొదలుపెట్టు అని బాగా ఎంకరేజ్ చేశాడు రేవంత్.


విశ్వ కళ్ళు తుడుచుకున్నాడు.

సరేరా. నేను బయటికి వెళ్లి కర్రీస్ తీసుకు వస్తాను అని బయటికి వెళ్లాడు రేవంత్.


విశ్వ ఫోన్ పట్టుకుని ఆన్లైన్ కోసం లెక్చర్ రికార్డు ఎలా చేయాలో వెతుకుతూ ఉన్నాడు.

అతనికి తన కర్తవ్యం బోధపడింది. జాబ్ తరువాత ఉండే సమయాన్ని ఎలా ఉపయోగించాలో ఒక మార్గం దొరికింది


Rate this content
Log in

Similar telugu story from Abstract