Midhun babu

Romance

4  

Midhun babu

Romance

శ్రీవారికి ప్రేమ లేఖ

శ్రీవారికి ప్రేమ లేఖ

1 min
446



ప్రియమైన మానస చోరునికి, 

    ఆనాడు నా ఎదను మీ మధుర పలుకుల సరాగాలతో మీటుతున్న తరుణాన మీ పై ఆఫీసరు ఊరికి పిలిచినంతనే నాకు టాటా అని చెప్పి ఫోను చేస్తానన్న మీరు పని వత్తిడి లో ఇంతవరకు మీ స్వర మధురిమలు వినిపించకపోవడంతో విలవిలలాడే నా కర్ణములే.ఐనా ఎంత పనైనా నను వీడని మీ నీడ నా వెంటే ఉంటుందన్న నిజం తెలిసినా మీ జాఢ లేని మన పెరటి జాజులు విరహంతో ఎదురు చూస్తున్నాయి.మన జంట గుస గుసలు తన సఖులతో చాటుగా వినే రేరాజుని పున్నమి మీరు లేరని నాకు గ్రీష్మ కాంతులు విరజిమ్ముతున్నాడు.

  మరేమో తారీఖులు మారరుతున్నా మీ అనురాగాలాపన సందె పొద్దుల్లో నను నిలువనీయకుండా మీ వెంటే నేనని విరహపు జ్వాలనేమో రగిలిస్తూనే ఎప్పుడెప్పుడు మీ ఫరిష్వంగనను ఆస్వాధిస్తానానని ఆతృత పడుతోంది.

   ఎంత చెప్పినా తక్కువే కానీ మీ ఆగమనంలోనే నా హృది స్పందన ఉందని తెలుసుకోగల రసికులైన మీ ఊపిరికి లయనై నేను నిరీక్షిస్తూ.

                       


Rate this content
Log in

Similar telugu story from Romance