STORYMIRROR

సేవలో పోటీ

సేవలో పోటీ

1 min
290


ప్రతీ సారీ మథర్ థెరీసా నా ఇన్స్పిరషన్ అని చెప్పుకోవడం కాదు.

అప్పుడప్పుడు కాస్త పక్క మనుషులకు కూడా సాయం చెయ్యాలి.


నా కొలీగ్ విక్కీ నన్నే కమెంట్ చేస్తున్నాడు.నేనేం మాట్లాడలేదు.ఇదంతా గమనిస్తున్న మా మేనేజర్ నన్ను క్యాబిన్లోకి పిలిచి అసలు విషయం ఏంటి అని అడిగారు.

ఏం లేదు సార్!

మొన్నామధ్య విక్కీని నేనోసారి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమానికి రమ్మన్నాను.


తను ఇవన్నీ టైం వేస్టు అని కొట్టి పడేశాడు.నిన్న మీరు నన్ను CSR(కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ) ప్రోగ్రామ్ నిర్వహించమని చెప్పే సరికి టీంలో

తన వాల్యూ తగ్గిపో

తోందని మొన్న నేను రమ్మన్నా రాకుండా ఉన్న వృద్ధాశ్రమానికి డొనేషన్ ఇచ్చి వచ్చాడు.

అందుకే అలా కమెంట్ చేస్తున్నాడు.


మరి నీకు బాధగా లేదా విశేష్!

మా మేనేజర్ ముఖంలో ఏదో తెలీని ఫీలింగ్.


ఎందుకు సార్ బాధ.నా మీద పోటీ వల్ల విక్కీ డొనేషన్ ఇచ్చి వచ్చాడు.ఎలాగయితేనేం ఆ ఆశ్రమానికి మంచే జరిగింది కదా.

ఏమంటారు?అని మేనేజర్ వైపు చూశాను.


మంచి ఆలోచనలు ఉన్న వాడివే.మన CSR ప్రోగ్రాం కూడా అదే ఆశ్రమంలో ప్లాన్ చెయ్యి.

పోటా పోటీగా సేవ చేస్తుంటే చూడాలనుంది అని భుజం తట్టాడు మా మేనేజర్.



Rate this content
Log in

Similar telugu story from Drama