రోజు కూలీ
రోజు కూలీ


04-04-2020
ప్రియమైన డైరీ,
భారత దేశం లాక్ డౌన్ లో ఇది పదకొండో రోజు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేసే చాలా మందికి ఇంకా జీతాలు అందలేదు.
చాలా శాఖలు తమ ఉద్యోగుల్లో ఒక్క రోజు జీతాన్ని కరోనా వైరస్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు ఇచ్చినట్లు చెబుతున్నారు.
అలా బయట రోడ్డు మీద చూశాను.పూలు పళ్లూ అమ్మే వాళ్ళు బుట్టల్లో తోపుడు బళ్ల మీద వాటిని
అమర్చుకుంటున్నారు.వారికి సరిగ్గా బేరాలు దొరికితేనే మళ్లీ రేపు వ్యాపారానికి డబ్బు పెట్టగలరు.
ఇంక రోజూ కూలి పనులు చేస్తూ అక్కడ యజమాని పెట్టే తిండి తిని డబ్బులు తీసుకుని ఇళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఎంత దారుణమో కదా.
ప్రభుత్వం ఇంకా దాతలు అందరికీ ఆహారం దొరికేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అవి ఫలించాలని ఆశిద్దాం.