Kishore Semalla

Drama Inspirational Others


5  

Kishore Semalla

Drama Inspirational Others


రక్త సంబంధం

రక్త సంబంధం

3 mins 21 3 mins 21


సంక్రాంతి వస్తుంది అంటే ఇంటి బెంగ పట్టుకుంటుంది అందరికి. ఊరికి తుర్రుమంటారు పిల్లా పెద్దా అంతా. సంవత్సరం మొత్తంలో దాచుకున్న సెలవులన్ని ఒకేసారి వాడుకుంటారు. కానీ గణేష్ పరిస్థితి అలా కాదు. ఏ ఊరు తనదో తనకే తెలియదు. ఒక వయసు వరకు అనాధ సరణాలయం లో బ్రతికాడు. ఉద్యోగం వచ్చాక భాగ్యనగరం లో స్థిరపడ్డాడు.. హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది.. హైదరాబాద్ రోడ్లు ఇంత విశాలంగా కనిపిస్తున్నాయి అంటేనే ఈ పండగ పది రోజులు మాత్రమే అని అర్ధం చేసుకోవాలి..

అందరూ ఇళ్ళకి చేరుకున్నారు.. కానీ గణేష్ కి ఎక్కడికి వెళ్ళేది లేదు.. ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొత్త సినిమాలు ఏమున్నాయో అని చూసుకున్నాడు. నచ్చిన సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంకా చాలా టైం ఉంది సినిమాకి, అంతవరకు కాలక్షేపం చేద్దామని ఫోన్ లో వాట్సాప్ స్టేటస్ చూస్తున్నాడు..

సుధీర్ అని తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చూసాడు..

"సికింద్రాబాద్ దగ్గర బైక్ ఆక్సిడెంట్, యశోద హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.. పేషెంట్ పరిస్థితి అయోమయంగా ఉంది.. అర్జంట్ గా AB- బ్లడ్ కావాలి"..చాలా అరుదైన బ్లడ్ గ్రూప్..గణేష్ ది కూడా అదే బ్లడ్ గ్రూప్..

ఒక ప్రాణం తన వల్ల బ్రతుకుతుంది అంటే అంతకుమించిన పండగ ఇంకేముంటుంది అనుకున్నాడు. వెంటనే యశోద హాస్పిటల్ కి బయల్దేరాడు. డాక్టర్ ని కలిసి తనది అదే బ్లడ్ గ్రూప్, పేషెంట్ కోసం వచ్చాను అని చెప్తాడు..

ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ తనకి చెయ్యాల్సిన పరీక్షలు అన్ని చేసి తన రక్తాన్ని పేషెంట్ కి ఎక్కించాడు.. బ్లడ్ ఇచ్చేసాక నీరసంగా ఉండడం తో గణేష్ ఇంటికి వచ్చేసాడు మళ్ళీ..

రోజులు గడిచిపోయాయి.. ఏ పండగ వచ్చిన అందరకి ఎవరో ఒకరు వుంటారు, కానీ గణేష్ కి అలా కాదు.. ఒంటరి గా పుట్టాడు, అన్ని పండగలు ఒంటరిగానే చేసుకుంటాడు.. బాధగా వున్నా అలవాటు అయిపోయిన దినచర్య కాబట్టి తేలికగా తీసుకుంటాడు.. కానీ తనకి ఎవరో ఒకరు వుంటే బాగుంటుంది అని మాత్రం కోరుకునే వాడు..

ఆరోజు రాఖీ పండుగ. ఎప్పటిలానే తెలిసిందే, గణేష్ కి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు.. తన స్నేహితులు అందరూ తమ చెల్లెళ్ళు దగ్గరకి వెళ్లారు.. తనకి ఓ అక్క కానీ చెల్లి కానీ ఉండి వుంటే ఆ అల్లరి అనుభవం పొందాలని, వాళ్ళకి ఓ అన్నయ్య గా కష్టం లోకానీ ఆపదలో కానీ సాయంగా వుండాలని అనుకున్నాడు..కానీ దేవుడు విధించిన శాపం అది.. అటువంటి సంతోషాలన్ని తన జీవితం లో నుంచి చిన్నప్పుడే లాగేసుకున్నాడు..

ఖాళీగా కూర్చున్నాడు తన గదిలో ఒంటరిగా..ఇంతలో తన స్నేహితుడు తన తలుపుని తట్టి..."గణేష్, నీకు ఏదో పోస్ట్ వచ్చింది" వచ్చి తీసుకో అని చెప్పాడు..

ఎక్కడ నుంచి పోస్ట్ వచ్చింది అని తీసుకున్నాడు.. పోస్ట్ మీద " మేరా ప్యారా భాయ్" అని రాసి ఉంది..తెరచి చూసాడు..

అందులో ఒక రాఖీ మరియు లేఖ వున్నాయి.. లేఖని తెరచి చదవడం మొదలుపెట్టాడు..

               "భయ్యా!! మేరా నాం ఫాతిమా..నాకు తెలుగు అంత బాగా రాదు..కానీ మీకోసం నేర్చుకుని మరి రాస్తున్న.. ఆరోజు మీరు రక్తం ఇచ్చి కాపాదింది మా భయ్యానే.. చిన్నప్పుడు పెద్ద కార్ ఆక్సిడెంట్ లో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు.. అన్న, నేను మాత్రమే బ్రతికాం..ఆ ఆక్సిడెంట్ లో నా రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి.. ఆరోజు నుంచి అన్నయ్యనే నాకు అన్ని కూడా అయ్యాడు.. ఆడుకోవాలి అంటే బొమ్మ అయ్యాడు, ఆకలి వేస్తే అమ్మ అయ్యాడు, ఆత్మవిశ్వాసం నింపిన నాన్న అయ్యాడు.. తనకి నేను, నాకు తనే..ఆరోజు ఆక్సిడెంట్ అయ్యాక మాకు సాయం చెయ్యడానికి ఎవరు లేరు..కానీ దేవుడి లా మీరు వచ్చారు..


       ఆప్నే ఖూన్ దియే ఔర్ మేరే భైయోన్ కి జాన్ బచాయి. (మీరు రక్తం ఇచ్చి మా అన్న ప్రాణం కాపాడారు)

      మేరే భాయ్ మేరే జీవన్ హై..మేరే పాస్ ఉస్కె స్వియ్ కోయి నహిన్ హై.(నా అన్నే నా జీవితం, వాడు తప్పితే నాకు ఇంక వేరే ఎవరు లేరు)

      ఆజ్ సే తు బి మేరే భాయ్. దో భాయ్ ఏక్ జాన్ మేరా.. (ఈరోజు నుంచి నాకు ఇద్దరు అన్నయ్యలు...)

      మీరు మా అన్న ని కాపాడి నాకు అన్నయ్య అయ్యారు.. మీ అడ్రస్ కనుక్కోడానికి నాకు చాలా టైం పట్టింది.. నా అన్న కి ప్రాణం పోసిన అన్న కి రాఖీ ఎలా ఐనా పంపాలి అనుకున్నాను..

       అల్లహ్ కి ప్రార్థన ఆప్కి జీవన్ బర్ కుష్ రకే ( మీ ఆనందం కోసం, మీరు కలకాలం ఇలానే హాయిగా జీవించాలి అని ఆ అల్లాహ్ ని ప్రార్ధిస్తాను)

       దిల్ సే శుక్రు హుం మెహ్ ఆప్కో ( హృదయ పూర్వక ధన్యవాదాలు).."

ఇది చదివిన గణేష్ ఆనంద పరవసుడయ్యాడు.. తనకి ఎవరు లేరు ఇన్నాళ్లు అనుకునే తన జీవితానికి ఒక కుటుంబం వచ్చింది.. ఒక అన్న, ఒక చెల్లి దొరికారు.

మనం చేసే ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపం లో మన దగ్గరకి చేరుతుంది..

ఆరోజు ఒక మంచి పని చేయడం వల్ల ఈరోజు అనాధ గా బ్రతుకుతున్న గణేష్ కి ఒక చెల్లి దొరికింది.. వెంటనే పోస్ట్ మీద వున్న ఫ్రొం అడ్రస్ కి బయల్దేరాడు..

వీల్ చైర్ మీద కూర్చున్న ఫాతిమా ని చూసాడు.. తన దగ్గరకు వెళ్లి నిల్చున్నాడు.. ఎవరూ?? అని అనుమానంగా అడిగింది ఫాతిమా..

అప్పుడు జేబులోంచి రాఖీని బయటకి తీసాడు గణేష్.. ఆ రాఖీని చూసి ఏడుపు తన్నుకొచ్చేసింది ఫాతిమా కి.. గెంటుకుంటూ బయటకి వచ్చాడు ఫాతిమా వాళ్ళ అన్నయ్య అమీర్.. గణేష్ ని హత్తుకున్నాడు ఒక్కసారి ఆనందం తో..

ఫాతిమా చేతిలో రాఖీ పెట్టి కట్టమన్నాడు గణేష్.. కళ్ళని తుడిచి గణేష్ చేతికి రాఖీ కట్టింది ఫాతిమా.. ఇన్నాళ్లకు గణేష్ కి ఒక మంచి మనుషులు కుటుంబం గా దొరికారు.. చాలా సంతోషించాడు..

"అప్పుడప్పడు మంచిని పంచి పెడుతూ ఉండాలి.. ఆ మంచే పొగయ్యి మనకి అవసరమైనప్పుడు సాయం చేస్తుంది."

                                         ౼ కిషోర్ శమళ్లRate this content
Log in

More telugu story from Kishore Semalla

Similar telugu story from Drama